news

News April 10, 2024

వాలంటీర్లు రాజీనామా చేయవద్దు: చంద్రబాబు

image

AP: వాలంటీర్ల వ్యవస్థ లేదని, రాజీనామా చేసినట్లు మంత్రులు మాట్లాడుతున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. ‘వాలంటీర్లు దయచేసి రాజీనామా చేయవద్దు. మేం అధికారంలోకి రాగానే వారి వేతనాలను రూ.10వేలకు పెంచుతాం. వారికి మరిన్ని ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం. కూటమి అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ ప్రకటిస్తాం. బోగస్ వ్యక్తులను నమ్మకండి. దొంగలు సృష్టించే వార్తలను నమ్మవద్దు’ అని విజ్ఞప్తి చేశారు.

News April 10, 2024

హైదరాబాద్‌లో 15 పెట్టెల్లో నగదు పట్టివేత

image

TG: హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో భారీగా నగదు పట్టుబడింది. కియా కారులో 15 పెట్టెల్లో రూ. 2కోట్ల డబ్బును తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నగదు స్వాధీనం చేసుకున్నామని, తరలింపుపై ఆరా తీస్తున్నామని అధికారులు తెలిపారు.

News April 10, 2024

లంచాలు, వివక్ష లేని పాలన అందించాం: సీఎం

image

AP: ప్రపంచంలోనే వ్యవసాయం దండగ అన్న ఏకైక వ్యక్తి చంద్రబాబు అని CM జగన్ ఫైర్ అయ్యారు. ‘రైతు రుణమాఫీ, సున్నా వడ్డీ, ఇన్‌పుట్ సబ్సిడీ హామీలన్నీ ఎగ్గొట్టాడు. రైతన్నలకు మేం తోడుగా నిలిచాం. మోసాలు చేసే చంద్రబాబు కావాలా? లేక వ్యవసాయానికి అండగా ఉంటున్న జగన్ కావాలా? సంక్షేమ కార్యక్రమాలతో రూ.2.70 లక్షల కోట్లు ప్రజల ఖాతాల్లో వేశాం. లంచాలు, వివక్ష లేకుండా పాలన, పథకాలు అందించాం’ అని చెప్పుకొచ్చారు.

News April 10, 2024

ఈ నెల 12న జూనియర్ టోఫెల్ పరీక్షలు

image

AP: ఈ నెల 12న 6 నుంచి 9వ తరగతుల విద్యార్థులకు జూనియర్ టోఫెల్ పరీక్షలు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా 13,104 స్కూళ్లలో ఈ పరీక్ష నిర్వహిస్తున్నారు. ప్రాథమిక స్థాయి నుంచే విద్యార్థుల్లో ఇంగ్లిష్ నైపుణ్యాలను పెంపొందించడానికి ప్రవేశపెట్టిన టోఫెల్ కోర్సు పరీక్షను 3,4,5 తరగతుల విద్యార్థులకు ఇటీవల నిర్వహించారు. 4.17 లక్షల మంది ఈ పరీక్షకు హాజరైనట్లు వెల్లడించింది.

News April 10, 2024

అంబటి రాయుడి ‘సిద్ధం’ ట్వీట్ ఇందుకేనా?

image

క్రికెటర్ అంబటి రాయుడు ‘సిద్ధం’ అని ట్వీట్ చేయడంతో ఆయన తిరిగి వైసీపీలో చేరుతున్నట్లు అంతా భావించారు. అయితే, జనసేన పార్టీ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో తమ స్టార్ క్యాంపెయినర్ల జాబితాను విడుదల చేయగా అందులో రాయుడి పేరుంది. రాయుడు జనసేనకి మద్దతిస్తుండటంతో ఆయన ఆ పార్టీలో చేరే అవకాశం ఉంది. దీంతో జనసైనికులు సైతం ఆయనను ఆహ్వానిస్తూ కామెంట్స్ చేస్తున్నారు.

