India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: సీఎం జగన్‌పై టీడీపీ నేత నారా లోకేశ్ సెటైర్లు వేశారు. ‘ఆ రాయి కోడికత్తి చరిత్రను తిరగరాసింది. చీకట్లో లక్ష్యం తప్పకుండా ప్యాలస్ రాయి రెండు పిట్టలను కొట్టేసింది. లేని గాయానికి వేసిన కట్టు సైజు రోజురోజుకీ పెరుగుతోంది. ఈ”కట్టు”కథలు మే 13న కంచికి చేరుతాయి’ అని ట్వీట్ చేశారు.
తమిళనాడు లోక్‌సభ ఎన్నికలు ముగియడంతో కమల్ హాసన్ షూటింగ్ మొదలుపెట్టారు. మణిరత్నం డైరెక్షన్‌లో ఆయన నటిస్తోన్న ‘థగ్ లైఫ్’ మూవీ చిత్రీకరణ ఢిల్లీలో ప్రారంభమైంది. కొన్ని రోజులు అక్కడే షూటింగ్ కొనసాగుతుందని చిత్ర యూనిట్ తెలిపింది. క్లైమాక్స్‌లో వచ్చే ఫైట్ చిత్రీకరణ కోసం త్వరలోనే సెర్బియా వెళ్లనున్నట్లు పేర్కొంది. మణిరత్నం-కమల్ కాంబోలో ‘నాయకుడు’ తర్వాత 37 ఏళ్లకు వస్తోన్న మూవీ కావడంతో భారీ అంచనాలున్నాయి.
IPLలో మోస్ట్ అండర్‌రేటెడ్ బౌలర్లలో సందీప్ శర్మ తొలి స్థానంలో ఉంటారు. ఆరంభ ఓవర్లలో స్వింగ్, డెత్ ఓవర్లలో స్లో బాల్స్‌తో ప్రత్యర్థులను బోల్తా కొట్టిస్తారు. 119 మ్యాచుల్లో 7.84 ఎకానమీతో 130 వికెట్లు తీశారు. ఆసక్తికర విషయమేంటంటే.. గతేడాది వేలంలో సందీప్ శర్మను ఫ్రాంచైజీలు పట్టించుకోలేదు. రూ.50 లక్షల కనీస ధరకూ ఎవరూ కొనుగోలు చేయలేదు. చివరకు ఓ ప్లేయర్ గాయపడటంతో అతడి స్థానంలో రాజస్థాన్ శర్మను తీసుకుంది.
ముంబైకు చెందిన కాంచన్‌బెన్ బాద్షా వయసు 112 ఏళ్లు. సుఖంగా ఇంటి నుంచే నీడపట్టున ఉండి ఓటేసే అవకాశం ఉంది. కానీ ఆ అవకాశాన్ని తిరస్కరించారామె. ఓటు హక్కుపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు గాను స్వయంగా పోలింగ్ బూత్‌కు వెళ్లి ఓటేయాలని నిర్ణయించుకున్నారు. బెన్ సంకల్పానికి ముగ్ధులైన ఎన్నికల సంఘం స్థానిక అధికారులు ఆమెను సత్కరించారు. 1912లో పుట్టిన బెన్, ప్రస్తుతం తన మనుమల వద్ద ఉంటున్నారు.
ఈ సీజన్‌లో పేలవ ప్రదర్శన చేస్తోన్న RCB అభిమానులను నిరాశపరుస్తోంది. IPL-2019లో తొలి 8 మ్యాచ్‌ల తర్వాత కేవలం 2 పాయింట్లు సాధించగా, ఆ చెత్త రికార్డును ఈ ఏడాదీ రిపీట్ చేసింది. ఒక మ్యాచ్ మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. మిగిలిన ఆరు మ్యాచ్‌లను గెలిచినా ప్లేఆఫ్స్‌లోకి వెళ్లే ఛాన్స్‌ను కోల్పోయింది. వచ్చే ఏడాదైనా సమతూకంతో ప్లేయర్లను తీసుకోవాలని ఫ్యాన్స్ కోరుతున్నారు.
