India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ప్రముఖ ఐటీ సంస్థ టీసీఎస్ తమ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పనుంది. మెరుగైన పనితీరు కనబరిచిన ఉద్యోగులకు 12-15 శాతం వేతనం పెంచే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ పెంపు ప్రక్రియ ముగింపు దశకు వచ్చినట్లు ‘బిజినెస్ స్టాండర్డ్’ కథనం పేర్కొంది. ఏప్రిల్ 1 నుంచే ఈ వేతన పెంపు అమల్లోకి వస్తుందని తెలుస్తోంది. దీనిపై టీసీఎస్ నుంచి స్పష్టత రావాల్సి ఉంది.
లోక్‌సభ ఎన్నికలు ఏప్రిల్ 19 నుంచి జూన్ 4 వరకు ఏడు దశల్లో నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే కేరళలో ఏప్రిల్ 26న(శుక్రవారం) పార్లమెంట్ ఎన్నికలు జరుగనున్నాయి. అయితే శుక్రవారం, ఆదివారం పోలింగ్ పెడితే వివిధ వర్గాలకు అసౌకర్యంగా ఉంటుందని, పోలింగ్ తేదీని మార్చాలని ఎన్నికల సంఘాన్ని కేరళ కాంగ్రెస్ కమిటీ కోరింది.
ఓ వైపు తల్లికి అనారోగ్యం.. మరోవైపు టెన్త్ పరీక్ష. ఇలాంటి క్లిష్టమైన సమయంలో పరీక్ష రాయాలని కొత్తగూడెంకు చెందిన మహేశ్ నిర్ణయించుకున్నారు. అయితే, పరీక్ష బాగా రాసానమ్మా అని చెప్పాలని తిరిగి వచ్చిన అతడికి కన్నీరే మిగిలింది. అప్పటికే అతడి తల్లి చనిపోయింది. ఇలానే.. ఖమ్మంలో అఖిల్, సూర్యాపేటలో మౌనిక, కామారెడ్డిలో స్రవంతి, SRCLలో శ్రవణ్, MHBNRలో అజయ్ తల్లిదండ్రులను కోల్పోయినా.. పది పరీక్షకు హాజరయ్యారు.
లోక్‌సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా BJP ‘వికసిత్ భారత్ సంపర్క్’ పేరుతో వాట్సాప్ మెసేజ్‌లు పంపుతోంది. మోదీ ప్రభుత్వ పని తీరు ఎలా ఉందో ఫీడ్‌బ్యాక్‌తో పాటు సలహాలు ఇవ్వాలని అడుగుతోంది. అయితే ఈ మెసేజ్ పేరుతోనే సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడే అవకాశముంది. వికసిత్ భారత్ మెసేజ్ 9275536906, 9275536919 నంబర్లతో మాత్రమే వస్తుంది. ఇతర నంబర్లతో వస్తే అది ఫేక్ అని, రిప్లై ఇవ్వొద్దని పలువురు సూచిస్తున్నారు.
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నారు. భార్య ఉపాసన, కూతురు క్లీంకారతో కలిసి విశాఖ బీచ్‌లో ప్రకృతిని ఆస్వాదిస్తున్నారు. క్లీంకారను బీచ్‌లో ఆడిస్తూ సరదాగా గడిపారు. ఇందుకు సంబంధించిన ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది. ఇక రామ్ చరణ్ ప్రస్తుతం ‘గేమ్ ఛేంజర్’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ మూవీ చేయబోతున్నారు.
సార్వత్రిక ఎన్నికలకు కౌంట్‌డౌన్ మొదలైన నేపథ్యంలో రాజకీయ పార్టీలు.. ముఖ్యంగా ఇండియా కూటమి ప్రచారం చర్చనీయాంశమైంది. భారత్ జోడో న్యాయ్ యాత్ర పేరుతో మణిపుర్-ముంబై రాహుల్ యాత్ర చేసినా అది రాజకీయంగా ఆశించినంత ఫలితాన్ని ఇవ్వలేదనేది విశ్లేషకుల మాట. ఇండియా కూటమి బీజేపీపై విమర్శలకు పరిమితం కాకుండా తమ ఎజెండా ఎంటో వివరించి, ప్రచారాన్ని విస్తృతం చేయాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు.
AP: ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వాలంటీర్లకు అధికారులు షాక్ ఇచ్చారు. ‘సిద్ధం’ సభలో పాల్గొనడంతో అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 16 మంది వాలంటీర్లపై వేటు పడింది. అంబాజీపేట మండలం మొసలపల్లి, వాకలగరువు, ఇరుసుమండకు చెందిన వాలంటీర్లను సస్పెండ్ చేశారు. ఇటు అనకాపల్లి(D)లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఇద్దరిని విధుల నుంచి తొలగించారు. పల్నాడు(D) పెదకూరపాడులో పార్టీ మీటింగ్‌లో పాల్గొన్న ఓ వాలంటీర్‌పై వేటు వేశారు.
అరుణాచల్ ప్రదేశ్ తమ భూభాగంలోనిదేనని ఇటీవల చైనా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను భారత విదేశాంగ శాఖ తోసిపుచ్చింది. ఆ ఈశాన్య రాష్ట్రం గతంలో, ఇప్పుడు, భవిష్యత్తులోనూ భారత్‌లో భాగంగానే ఉంటుందని స్పష్టం చేసింది. పదేపదే నిరాధార వాదనలు చేసినంత మాత్రాన అవి నిజమైపోవని పేర్కొంది. దేశం నుంచి ఆ రాష్ట్రాన్ని విడదీయలేమంది. అభివృద్ధి కార్యక్రమాలతో అరుణాచల్ ప్రజలు భవిష్యత్తులోనూ లబ్ధి పొందుతారని తెలిపింది.
AP: జగన్ పరిపాలన రాక్షస పాలనను తలపిస్తోందని పులివెందుల జై భీమ్ రావు భారత్ పార్టీ MLA అభ్యర్థి దస్తగిరి మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వంలో దళితులపై దాడులు పెరిగాయని ఆరోపించారు. రాష్ట్రంలో రాజారెడ్డి, జగన్ రాజ్యాంగం నడుస్తోందని మండిపడ్డారు. ఈసారి జగన్‌కు ఓటేస్తే మన గొంతు మనం కోసుకున్నట్లే అని అన్నారు. వివేకా హత్య కేసులో తాను అప్రూవర్‌గా మారకపోయి ఉంటే తనకు కూడా ఓటు అడిగే హక్కు లేదని అన్నారు.
జపాన్‌లోని ఓ ఆలయం విడాకులకు ప్రసిద్ధి చెందింది. భాగస్వామితో విడిపోవాలని అనుకుంటున్నప్పుడు క్యోటో నగరంలోని ‘యాసుయ్ కొంపిరగు’ అనే దేవాలయంలో మొక్కితే మన కోరిక నెరవేరుతుందట. డివోర్స్ వరకే కాదండోయ్.. వ్యాపార బంధాలు ముగించాలన్నా, ఉన్న ఉద్యోగంలో నుంచి సామరస్యంగా బయటకి పోవాలన్నా, మనకున్న శత్రుత్వ బంధాలకు స్నేహపూర్వకంగా పులిస్టాప్ పడాలన్నా ఆ దేవాలయంలో ప్రార్థనలు చేస్తే చాలని అక్కడి భక్తులు నమ్ముతున్నారు.
Sorry, no posts matched your criteria.