news

News April 3, 2024

రేపటి నుంచి జేఈఈ మెయిన్ సెషన్-2 పరీక్షలు

image

JEE మెయిన్ సెషన్-2 పరీక్షలు రేపటి నుంచి ఈనెల 12 వరకు జరగనున్నాయి. దేశవ్యాప్తంగా మొత్తం 12 లక్షల మంది అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరుకానుండగా, 291 నగరాల్లో 544 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. తెలుగు రాష్ట్రాల నుంచి 50వేల మంది విద్యార్థులు రాయనున్నారు. ఉ.9 నుంచి మ.12 వరకు మొదటి షిఫ్ట్, మ.3 నుంచి సా.6 వరకు రెండో షిఫ్ట్ పరీక్షలు జరగనున్నాయి. ప్రాంతీయ భాషల్లోనూ ఈ పరీక్షలు నిర్వహించనున్నారు.

News April 3, 2024

కాంగ్రెస్ నేతలకు కేటీఆర్ లీగల్ నోటీసులు

image

TG: మంత్రి కొండా సురేఖతో పాటు మరో ఇద్దరు కాంగ్రెస్ నేతలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లీగల్ నోటీసులు పంపారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తనపై తప్పుడు ఆరోపణలు చేశారని సురేఖతో పాటు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, కేకే మహేందర్ రెడ్డిపై పరువు నష్టం దావా వేశారు. తనకు క్షమాపణలు చెప్పాలని, లేదంటే న్యాయపరమైన చర్యలకు సిద్ధంగా ఉండాలని ఆయన ఇప్పటికే కాంగ్రెస్ నేతలను హెచ్చరించిన సంగతి తెలిసిందే.

News April 3, 2024

పవన్‌కు తీవ్ర జ్వరం.. పర్యటనలు రద్దు

image

AP: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. నిన్న స్వల్పంగా ఉన్న జ్వరం ఇప్పుడు తీవ్రమైనట్లు జనసేన పార్టీ ప్రకటించింది. దీంతో ఇవాళ్టి తెనాలి, రేపటి నెల్లిమర్ల పర్యటనలను రద్దు చేసుకున్నట్లు పార్టీ వెల్లడించింది. జ్వరంతో హైదరాబాద్‌కు వెళ్లిన జనసేనానికి కనీసం 2-3 రోజుల విశ్రాంతి అవసరమని వైద్యులు తెలిపినట్లు ట్వీట్ చేసింది. పర్యటన రీ షెడ్యూల్‌ను త్వరలో ప్రకటిస్తామని పేర్కొంది.

News April 3, 2024

NTRను హత్తుకున్న విశ్వక్.. లవ్ యూ అంటూ పోస్ట్!

image

యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ను హత్తుకుని దిగిన ఫొటోను మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ట్విటర్‌లో పోస్ట్ చేశారు. ‘లవ్ యూ తారక్ అన్నా. దేవర మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్ ఉందమ్మా. అనిరుధ్ మ్యూజిక్, ఎన్టీఆర్ అన్న యాక్టింగ్ ఇరగదీశారు. ఈ ఆల్బమ్ అందరికీ నచ్చుతుంది’ అని పోస్ట్ చేశారు. ఎన్టీఆర్‌కు విశ్వక్ వీరాభిమాని అన్న విషయం తెలిసిందే. ఆయన నటించిన ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ త్వరలో రిలీజ్ కానుంది.

News April 3, 2024

వైసీపీకి షాక్.. కిల్లి కృపారాణి రాజీనామా

image

AP: శ్రీకాకుళం జిల్లాలో YCPకి షాక్ తగిలింది. మాజీ కేంద్రమంత్రి కిల్లి కృపారాణి YCPకి రాజీనామా చేశారు. ‘పార్టీలో నాకు అన్యాయం, అవమానం జరిగింది. కేబినెట్ ర్యాంక్, MP టికెట్ ఇస్తామని మోసం చేశారు. పార్టీ అధ్యక్ష పదవి ఎందుకు ఇచ్చారో? ఎందుకు తీసేశారో తెలియదు. పదవుల కంటే నాకు గౌరవం ముఖ్యం. ఎక్కడ గౌరవం ఉంటే అక్కడ ఉంటా’ అని ఆమె వెల్లడించారు. అటు ఆమె కాంగ్రెస్‌లోకి వెళ్లనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

