news

News November 13, 2024

‘పుష్ప2’: శ్రీలీల రెమ్యునరేషన్ ఎంతంటే?

image

టాలీవుడ్‌ తెరకెక్కిస్తోన్న మరో ప్రెస్టీజియస్ మూవీ ‘పుష్ప-2’. ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ గురించి పెద్ద చర్చే నడుస్తోంది. అందులో యంగ్ బ్యూటీ శ్రీలీల చిందులతో సందడి చేయనున్నారు. అందుకోసం రూ.2 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు టాక్. ‘పుష్ప1’లో సమంత రూ.5 కోట్లు తీసుకున్నట్లు సమాచారం. అటు ఈ మూవీతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు సిద్ధం అవుతున్నారు.

News November 13, 2024

మండలి నుంచి YCP ఎమ్మెల్సీల వాకౌట్

image

AP: శాసనమండలి నుంచి వైసీపీ MLCలు వాకౌట్ చేశారు. విజయనగరంలో డయేరియా వ్యాప్తి విషయంలో మంత్రి సత్యకుమార్ వ్యాఖ్యలను నిరసిస్తూ వాకౌట్ చేసినట్లు సభ్యులు ప్రకటించారు. అనంతరం బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. ‘సత్యకుమార్ వ్యాఖ్యలు బాధాకరం. సభలో ఆయన వ్యక్తిగతంగా మాట్లాడటం సరికాదు. ఆయనకు పైశాచిక ఆనందం ఉన్నా సరే, సభలో హుందాగా మెలగాల్సింది’ అంటూ బొత్స ఫైరయ్యారు.

News November 13, 2024

లగచర్ల ఘటన రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు

image

TG: వికారాబాద్ లగచర్ల ఘటనకు సంబంధించి పోలీస్ రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు వెలుగు చూశాయి. మొత్తం 46 మందిని నిందితులుగా పేర్కొన్నారు. ఇప్పటివరకు 16 మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. A-1గా భోగమోని సురేశ్ పేరు చేర్చారు. అధికారులపై హత్యాయత్నం జరిగిందని, విచారణ కొనసాగుతోందని వెల్లడించారు. ప్లాన్ ప్రకారమే దాడి జరిగిందని పేర్కొన్నారు. ముందుగానే కారం, రాళ్లు, కర్రలు సిద్ధం చేసుకున్నారని తెలిపారు.

News November 13, 2024

యశ్ ‘టాక్సిక్’ మూవీపై కేసు నమోదు

image

కోలీవుడ్ స్టార్ హీరో యశ్ నటిస్తున్న ‘టాక్సిక్’ మూవీపై అటవీ శాఖ పోలీసులకు ఫిర్యాదు చేసింది. చిత్ర నిర్మాతలతోపాటు కెనరా బ్యాంక్ జనరల్ మేనేజర్, హిందుస్థాన్ మెషిన్ టూల్స్ జనరల్ మేనేజర్‌పై కూడా FIR నమోదైంది. ప్రస్తుతం ఈ విషయం శాండల్‌వుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. కాగా ‘టాక్సిక్’ షూటింగ్ కోసం మూవీ టీమ్ వందల ఎకరాల అటవీ భూముల్లో చెట్లను కొట్టివేసిందనే ఆరోపణలతో ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ ఫిర్యాదు చేసింది.

News November 13, 2024

RGVకి నోటీసులు ఇచ్చిన పోలీసులు

image

దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఏపీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. ప్రకాశం జిల్లా మద్దిపాడు ఎస్ఐ శివరామయ్య టీమ్ ఇవాళ HYDలోని ఆర్జీవీ ఇంటికి చేరుకుని నోటీసులు అందించారు. ‘వ్యూహం’ సినిమా ప్రమోషన్లలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేశ్‌ వ్యక్తిత్వాలు కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారంటూ మద్దిపాడు పోలీస్ స్టేషన్‌లో ఆర్జీవీపై కేసు నమోదైంది.

