news

News November 12, 2024

AP అసెంబ్లీ, మండలిలో విప్‌లు వీరే

image

☛ అసెంబ్లీ విప్‌లు: ఆదినారాయణ రెడ్డి, అరవ శ్రీధర్, బి.అశోక్, బొలిశెట్టి శ్రీనివాస్, బొమ్మిడి నారాయణ నాయకర్, బోండా ఉమా, దాట్ల సుబ్బరాజు, దివ్య యనమల, థామస్. జగదీశ్వరి, కాల్వ శ్రీనివాసులు, మాధవి రెడ్డప్పగారి, PGVR నాయుడు, తంగిరాల సౌమ్య, యార్లగడ్డ వెంకట్ రావు.
☛ మండలిలో విప్‌లు: చిరంజీవి రావు, కంచర్ల శ్రీకాంత్, హరిప్రసాద్.
☛ <<14594795>>అసెంబ్లీ చీఫ్ విప్‌గా<<>> ఆంజనేయులు, మండలి చీఫ్ విప్‌గా అనురాధ నియామకం.

News November 12, 2024

బడ్జెట్ నిరాశపర్చింది: VSR

image

AP ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ సామాన్యుడికి నిరాశ కలిగించిందని YCP MP విజయసాయిరెడ్డి చెప్పారు. ‘ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఎప్పటి నుంచి అమలు చేస్తారో బడ్జెట్‌లో చెప్పకపోవడం ప్రజలను మోసం చేయడమే. ప్రజా ప్రయోజనాలు చెప్పకుండా ఈ బడ్జెట్ ప్రసంగం మొత్తం ఆత్మస్తుతి, వైసీపీపై నిందలతోనే నిండిపోయింది. చంద్రబాబు బడ్జెట్ స్వీయపొగడ్తలతో ఒక రాజకీయ కరపత్రంగా మిగిలింది’ అని Xలో విమర్శలు గుప్పించారు.

News November 12, 2024

యురేనియం తవ్వకాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం

image

AP: కర్నూలు జిల్లాలోని కప్పట్రాళ్ల రిజర్వు ఫారెస్ట్‌లో యురేనియం తవ్వకాలను నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రజల ఆందోళనలు దృష్ట్యా తవ్వకాలు నిలిపివేయాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ప్రజలు ఎలాంటి భయాందోళనకు గురికావొద్దని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా పేర్కొన్నారు.

News November 12, 2024

డిసెంబర్ 1 నుంచి బీజేపీ పాదయాత్ర

image

TG: అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా వచ్చే నెల 1 నుంచి బీజేపీ నేతలు పాదయాత్ర చేయనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని నిరసన తెలుపుతూ పాదయాత్రను చేయాలని నిర్ణయించారు. సీఎం రేవంత్ సవాలును స్వీకరిస్తూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నేతృత్వంలో ఈనెల 15 లేదా 16న మూసీ పరీవాహక ప్రాంతాల్లో బస చేయనున్నారు.

News November 12, 2024

అసెంబ్లీ చీఫ్ విప్‌గా జీవీ ఆంజనేయులు

image

AP: శాసన సభ, మండలిలో చీఫ్ విప్‌లు, విప్‌లను ప్రభుత్వం ఖరారు చేసింది. అసెంబ్లీలో 15 మందిని విప్‌లుగా నియమించింది. అసెంబ్లీ చీఫ్ విప్‌గా ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, శాసనమండలిలో చీఫ్ విప్‌గా పంచుమర్తి అనురాధ ఉండనున్నారు.

News November 12, 2024

ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ కోచ్‌గా మునాఫ్ పటేల్

image

ఢిల్లీ క్యాపిటల్స్ తదుపరి సీజన్ కోసం కొత్త బౌలింగ్ కోచ్‌ను నియమించింది. IPL-2025 సీజన్‌లో టీమ్ఇండియా మాజీ క్రికెటర్ మునాఫ్ పటేల్‌ బౌలింగ్ కోచ్‌గా ఉండనున్నారు. ఈయన భారత్ తరఫున 70 వన్డేలు ఆడి 86 వికెట్లు తీశారు. రికీ పాంటింగ్ ఆ ఫ్రాంచైజీని వీడిన తర్వాత భారత మాజీ క్రికెటర్లు హేమాంగ్ బదానీని హెడ్ కోచ్‌గా, వేణుగోపాలరావును డైరెక్టర్‌గా డీసీ మేనేజ్మెంట్ నియమించింది.

News November 12, 2024

CRDA పరిధి పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు

image

AP: క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (CRDA) పరిధిని 8,352 చ.కి.మీ.కు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పల్నాడు, బాపట్లలో విలీనం చేసిన ప్రాంతాలను CRDAలో కలిపింది. సత్తెనపల్లి పురపాలిక, పల్నాడు అర్బన్ అథారిటీలోని 92 గ్రామాలు, బాపట్ల అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీలోని 562చ.కి.మీ. విస్తీర్ణాన్ని CRDAలో కలుపుతూ ఉత్తర్వులు ఇచ్చింది.

News November 12, 2024

జైనుల ఆహారం ఎంత కఠినంగా ఉంటుందంటే..

image

జైనులకు అహింస పరమోత్కృష్టం. ఏ జీవికీ హాని తలపెట్టొద్దనేది వారి ధర్మం. అందుకే వారి ఆహార నియమాలు చాలా కఠినంగా ఉంటాయి. మద్యమాంసాల్ని, భూమి కింద పెరిగే దుంపల్ని, ఉల్లి, వెల్లుల్లిని తినరు. తేనెటీగలపై హింసను నివారించేందుకు తేనెకు దూరంగా ఉంటారు. పొరపాటున ఏ జీవినైనా తింటామేమోనన్న కారణంతో సూర్యాస్తమయం తర్వాత తినరు. నిల్వ ఉంచిన ఆహారం, ఉపవాస దినాల్లో ఆకుపచ్చ రంగు కూరగాయలు నిషేధం.

News November 12, 2024

BIG ALERT.. రేపు భారీ వర్షాలు

image

AP: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ దిశగా కదులుతూ ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా తీరాల వెంబడి కేంద్రీకృతమైందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో రేపు బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయంది. మిగతా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

News November 12, 2024

ఆస్ట్రేలియాలో రహస్యంగా టీమ్ ఇండియా సాధన?

image

ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ ముంగిట ప్రాక్టీస్‌ను రహస్యంగా ఉంచాలని టీమ్ ఇండియా భావిస్తున్నట్లు ది వెస్ట్ ఆస్ట్రేలియన్ పత్రిక ఓ కథనంలో తెలిపింది. IND ప్రాక్టీస్ చేస్తున్న పెర్త్‌‌కి ప్రేక్షకుల్ని రానివ్వడం లేదని పేర్కొంది. సిబ్బంది సైతం ఫోన్లను తీసుకెళ్లకుండా కఠిన నిబంధనల్ని భారత్ అనుసరిస్తోందని తెలిపింది. ప్రాక్టీస్ మ్యాచ్‌ కూడా ఆడకుండా కేవలం సిములేషన్‌తోనే సాధన చేస్తున్నట్లు వెల్లడించింది.