India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
భారత NSA అజిత్ ధోవల్, రష్యా సెక్రటరీ ఆఫ్ సెక్యూరిటీ కౌన్సిల్ సెర్గీ షోయిగు సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఓవైపు బ్రిక్స్ NSAల సమావేశాలు జరుగుతుండగానే వీరిద్దరు భేటీకావడం గమనార్హం. పరస్పరం లబ్ధిచేకూర్చే అంశాలపై వీరు మాట్లాడుకున్నారని తెలిసింది. భారత్ తమలాగే ఆలోచించే భాగస్వామి అని, విశ్వాస ఆధారిత రాజకీయ అంశాలపై వీరిద్దరూ చర్చించారని ఢిల్లీలోని రష్యా ఎంబసీ ప్రకటించింది.
TG: MLA కౌశిక్ రెడ్డి ఇంటిపై జరిగిన దాడిని KTR ఖండించారు. ‘పట్టపగలే MLAపై హత్యాయత్నమా? ఫ్యాక్షన్, రౌడీ రాజకీయాలకు రాష్ట్రాన్ని అడ్డాగా మార్చేస్తుంటే బాధేస్తోంది. కౌశిక్‌ను గృహనిర్బంధంలో ఉంచి అరికెపూడి గాంధీ గూండాలతో దాడి చేయిస్తారా? పార్టీ ఫిరాయించిన MLAలపై న్యాయపరంగా పోరాడుతున్నందుకే కౌశిక్‌ను టార్గెట్ చేశారు. ఇది కచ్చితంగా CM చేయించిన దాడే. దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి’ అని మండిపడ్డారు.
పెద్దపేగు క్యాన్సర్ పట్ల అప్రమత్తంగా ఉండాలని, 45 ఏళ్లు వచ్చాక ఈ వ్యాధి బారిన పడొచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మారుతున్న జీవనశైలి పెద్దపేగు క్యాన్సర్‌కు కారకం కావొచ్చని సూచించారు. ‘శారీరక శ్రమ లేకపోవడం. పండ్లు&కూరగాయలు తక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం. తక్కువ ఫైబర్ – అధిక కొవ్వు ఆహారం. ప్రాసెస్ చేసిన మాంసాలు అధికంగా ఉండే ఆహారం తినడం. ఊబకాయం, ఆల్కహాల్ తీసుకోవడం’ వంటివి క్యాన్సర్ కారకాలని తెలిపారు.
ముస్లిములు నమాజ్, అజాన్ చేసేటప్పుడు దుర్గా మండపాల వద్ద 5 నిమిషాల ముందే మైకులు, స్పీకర్లు ఆఫ్ చేయాలని బంగ్లాదేశ్ హోమ్ అఫైర్స్ అడ్వైజర్ జహంగీర్ ఆలమ్ అన్నారు. ఇందుకు పూజా కమిటీలు అంగీకరించాయని తెలిపారు. ‘ఈ ఏడాది 32,666 పూజా మండపాలు వెలుస్తాయి. విగ్రహాల తయారీ దశ నుంచే ఎలాంటి కలహాలు చెలరేగకుండా 24 గంటల భద్రతకు చర్యలు తీసుకుంటాం’ అని ఆయన చెప్పారు. బంగ్లాదేశ్‌లో హిందువులు జరుపుకొనే అతిపెద్ద పండుగ ఇదే.
TG: అరికెపూడి గాంధీపై BRS ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వాడిన భాష సరిగా లేదని TPCC చీఫ్ మహేశ్ గౌడ్ అన్నారు. ‘ఎవరు ఎవరిపై దాడి చేసినా కాంగ్రెస్ పార్టీ సమర్థించదు. ఈ దాడితో మా పార్టీకి సంబంధం లేదు. కౌశిక్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం వల్లే గాంధీ అనుచరులు ఆగ్రహించారు. అరికెపూడి టెక్నికల్‌గా BRS సభ్యుడే. నిబంధనల మేరకే PAC ఛైర్మన్ అయ్యారు. ఉపఎన్నికలు వచ్చినా KTRకు నిరాశ తప్పదు’ అని మీడియాతో వ్యాఖ్యానించారు.
