Hyderabad

News April 2, 2024

మల్కాజిగిరిలో BRS జెండా పాతేనా?

image

మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో 2009లో కాంగ్రెస్, 2014లో TDP, 2019లో కాంగ్రెస్ గెలిచాయి. 2014, 2019లో రెండో స్థానానికి BRS పరిమితమైంది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఎంపీ పరిధిలోని 7 నియోజకవర్గాల్లో BRS క్లీన్ స్వీప్ చేసింది. క్యాడర్ కూడా బలంగా ఉంది. గతంలో 2 సార్లు పార్టీ ఓడిపోయిందని, ఈసారి తప్పకుండా BRS గెలుస్తుందని ఆ పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి ధీమాగా ఉన్నారు. మీ కామెంట్?

News April 2, 2024

HYDలో పడిపోతోన్న నీటి మట్టం..!

image

HYDలో భూగర్భ జలాల మట్టం రోజురోజుకు పడిపోతోంది. 2023 సంవత్సరంతో పోలిస్తే ఇప్పుడు మాసబ్ ట్యాంక్ 5.08 మీటర్లు, కుల్సుంపుర 1.87, బహదూర్‌పుర 0.24, చార్మినార్ 2.34, నాంపల్లి 2.53, ఎర్రగడ్డ 0.25, ఖైరతాబాద్ 0.93, మారేడ్‌పల్లి 0.69, తిరుమలగిరి 1.29 మీటర్ల నీటి మట్టం తగ్గినట్లుగా భూగర్భ జల శాఖ అధికారులు పేర్కొన్నారు. నీటిని వృథా చేయొద్దని సూచించారు. ఇప్పటికే గ్రేటర్ HYDలో నీటి ట్యాంకర్ల వాడకం పెరిగింది.

News April 2, 2024

HYD: రేషన్‌కార్డు ఉందా.. ఇది మీ కోసమే..!

image

HYDలో రేషన్ దుకాణాల్లో సరుకుల పంపిణీ ప్రారంభమైంది. హయత్‌నగర్, వనస్థలిపురం, ఉప్పల్, హబ్సిగూడ, తార్నాక లాంటి అనేక ప్రాంతాల్లో సోమవారం నుంచే రేషన్ బియ్యం, గోధుమలు, చక్కెర లబ్ధిదారులకు అందజేశారు. గతంలో ప్రతి నెల 7వ తేదీ నుంచి 15 వరకు రేషన్ దుకాణాల్లో సరుకు కోసం క్యూ కట్టాల్సిన పరిస్థితి ఉండేది. ఈ సమస్యలను దృష్టిలో ఉంచుకొన్న పౌరసరఫరాల శాఖ 1వ తేదీ నుంచే పంపిణీకి శ్రీకారం చుట్టింది. 

News April 2, 2024

MP ఎన్నికలు: హైదరాబాద్‌‌లో తీవ్ర పోటీ..!

image

లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజధానిలో అభ్యర్థులు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. సికింద్రాబాద్, చేవెళ్ల, మల్కాజిగిరి‌‌, హైదరాబాద్‌లో అభ్యర్థులు సుడిగాలి పర్యటనలు చేస్తూ ప్రజలతో మమేకం అవుతున్నారు. ప్రజాఆశీర్వాదం అంటూ బీజేపీ, ప్రజాపాలన అంటూ కాంగ్రెస్, కేంద్రంలో తెలంగాణ గళం పేరిట బీఆర్ఎస్‌ నేతలు ఓటర్లను ఆకర్షించే పనిలో పడ్డారు. మూడు ప్రధాన పార్టీల్లో అభ్యర్థులు బలంగా ఉండడంతో‌ తీవ్ర పోటీ నెలకొంది.

