news

News April 24, 2024

రేపటితో ముగియనున్న జగన్ బస్సు యాత్ర

image

AP: గత నెల 27న ప్రారంభమైన సీఎం జగన్ ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర రేపటితో ముగియనుంది. రేపు ఉదయం 9 గంటలకు అక్కివలస నుంచి బయల్దేరి.. ఎచ్చెర్ల, కుశాలపురం, శ్రీకాకుళం బైపాస్, పలివలస, నరసన్నపేట, గట్లపాడు, వండ్రాడ, ఎత్తురాళ్లపాడు, కోటబొమ్మాళి మీదుగా పరుశురాంపురం చేరుకుంటారు. అనంతరం అక్కవరం బహిరంగ సభలో జగన్ ప్రసంగం అనంతరం ఈ యాత్ర ముగియనుంది. ఆ తర్వాత సీఎం తాడేపల్లికి బయల్దేరి వెళ్లనున్నారు.

News April 24, 2024

హైదరాబాద్ వస్తున్నాం: ఆర్సీబీ

image

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈ నెల 25న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడనుంది. ఉప్పల్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ కోసం ‘అందరికీ నమస్కారం. హైదరాబాద్ వస్తున్నాం’ అంటూ RCB ట్వీట్ చేసింది. ‘ఫామ్‌లో ఉన్న ప్రత్యర్థులను ఢీకొట్టేందుకు కొత్తగా లభించిన కాన్ఫిడెన్స్‌తో బరిలోకి దిగుతాం’ అంటూ ప్లేయర్ల ఫొటోలను జత చేసింది. ఇటీవల KKRపై గెలుపు అంచులదాకా వచ్చి ఒక్క పరుగు తేడాతో ఆర్సీబీ ఓడిన విషయం తెలిసిందే.

News April 24, 2024

గోవాలో డ్యుయల్ సిటిజన్‌షిప్ డిమాండ్ – 1/3

image

ఎన్నికల వేళ గోవా ప్రజలకు డ్యుయల్ సిటిజన్‌షిప్‌కు అనుమతించాలన్న డిమాండ్ మరోసారి చర్చనీయాంశమైంది. 1961లో గోవాను వీడుతూ పోర్చుగల్ ప్రభుత్వం అక్కడి ప్రజలకు ఆఫర్ ఇచ్చింది. 1961 డిసెంబరు 19కి ముందు పుట్టిన వారు సహా మరో రెండు భవిష్యత్ తరాల వారు పోర్చుగల్ పౌరసత్వం పొందేందుకు అవకాశం కల్పించింది. దీంతో చాలా మంది గోవా ప్రజలు పోర్చుగల్ పౌరసత్వం కోసం అక్కడ పుట్టినట్లు నమోదు చేసుకున్నారు. <<-se>>#Elections2024<<>>

News April 24, 2024

భారత్‌లో విదేశీయులుగా ఉంటూ.. – 2/3

image

డ్యుయల్ సిటిజన్‌షిప్ రాజ్యాంగ విరుద్ధం కావడంతో భారత్‌లో నివసించేందుకు కేంద్రం 2005లో ఓవర్‌సీస్ సిటిజన్‌షిప్ ఆఫ్ ఇండియా (OCI)ను ప్రవేశపెట్టింది. పాస్‌పోర్టు కార్యాలయం సరెండర్ సర్టిఫికెట్ ఇస్తే OCIకి దరఖాస్తు చేసుకోవచ్చు. కానీ పోర్చుగల్ పౌరసత్వాన్ని గుట్టుగా ఉంచిన వారి పాస్‌పోర్టులను రద్దు చేస్తున్నట్లు 2022లో మెమోరాండం రావడంతో సరెండర్ సర్టిఫికెట్ పొందడం చాలా మందికి సమస్యగా మారింది. <<-se>>#Elections2024<<>>

News April 24, 2024

డ్యుయల్ సిటిజన్‌షిప్పే ఎందుకంటే? – 3/3

image

ఇందుకు ఊరటగా సరెండర్ సర్టిఫికెట్ స్థానంలో రివొకేషన్ సర్టిఫికెట్లు జారీ చేస్తామని ఈనెల 4న కేంద్రం కొత్త మెమోరాండం తీసుకొచ్చింది. కానీ దీనిపై సంతృప్తి చెందని కొందరు, డ్యుయల్ సిటిజన్‌షిప్పే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం అంటున్నారు. OCI ఉన్నా సాగు భూముల కొనుగోలుకు, ఓటు వేసేందుకు హక్కు లేకపోవడం సహా విదేశాల్లో ఉపాధి అవకాశాలను దృష్టిలో పెట్టుకుని ఈ డిమాండ్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. <<-se>>#Elections2024<<>>