TG: రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కుప్పకూలిందని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. ‘ఎమ్మెల్యే <<14082925>>కౌశిక్‌పై<<>> దాడి జరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారు? కాంగ్రెస్ ప్రభుత్వ చర్యల వల్ల హైదరాబాద్‌కు పెట్టుబడులు రావడం లేదు. HYD ఇమేజ్‌ను నాశనం చేస్తున్నారు. మా హయాంలో ఇలాంటి దాడులు జరిగాయా? గాంధీ, ఆయన గూండాలపై హత్యానేరం కింద కేసు పెట్టాలి’ అని డిమాండ్ చేశారు.
రీడింగ్ గ్లాసెస్ అవసరం ఉండదన్న <<14019427>>ప్రెస్‌వూ ఐడ్రాప్స్<<>> తయారీ లైసెన్స్‌ను DCGI సస్పెండ్ చేసింది. వారి అనాథరైజ్డ్ ప్రమోషన్ ప్రొడక్టుపై ప్రశ్నలు లేవనెత్తుతోందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ‘పేషంట్లకు అది సురక్షితం కాదేమోనన్న ఆందోళన కలుగుతోంది. డాక్టర్లు మాత్రమే ఆ ఐడ్రాప్స్ సూచించాలి. ప్రమోషనేమో OTC డ్రగ్ తరహాలో చేశారు’ అని పేర్కొన్నాయి. సస్పెన్షన్ నిర్ణయాన్ని కోర్టులో సవాల్ చేస్తామని కంపెనీ చెబుతోంది.
TG: తనను బతకడానికి వచ్చావా అన్న BRS MLA పాడి కౌశిక్ రెడ్డికి శేరిలింగంపల్లి MLA అరెకపూడి గాంధీ కౌంటర్ ఇచ్చారు. ‘నేను 3 సార్లు MLAగా గెలిచా. నన్ను <<14083308>>బతకడానికి <<>>వచ్చావా? అని ఎలా అంటావు? నువ్వు కరీంనగర్ నుంచి ఎందుకు వచ్చావు? బతకడానికి కాదా? 29 రాష్ట్రాల ప్రజలు ఉంటున్న ఈ ప్రాంతంలో జనం మధ్య విభేదాలు సృష్టించాలని చూస్తావా?’ అని గాంధీ ప్రశ్నించారు. అరెస్టైన ఆయన్ను గచ్చిబౌలి PSకు పోలీసులు తరలించారు.
TG: తన ఇంటిపై అరెకపూడి గాంధీ అనుచరులు దాడి చేయడంపై నాన్ లోకల్ అంశాన్ని BRS MLA పాడి కౌశిక్ రెడ్డి తెరపైకి తెచ్చారు. ‘మీకు దమ్ము లేదు. ఇంత మంది వచ్చి కూడా నా వెంట్రుక పీకలేదు. తెలంగాణ బిడ్డలం. బతకడానికి వచ్చిన ఆంధ్రోళ్లు దాడి చేస్తే భయపడేటోడు ఎవడూ లేడు. రేపు తెలంగాణ పవర్ ఏంటో చూపిస్తాం’ అని హెచ్చరించారు.
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు రేపు తీర్పు ఇవ్వనుంది. ఢిల్లీ లిక్కర్ స్కాం విషయంలో సీబీఐ నమోదు చేసిన కేసులో బెయిల్ కోరుతూ ఆయన పిటిషన్ వేశారు. కేజ్రీవాల్, సీబీఐ తరఫున వాదనలు విన్న న్యాయస్థానం రేపు తీర్పు ఇవ్వనుంది. ప్రస్తుతం కేజ్రీవాల్ తిహార్ జైలులో ఉన్నారు.
Sorry, no posts matched your criteria.