News April 3, 2024

వాలంటీర్లతో పెన్షన్లు పంపిణీ చేయాలన్న పిటిషన్ కొట్టేసిన కోర్టు

image

AP: వాలంటీర్ల ద్వారా పెన్షన్లు పంపిణీ చేయాలన్న పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. వాలంటీర్ల స్థానంలో పెన్షన్ల పంపిణీకి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు ప్రభుత్వం ఇచ్చిన వివరణతో న్యాయస్థానం ఏకీభవించింది. పెన్షన్లను వాలంటీర్లతో పంపిణీ చేయకూడదన్న ఈసీ ఆదేశాలపై సంతృప్తి వ్యక్తం చేసింది.

News April 3, 2024

త్వరలో ‘జ్ఞానవాపి’ సినిమా!

image

కశ్మీర్ ఫైల్స్, కార్తికేయ-2 సినిమాల్లాంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత నిర్మాత అభిషేక్ అగర్వాల్ మరో ఇష్యూపై మూవీ తీయనున్నారు. జ్ఞానవాపి మసీదు ఇష్యూపై ‘జ్ఞానవాపి’ అనే టైటిల్‌తో సినిమా నిర్మించనున్నారు. దీనిని వివిధ భాషల్లో చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ది ఢిల్లీ ఫైల్స్, ది ఇండియా హౌస్ చిత్రాలు నిర్మాణంలో ఉండగా.. వీటి తర్వాత ‘జ్ఞానవాపి’ రిలీజయ్యే అవకాశం ఉంది.

News April 3, 2024

ఢిల్లీ మంత్రి ఆతిశీకి BJP లీగల్ నోటీస్

image

ఢిల్లీ మంత్రి, ఆప్ నాయకురాలు ఆతిశీకి బీజేపీ లీగల్ నోటీస్ పంపించింది. తనను పార్టీలో చేరాలని లేదంటే అరెస్టుకు సిద్ధంగా ఉండాలని బీజేపీ బెదిరించినట్టు ఆమె ఆరోపించిన సంగతి తెలిసిందే. దీంతో ఆ పార్టీ ఆమెకు పరువునష్టం దావా నోటీస్ పంపింది. తమ పార్టీ తరఫున ఆమెను ఎవరు సంప్రదించారో వెల్లడించాలని డిమాండ్ చేసింది. ఇదిలా ఉంటే ఢిల్లీ CM కేజ్రీవాల్ జైలుకు వెళ్లడంతో ఆతిశీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు.

News April 3, 2024

నాకిష్టమైన కోస్టార్ అతనే: మృణాల్ ఠాకూర్

image

తనతో నటించిన వారిలో తనకు ఇష్టమైన కోస్టార్ దుల్కర్ సల్మాన్ అని హీరోయిన్ మృణాల్ ఠాకూర్ అన్నారు. ‘ఫ్యామిలీ స్టార్’ ప్రమోషన్ ఈవెంట్‌లో ఆమె మాట్లాడారు. ‘సీతారామం’ షూటింగ్ సమయంలో దుల్కర్ అడుగడుగునా ధైర్యానిచ్చారని తెలిపారు. ఆయన వల్లే సీత పాత్ర చేయగలిగానని చెప్పారు. పలు భాషల్లో నటిస్తున్నానంటే కారణం దుల్కర్ ఇచ్చిన స్ఫూర్తి అని పేర్కొన్నారు.

News April 3, 2024

విద్యార్థులకు అలర్ట్!

image

పాఠశాల పుస్తకాల ముద్రణకు సంబంధించి NCERT అప్డేట్ ఇచ్చింది. ఇప్పటికే 1, 2, 7, 8, 10, 12 తరగతులకు సంబంధించిన 33 లక్షల పుస్తకాలను ముద్రించి షాపులకు పంపిణీ చేసినట్లు తెలిపింది. 3& 6 తరగతుల కొత్త సిలబస్ పుస్తకాలు మే నెలలోపు ప్రచురిస్తామంది. 4, 5, 9 & 11 తరగతుల పుస్తకాలు ఈ నెలలో మార్కెట్‌లో అందుబాటులోకి వస్తాయని తెలిపింది. తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దని సూచించింది.