News November 13, 2024

ప్రభాస్ ‘స్పిరిట్’లోకి పూరీ జగన్నాథ్?

image

ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో తెరకెక్కనున్న స్పిరిట్ మూవీ గురించి టాలీవుడ్‌లో ఓ ఇంట్రస్టింగ్ అప్‌డేట్ చక్కర్లు కొడుతోంది. ఆ సినిమాకు డైలాగ్స్ రాయాలంటూ డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌ను సందీప్ అడిగారని సమాచారం. అందుకు పూరీ కూడా సుముఖంగానే ఉన్నట్లు తెలుస్తోంది. పూరీ ప్రభాస్‌తో తీసిన బుజ్జిగాడు, ఏక్ నిరంజన్ సినిమాల్లో డైలాగ్స్ పాపులర్ అయిన సంగతి తెలిసిందే.

News November 13, 2024

తగ్గిన బంగారం ధరలు

image

హైదరాబాద్ మార్కెట్లో ఇవాళ బంగారం ధరలు తగ్గాయి. 10 గ్రా. 24 క్యారెట్ల పసిడి ధర రూ.440 తగ్గి రూ.76,850కి చేరింది. 10 గ్రా. 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.400 తగ్గి రూ.70,450 పలుకుతోంది. అటు వెండి ధర రూ.1,000 పెరిగి రూ.1,01,000కు చేరింది.

News November 13, 2024

విరాట్, రోహిత్ బ్రేక్ తీసుకోవాలి: బ్రెట్‌ లీ

image

విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ క్రికెట్ నుంచి బ్రేక్ తీసుకోవాలని ఆస్ట్రేలియా మాజీ బౌలర్ బ్రెట్ లీ అభిప్రాయపడ్డారు. వరుస వైఫల్యాల కారణంగా వారిపై ఒత్తిడి పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ‘వారి ఫామ్ బాలేదు. జట్టు నుంచి ఇద్దరూ గ్యాప్ తీసుకోవాలి. క్రికెట్ నుంచి దూరంగా గడపాలి. సమస్యను గుర్తించి సరి చేసుకుని మళ్లీ ఫ్రెష్‌గా మొదలుపెట్టాలి. నేటికీ ఆ ఇద్దరూ అగ్రశ్రేణి బ్యాటర్లే’ అని పేర్కొన్నారు.

News November 13, 2024

బుల్డోజర్ యాక్షన్: ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు వార్నింగ్

image

బుల్డోజర్ యాక్షన్‌పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వాలు, అధికారులు జడ్జిలుగా మారి వ్యక్తులను దోషులుగా నిర్ధారించకూడదని, వారి ఆస్తులను ధ్వంసం చేయరాదని స్పష్టం చేసింది. ఒకవేళ నిజంగానే నేరనిరూపణ జరిగినా ఇళ్లను కూల్చకూడదని, అలా చేస్తే చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నందుకు అధికారులు శిక్షార్హులవుతారని హెచ్చరించింది. పేదలు ఇళ్లు కట్టుకోవడానికి ఎన్నో ఏళ్లు కష్టపడతారని గుర్తుచేసింది.

News November 13, 2024

పట్నం నరేందర్ రెడ్డికి కేటీఆర్ ఫోన్

image

TG: పోలీసుల అదుపులో ఉన్న కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డితో BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫోన్లో మాట్లాడారు. అక్రమ అరెస్ట్‌పై ఆందోళన చెందొద్దని, ధైర్యంగా పోరాడాలని కేటీఆర్ సూచించారు. ఈ విషయంలో ప్రభుత్వంపై బీఆర్ఎస్ పోరాటం చేస్తూనే ఉంటుందని చెప్పారు. ఆ తర్వాత నరేందర్ భార్య శ్రుతితో కూడా ఆయన ఫోన్‌లో మాట్లాడారు. కాగా లగచర్ల ఘటన ప్రధాన నిందితుడు సురేశ్ తమ్ముడిని పోలీసులు అరెస్ట్ చేశారు.