News April 24, 2024

డూప్‌లకు ఫుల్ డిమాండ్

image

ఎన్నికల వేళ డూప్‌లకు డిమాండ్ ఏర్పడింది. వారితో ప్రచారం చేయించేందుకు అభ్యర్థులు పోటీ పడుతున్నారు. మోదీని పోలిన వికాస్, యోగీని పోలిన జగదీశ్, మరో మమతను తలపిస్తున్న రూమాల షెడ్యూల్ ప్రస్తుతం బిజీగా ఉండటం విశేషం. ప్రచారానికి రమ్మని అనేక మంది కోరుతున్నట్లు వారు చెబుతున్నారు. వీరేకాక సెలబ్రిటీలను పోలిన డూప్‌లను కూడా ప్రచారంలో దింపుతున్నారు. ఇటీవల షోలాపూర్‌‌లో కాంగ్రెస్ తరఫున షారుఖ్ డూప్ ప్రచారం చేశారు.

News April 24, 2024

ఎల్లుండి మెట్రో రైలు సమయం పొడిగింపు

image

TG: ఈ నెల 25న HYDలోని ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్, ఆర్సీబీ మధ్య ఐపీఎల్ మ్యాచ్ నేపథ్యంలో మెట్రో రైల్ సమయాన్ని పొడిగించారు. ఆ రోజు అర్ధరాత్రి 12:15 గంటలకు చివరి రైళ్లు టెర్మినల్ స్టేషన్ నుంచి ప్రారంభమై 1:10 గంటలకు గమ్యాన్ని చేరుకుంటాయని మెట్రో అధికారులు తెలిపారు. ఈ సమయాల్లో ఉప్పల్, స్టేడియం, NGRI స్టేషన్ల‌లోనే ప్రయాణికుల ఎంట్రీకి అనుమతి ఇస్తామని.. మిగతా స్టేషన్లలో ఎగ్జిట్ ఉంటుందని పేర్కొన్నారు.

News April 24, 2024

‘INDIA’ ఫ్రంట్ కాదు.. ఇదొక వేదిక: పినరయి

image

కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ INDIA కూటమిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇండియా బ్లాక్ ఫ్రంట్ కాదని.. అధికార బీజేపీపై పోరాడేందుకు ప్రతిపక్షాల కోసం ఉన్న వేదిక అని అన్నారు. ఇండియా బ్లాక్‌లోని భాగస్వామ్య పార్టీలు LDF (CPI(M) నేతృత్వంలోనిది), UDF (కాంగ్రెస్ నేతృత్వంలోనిది) మధ్య తీవ్రమైన పోరు నెలకొన్న నేపథ్యంలో విజయన్ ఈ వ్యాఖ్యలు చేశారు.

News April 24, 2024

మసాలాల నిషేధంపై వివరణ కోరిన భారత్!

image

భారత్‌కు చెందిన MDH, ఎవరెస్ట్ మసాలాలను సింగపూర్, హాంగ్‌కాంగ్ దేశాలు నిషేధించిన విషయం తెలిసిందే. ఈ విషయంలో మరో ముందడుగు పడింది. నిషేధానికి గల కారణాలను వివరించాలని వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ ఆయా దేశాలను కోరినట్లు తెలుస్తోంది. కాగా.. అందులో పురుగు మందుల ఆనవాళ్లున్నాయని సింగపూర్, క్యాన్సర్ కారకాలున్నాయని హాంగ్‌కాంగ్ గతంలో ఆరోపించాయి.

News April 24, 2024

ఈయన జీతం రోజుకు రూ.50 లక్షలు

image

ఐటీ రంగంలో పనిచేసే ఉద్యోగులకు వార్షిక వేతనాలు భారీగానే ఉంటాయి. కొందరు రోజుకు రూ.వేలల్లో సంపాదిస్తే ఇంకొందరు రోజుకు రూ.లక్షల్లో ఆర్జిస్తారు. అయితే కాగ్నిజెంట్ సీఈవో రవికుమార్ సింగిశెట్టి గత ఆర్థిక సంవత్సరం అత్యధిక వేతనం పొందిన టాప్ ఎగ్జిక్యూటివ్‌లలో ఒకరిగా నిలిచారు. ఆయన రోజుకు రూ.50 లక్షల వేతనం అందుకున్నట్లు తాజా నివేదిక వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరం ఆయన వార్షిక వేతనం సుమారు రూ.186 కోట్లు.