News April 2, 2024

HYD: BJP కార్పొరేటర్ వేధింపులు.. సూసైడ్

image

ఓ కార్పొరేటర్, మరో మహిళ వేధింపుల కారణంగా మనస్తాపానికి గురై వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన నాగోల్ PS పరిధిలో జరిగింది. శ్రీనివాసకాలనీలో నివాసం ఉండే బాలవర్ధన్ రెడ్డి తన ఆత్మహత్యకు భాగ్య, BJP కార్పొరేటర్ కారణమని సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

News April 2, 2024

మహా గ్రేటర్‌గా హైదరాబాద్‌..!

image

హైదరాబాద్‌ను విస్తరించేందుకు అధికారులు ప్లాన్ చేస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత‌ ఇందుకు సంబంధించిన నివేదికను సీఎం రేవంత్ రెడ్డికి సమర్పించనున్నారు. రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను GHMCలో విలీనం చేయనున్నారు. ఇదే జరిగితే ప్రస్తుతం ఉన్న 150 డివిజన్లు‌ 210 వరకు పెరుగుతాయని అంచనా. జూన్‌ నాటికి మహా గ్రేటర్‌‌పై ప్రణాళికలు పూర్తి చేసేలా కసరత్తుల చేస్తున్నారు.
SHARE IT

News April 2, 2024

హైదరాబాద్ నగరానికి గండిపేట నీళ్లు..!

image

HYDలో తాగునీటి సమస్య తీర్చేందుకు హిమాయత్ సాగర్, గండిపేట జంట జలాశయాల నుంచి నీటి సరఫరాకు ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు కృష్ణా, గోదావరి జలాలను మాత్రమే నగరంలో సరఫరా చేశారు. జంట జలాశయాల నుంచి తరలించిన నీటిని శుద్ధి చేసి సరఫరా చేయడానికి ఏర్పాట్లు చేయాలని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిశోర్ జలమండలి అధికారులను ఆదేశించారు.

News April 1, 2024

హైదరాబాద్ జిల్లాలో నేటి TOP NEWS

image

*కుటుంబ కలహాలతో జర్నలిస్టు రఘు ఆత్మహత్య
*స్నేహితుడిని చంపిన యువకుడి ARREST
*DAO, అగ్రికల్చర్ ఆఫీసర్ బ్రేకప్ వేకెన్సీస్ లిస్ట్ విడుదల
*గాంధీ ఆసుపత్రిలో గుర్తుతెలియని మహిళా డెడ్ బాడీ
*గచ్చిబౌలిలో గంజాయి విక్రయిస్తున్న కిరాణా దుకాణంపై దాడులు
*లంగర్‌హౌస్ అట్టల గోదాంలో అగ్నిప్రమాదం
*శంషాబాద్‌లో అక్రమంగా విక్రయిస్తున్న మద్యం పట్టివేత
*సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో రూ.37.5 లక్షలు సీజ్

News April 1, 2024

హైదరాబాద్: రోడ్ రోలర్ కింద సైలెన్సర్లు తుక్కుతుక్కు

image

నిబంధనలకు విరుద్ధంగా ద్విచక్ర వాహనాలకు డబుల్ సైలెన్సర్ బిగించుకొని శబ్ద, వాయు కాలుష్యాన్ని సృష్టిస్తున్న వారిపై నార్త్ జోన్ ట్రాఫిక్ పోలీసులు కొరడా ఝులిపించారు. నెలలోనే వెయ్యి సైలెన్సర్లను సీజ్ చేసినట్లు ట్రాఫిక్ DCP సుబ్బారాయుడు తెలిపారు. వాటిని రోడ్డు రోలర్ తో తొక్కించి మళ్లీ పనికిరాకుండా చేశారు. ట్రాఫిక్ రూల్స్‌ను మోటర్ యాక్ట్ చట్టాన్ని ఉల్లంఘించినవారిపై చర్యలు తీసుకుంటామన్నారు.

News April 1, 2024

సికింద్రాబాద్: ఆత్మహత్యాయత్నం చేసుకున్న మహిళ!

image

కుటుంబ కలహాలతో విసుగు చెందిన ఓ మహిళ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద ఆత్మహత్యయత్నం చేసుకుంది. విషయం తెలుసుకున్న రైల్వే ప్రొటెక్షన్ సికింద్రాబాద్ డివిజన్ పోలీసులు వెంటనే అప్రమత్తమై మహిళను రక్షించారు. అనంతరం ఆమె పూర్తి వివరాలను తెలుసుకొని, కుటుంబ సభ్యులకు సమాచారాన్ని అందించారు. ప్రతి ఒక్కరి జీవితం ఎంతో విలువైనదని, ఊరికే ప్రాణాలు తీసుకోవద్దని సూచించారు.