India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
శ్రీలంకపై దక్షిణాఫ్రికా విజయంతో ఆ జట్టు WTC ఫైనల్‌కు మరింత చేరువైంది. ప్రస్తుతం SA పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. పాకిస్థాన్‌తో జరిగే రెండు టెస్టు మ్యాచుల సిరీస్‌ను 1-0తో నెగ్గినా సౌతాఫ్రికా ఫైనల్ చేరుతుంది. మరోవైపు భారత జట్టు ఫైనల్ చేరాలంటే ఆస్ట్రేలియాపై 3-2/3-1 తేడాతో సిరీస్ గెలవాల్సి ఉంటుంది. కాగా ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా 2, భారత్ 3 స్థానాల్లో ఉన్నాయి.
పార్లమెంటు ఉభయ సభల్లో ఈ వారం రాజ్యాంగంపై ప్రత్యేక చర్చ ప్రారంభంకానుంది. శుక్రవారం లోక్‌సభలో రాజ్‌నాథ్ సింగ్ చర్చను ప్రారంభించనున్నారు. అధికార, విపక్ష సభ్యుల ప్రసంగాల అనంతరం చివరగా శనివారం PM మోదీ చర్చపై సమాధానమిస్తారు. రాజ్యసభలో 16న అమిత్ షా చర్చను ప్రారంభిస్తారు. 17న మోదీ రిప్లై ఇస్తారు. ఇటీవల రాజ్యాంగం చుట్టూ రాజకీయాలు జోరందుకోవడంతో చర్చకు ప్రాధాన్యం ఏర్పడింది.
వారానికి నాలుగు రోజులే పనిచేసేలా కొత్త రూల్‌ను టోక్యో పరిచయం చేస్తోంది. పనిచేసే తల్లిదండ్రులకు మద్దతు ఇవ్వడం, దేశ సంతానోత్పత్తి రేటును పెంచేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. జపాన్ జనాభా సంక్షోభం నేపథ్యంలో వర్క్ లైఫ్ బ్యాలెన్స్‌ను ఇంప్రూవ్ చేయడం, కుటుంబ వృద్ధిని ప్రోత్సహించడం ఈ విధానం లక్ష్యం. అయితే, ఈ నిర్ణయం వివాదాస్పదమవుతోంది. ఈ రూల్‌పై మీ అభిప్రాయం ఏంటి?
నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ తెరకెక్కిస్తోన్న ‘డాకు మహారాజ్’ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్‌పై అప్టేడ్ వచ్చింది. ‘ఫస్ట్ సింగిల్’ లోడింగ్ అంటూ బాలయ్యతో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఉన్న పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. దీంతో అతి త్వరలోనే సాంగ్ రిలీజ్ కానుంది. వచ్చే ఏడాది జనవరి 12న రిలీజ్ కానున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్మెంట్స్ నిర్మిస్తోంది.
AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు బెదిరింపులు కలకలం రేపాయి. ఆయనను చంపేస్తానని ఓ అగంతకుడు డిప్యూటీ సీఎం ఆఫీసుకు మెసేజ్ పంపినట్లు అధికారులు తెలిపారు. ఈ విషయాన్ని పవన్ దృష్టికి తీసుకెళ్లారు. మరోవైపు దీనిపై డిప్యూటీ సీఎం పేషీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయగా దర్యాప్తు చేపట్టారు.
జమిలి ఎన్నికల నిర్వహణకు NDA ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. వన్ నేషన్-వన్ ఎలక్షన్ బిల్లును ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే సభ ముందుకు తెచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. సభలో చర్చ అనంతరం దీనిపై JPCని ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. Sep 18న రామ్‌నాథ్ కోవింద్ కమిటీ ప్రతిపాదనలను క్యాబినెట్ ఆమోదించిన విషయం తెలిసిందే.
RBI గవర్నర్‌గా నియమితులైన సంజయ్ మల్హోత్రా 1990 బ్యాచ్‌కు చెందిన రాజస్థాన్ క్యాడర్ IAS అధికారి. IIT కాన్పూర్‌లో Graduation, Princeton University నుంచి పబ్లిక్ పాలసీలో Masters చేశారు. కేంద్ర ఆర్థిక శాఖలోనూ పని చేశారు. రాజస్థాన్‌లో విద్యుత్ విభాగ ప్రధాన కార్యదర్శిగా సంస్కరణలకు పునాది వేశారు. ఆర్థిక సేవలు, ఎనర్జీ, IT, మైనింగ్, Taxation రంగాల్లో ఆయనకు 33 ఏళ్లు పనిచేసిన అనుభవం ఉంది.
ఎలాంటి ఉద్యోగమైనా ఒత్తిడి తప్పకుండా ఉంటుంది. యూపీలోని ‘YES MADAM’ అనే కంపెనీ ఉద్యోగులు స్ట్రెస్ ఫీల్ అవుతున్నారా? అనే దానిపై సర్వే నిర్వహించింది. కంపెనీలో చాలామంది ఒత్తిడికి లోనవుతున్నామని బదులిచ్చారు. వారికి HR నుంచి టెర్మినేషన్ మెయిల్ రావడంతో అంతా షాక్‌కు గురయ్యారు. ‘హెల్తీ ఎన్విరాన్మెంట్ అందించడానికి మీ అభిప్రాయాలు పరిశీలిస్తాం. అయితే ఒత్తిడి ఉందన్నవారిని తొలగిస్తున్నాం’ అని కంపెనీ తెలిపింది.
ఫారిన్ టూరిస్టులను ఆకర్షించేందుకు జపాన్ కంపెనీ ఉండోకైయా కొత్తగా ఆలోచించింది. జపనీస్ స్కూల్ లైఫ్‌ను ఆస్వాదించేందుకు ఒక రోజు స్టూడెంట్ స్కీమ్‌ను తీసుకొచ్చింది. రూ.17వేలు చెల్లిస్తే చాలు. వయసుతో సంబంధం లేకుండా ఎవరైనా చేరొచ్చు. యూనిఫాంతో పాటు కటానా ఫైట్ నేర్చుకొనేందుకు కిమినోస్ డ్రెస్ ఇస్తారు. స్థానిక డాన్స్ నేర్పిస్తారు. యాక్టివిటీస్ చేయిస్తారు. క్లాసుల మధ్యలో భూకంపం వస్తే ఎలా బయటపడాలో బోధిస్తారు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త గవర్నర్‌గా IAS సంజయ్ మల్హోత్రా నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన రెవెన్యూ కార్యదర్శిగా ఉన్నారు. ప్రస్తుత గవర్నర్ శక్తికాంత దాస్ రేపు రిటైర్ అవుతున్న విషయం తెలిసిందే. ఎల్లుండి నుంచి మూడేళ్లపాటు మల్హోత్రా గవర్నర్‌గా కొనసాగుతారు.
Sorry, no posts matched your criteria.