ఇంటర్ తర్వాత ఐదేళ్లకు బదులుగా మూడేళ్ల లా కోర్సు(LLB) చదివేందుకు ఛాన్స్ ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై CJI జస్టిస్ చంద్రచూడ్ ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘మూడేళ్లు కూడా ఎందుకు? హైస్కూల్ పూర్తవగానే లా ప్రాక్టీస్ మొదలుపెట్టండి’ అని ఘాటుగా వ్యాఖ్యానించింది. ప్రస్తుత విధానం సరిగానే ఉందని పేర్కొంది. కాగా ప్రస్తుతం డిగ్రీ పూర్తి చేసినవారు మాత్రమే నేరుగా మూడేళ్ల లా కోర్సులో చేరేందుకు అవకాశం ఉంది.
TG: మే 24న ‘పాలిసెట్-2024’ని నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. లేట్ ఫీజు లేకుండా ఏప్రిల్ 28 వరకు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చని తెలిపారు. రూ.300 ఆలస్య రుసుముతో మే 20 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మే 24న పరీక్ష నిర్వహించి, 10 రోజుల తర్వాత ఫలితాలు విడుదల చేయనున్నారు. రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాలకు ‘పాలిసెట్’ నిర్వహిస్తారు. సైట్: https://polycet.sbtet.telangana.gov.in
ప్రధాని మోదీ మరో పుతిన్‌లా అనిపిస్తున్నారని ఎన్సీపీ(ఎస్పీ) చీఫ్ శరద్ పవార్ విమర్శించారు. అందరిలో భయాన్ని పుట్టించేందుకు యత్నిస్తున్నారని మండిపడ్డారు. ‘కొత్త భారతదేశాన్ని నిర్మించేందుకు నెహ్రూ తర్వాత ఇందిర, రాజీవ్, నరసింహారావు, మన్మోహన్ లాంటి ప్రధానులు చేసిన కృషిని చూశాం. ప్రస్తుత పీఎం మాత్రం కేవలం విమర్శలకు పరిమితం. పదేళ్లలో ఏం చేశారో చెప్పరు. ఇతరుల్ని మాత్రం కించపరుస్తారు’ అని విమర్శించారు.
సోషల్ మీడియాలో పలువురు అమానవీయంగా ప్రవర్తిస్తున్నారు. UP టెన్త్ ఫలితాల్లో 98.50% మార్కులతో స్టేట్ టాపర్‌గా నిలిచిన ప్రాచీ నిగమ్ అనే బాలిక ముఖంపై కొందరు ట్రోల్స్ చేశారు. ఆమెకు అవాంఛిత రోమాలు ఉండటంపై ఎగతాళిగా పోస్టులు పెట్టారు. ఆ చదువుల తల్లిని ప్రశంసించాల్సింది పోయి పాశవిక మీమ్స్‌తో శునకానందం పొందారు. ఇది చాలా దారుణమని, ట్రోలర్స్‌ను ఉపేక్షించకుండా కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు కోరుతున్నారు.
AP: టెన్త్ విద్యార్థుల్లో ఆత్మ విశ్వాసం పెంచేందుకే ర్యాంకుల సంస్కృతికి ముగింపు పలికినట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేశ్ కుమార్ తెలిపారు. స్కూళ్లు మార్కుల ఆధారంగా ర్యాంకులు ప్రకటిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ విద్యాసంవత్సరం నుంచి ప్రతి విద్యార్థికి పర్సనల్ ఎడ్యుకేషన్ నంబర్(PEN) కేటాయించామని చెప్పారు. దీనిద్వారా విద్యార్థి దేశంలోని ఏ ప్రాంతానికైనా సులభంగా పాఠశాలను మారవచ్చన్నారు.
Sorry, no posts matched your criteria.