India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

AP: ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామని ఓ వార్త వైరల్ కావడంపై బీజేపీ రాష్ట్ర చీఫ్ పురందీశ్వరి స్పందించారు. రిజర్వేషన్ల రద్దుపై తాను మాట్లాడినట్లు వస్తున్న కథనాలు ఫేక్ అన్నారు. ఆ వార్తను నమ్మొద్దని ఆమె కోరారు. సమాజంలోని అందరినీ కలుపుకొని అభివృద్ధి వైపు నడిపించడమే బీజేపీ అభిమతమన్నారు. తమకు వస్తున్న ప్రజాదరణను చూసి వైసీపీ పెయిడ్ ఆర్టిస్టులతో తప్పుడు ప్రచారం చేయిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

లిక్కర్ స్కాం కేసులో తన అరెస్టును సవాల్ చేస్తూ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. నిన్న ఆయన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టేసింది. దీంతో కేజ్రీవాల్ SCని ఆశ్రయించారు. అత్యవసర విచారణ కింద ఈరోజు ఉదయం.10.30గంటలకు CJI జస్టిస్ చంద్రచూడ్ ముందు ఈ పిటిషన్‌ను ఉంచనున్నారు. కాగా.. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మార్చి 21న అరెస్టయిన కేజ్రీవాల్ ప్రస్తుతం తిహార్ జైలులో ఉన్నారు.

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఎం కేజ్రీవాల్ ఇప్పటికే తిహార్ జైలులో ఉన్నారు. అయితే.. ఈకేసులో ఆయనకు వ్యతిరేకంగా ఛార్జ్‌షీట్ దాఖలు చేసేందుకు ఈడీ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. జూన్‌లోగా ఆయన పేరును ఛార్జ్‌షీటులో చేర్చనున్నట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇదే జరిగితే ఎన్నికల సమయంలో కేజ్రీవాల్ మరిన్ని కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

కాంగ్రెస్ సీనియర్ లీడర్ దిగ్విజయ్ సింగ్‌పై మధ్యప్రదేశ్‌కు చెందిన BJP MLA రామేశ్వర్‌శర్మ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘దిగ్విజయ్‌పై మా BJP అభ్యర్థి లక్ష మెజారిటీతో గెలుస్తారు. ఆ తర్వాత ఆయనను పాకిస్థాన్‌కు పంపిస్తాం. అయనకు హిందుస్థాన్‌లో స్థానం లేదు’ అని వ్యాఖ్యానించారు. దీనిపై స్పందించిన దిగ్విజయ్ ఈ విషయంలో తానేం మాట్లాడాలనుకోవట్లేదన్నారు. చట్టపరంగా వెళతామని తెలిపారు.

నితీశ్ కుమార్ రెడ్డి ఒక అద్భుతమని SRH కెప్టెన్ పాట్ కమిన్స్ అన్నారు. ‘సీఎస్కేతో మ్యాచ్‌లో అతడి బ్యాటింగ్ చూశాం. అందుకే పంజాబ్‌తో మ్యాచ్‌లో నితీశ్‌కు బ్యాటింగ్ ఆర్డర్లో ప్రమోషన్ కల్పించాం. మా నమ్మకాన్ని నిలబెట్టి అర్ధసెంచరీ చేశాడు. SRH విజయానికి అతడే ముఖ్య కారణం. మరోవైపు బౌలింగ్, ఫీల్డింగ్‌లో కూడా సత్తా చాటాడు. పాజిటివ్ మైండ్‌సెట్‌తో ఆడి విజయాలు సాధించడమే మా లక్ష్యం’ అని కమిన్స్ పేర్కొన్నారు.

TG: TET దరఖాస్తుల గడువు ఇవాళ్టితో ముగియనుంది. నిన్నటి వరకు 1.93 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. గతంతో పోలిస్తే ఈసారి అప్లికేషన్ల సంఖ్య భారీగా తగ్గింది. అప్లికేషన్ ఫీజు పెంచడం, ఎక్కువ మంది అభ్యర్థులు డీఎస్సీకి ప్రిపేర్ అవుతుండటం ఇందుకు కారణాలుగా తెలుస్తోంది. దరఖాస్తుల గడువును మరో వారం రోజులు పొడిగిస్తారని సమాచారం. మే 20 నుంచి జూన్ 3 వరకు పరీక్షలు జరగనున్నాయి.

AP: టీడీపీకి మరో షాక్ తగలనుంది. ఆ పార్టీకి మాజీ మంత్రి, సీనియర్ నేత KE ప్రభాకర్ రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. కర్నూలు ఎంపీ, ఎమ్మెల్యే సీటు దక్కలేదని ఆయన మనస్తాపం చెందినట్లు సమాచారం. కుమారుడు రుద్ర ఒత్తిడితో అనుచరులతో కలిసి ప్రభాకర్ వైసీపీలో చేరాలని నిర్ణయించినట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి.

బాలీవుడ్ కింగ్ షారుఖ్ ఖాన్‌తో నటించేందుకు ఏదైనా వదులుకోవడానికి తాను సిద్ధమని నటి ప్రియమణి అన్నారు. తాను నటించిన ‘మైదాన్’ ప్రమోషన్లలో పాల్గొన్నారు. ‘ఒకవేళ షారుఖ్ ఫోన్ చేసి సినిమా చేద్దామంటే ఏదైనా వదులుకొని ఆయన దగ్గరికి వెళతా. ఈ విషయాన్ని మీడియానే ఆయన దగ్గరికి తీసుకెళ్లాలి’ అని కోరారు. కాగా.. 2023లో ఆమె ‘జవాన్’లో షారుఖ్‌తో కలిసి నటించారు. ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’లోనూ ఓ సాంగ్‌లో ఆయనతో స్టెప్పులేశారు.

AP: రెండురోజుల క్రితం జనసేనకు రాజీనామా చేసిన పోతిన మహేశ్ కాసేపట్లో వైసీపీలో చేరనున్నారు. సీఎం జగన్ సమక్షంలో ఆయన వైసీపీ కండువా కప్పుకోనున్నారు. కాగా మహేశ్ విజయవాడ వెస్ట్ జనసేన టికెట్ ఆశించి భంగపడ్డారు. దీంతో జనసేనకు రాజీనామా చేశారు.

AP: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. భక్తులు క్యూ కాంప్లెక్స్‌లో వేచి ఉండే అవసరం లేకుండా నేరుగా దర్శనానికి వెళ్తున్నారు. నిన్న శ్రీవారిని 55,756 మంది దర్శించుకోగా.. 17,866 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.2.71 కోట్లు సమకూరింది.
Sorry, no posts matched your criteria.