News April 10, 2024

రాజకీయాలంటే జనసేనకు కామెడీ అయిపోయింది: YCP

image

జనసేన ప్రకటించిన స్టార్ క్యాంపెయినర్లపై వైసీపీ సెటైర్లు వేసింది. ‘మొత్తానికి జబర్దస్త్ నటులతో ఈ 2024 ఎన్నికల స్కిట్ పూర్తి చేస్తావ్ అన్నమాట. రాజకీయాలంటే మీ జనసేన పార్టీకి అంత కామెడీ అయిపోయాయి. ప్రజాసేవ మీ దృష్టిలో కామెడీ అయిపోయింది. ఇక మీకు రాజకీయాలెందుకు, డైలీ డబ్బులు వచ్చే కామెడీ స్కిట్లు, సినిమా కాల్ షీట్లు చూసుకోండి’ అని ట్వీట్ చేసింది.

News April 10, 2024

ప్రజల కోసం నిలబడ్డ హీరో పవన్ కళ్యాణ్: CBN

image

AP:ప్రజల కోసం నిలబడ్డ నిజమైన హీరో పవన్ కళ్యాణ్ అని చంద్రబాబు కొనియాడారు. ‘అక్రమాలు, వ్యక్తిగత దాడులను తట్టుకుని పవన్ నిలబడ్డారు. శిథిలమైన రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మోదీ మద్దతు అవసరం. మూడు పార్టీలు కలిశాయి. ఇక YCPకి డిపాజిట్లు వస్తాయా? యువత కన్నెర్ర చేస్తే జగన్ లండన్‌కు పారిపోతారు. విధ్వంస పాలన కావాలో? అభివృద్ధి పాలన కావాలో? యువతకు ఉద్యోగాలు కావాలో? గంజాయి కావాలో? ప్రజలు ఆలోచించాలి’ అని కోరారు.

News April 10, 2024

ఎనిమిదేళ్లలో ఆరు రెట్లు పెరిగిన SIP పెట్టుబడులు

image

సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP) కింద మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు గత 8ఏళ్లలో ఆరు రెట్లు పెరిగాయి. SIP పెట్టుబడుల విలువ 2016 APRలో రూ.3,122 కోట్లు ఉంటే ఈ ఏడాది ఫిబ్రవరికి రూ.19,187 కోట్లకు చేరింది. 2015 మార్చిలో 73లక్షలుగా ఉన్న SIP అకౌంట్లు ఇప్పుడు 8.20కోట్లకు చేరినట్లు AMFI వెల్లడించింది. ‘మ్యూచువల్ ఫండ్స్ సహీ హై’ పేరుతో కేంద్రం చేసిన విస్తృత ప్రచారమే ఇందుకు కారణమంటున్నారు నిపుణులు.

News April 10, 2024

వైసీపీ కొట్టుకుపోవడం ఖాయం: చంద్రబాబు

image

AP: రానున్న ఎన్నికల్లో వైసీపీ కొట్టుకుపోవడం ఖాయమని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. తణుకు ప్రజాగళం సభలో మాట్లాడిన ఆయన.. ‘రాష్ట్రంలో అగ్నికి వాయువు తోడైంది. ప్రజాగళానికి వారాహి తోడైంది. సైకిల్ స్పీడ్‌కి, గ్లాసు జోరుకు తిరుగులేదు. రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి 3 పార్టీలు చేతులు కలిపాయి. జగన్ కబంద హస్తాల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. చీకటి పాలనను అంతం చేయడానికి ఓటు చీలకూడదు’ అని ఆకాంక్షించారు.

News April 10, 2024

CBN ఎన్నికల ముందు గంగ.. తర్వాత చంద్రముఖి: సీఎం

image

AP: జాబు రావాలంటే.. బాబు రావాలంటూ భ్రమ కల్పిస్తున్నారని CM జగన్ మండిపడ్డారు. ‘చంద్రబాబు ఎన్నికల ముందు గంగ.. ఆ తర్వాత చంద్రముఖి. ఆయన హయాంలో అసలు ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయా? మా ప్రభుత్వంలో 2.31 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం. జాబు రావాలంటే.. జగన్ కావాలి. జాబుల విషయంలో బాబుది బోగస్ రిపోర్ట్. ఎల్లో మీడియా, కూటమి పార్టీలు గాడిదను గుర్రంలా నమ్మించే ప్రయత్నం చేస్తున్నాయి’ అని దుయ్యబట్టారు.