News July 5, 2024

నేటి నుంచి హైదరాబాద్‌లో ‘కూలీ’ షూటింగ్

image

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా లోకేశ్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న మూవీ ‘కూలీ’. ఈ సినిమా షూటింగ్ నేటి నుంచి హైదరాబాద్‌లో మొదలుకానున్నట్లు తెలుస్తోంది. 35 రోజుల పాటు జరిగే ఈ షెడ్యూల్‌కోసం సూపర్ స్టార్ ఇప్పటికే నగరానికి చేరుకున్నారని చిత్ర బృందం తెలిపింది. బంగారం స్మగ్లింగ్ ప్రధాన ఇతివృత్తంగా కథ ఉండనుందని సమాచారం. అనిరుధ్ సంగీతం అందిస్తున్న ‘కూలీ’ని సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది.

News July 5, 2024

APPSC డిపార్ట్‌మెంటల్ టెస్ట్ షెడ్యూల్ విడుదల

image

AP: వివిధ విభాగాల్లోని ప్రభుత్వ ఉద్యోగులకు నిర్వహించే డిపార్ట్‌మెంటల్ టెస్టు షెడ్యూల్‌ను APPSC విడుదల చేసింది. ఈ నెల 28 నుంచి ఆగస్టు 2 వరకు పరీక్షలు జరుగుతాయని వెల్లడించింది. అలాగే మెడికల్ ఆఫీసర్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, శాంపిల్ టేకర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ షెడ్యూల్‌ను అధికారులు రిలీజ్ చేశారు. పూర్తి వివరాల కోసం https://psc.ap.gov.in/ను సంప్రదించాలని సూచించారు.

News July 5, 2024

భారత క్రికెటర్లను భయపెట్టింది ఇతడే(PHOTO)

image

నిన్న ముంబైలో నిర్వహించిన విక్టరీ పరేడ్‌లో భారత ప్లేయర్లను దగ్గరగా చూడాలని ఓ ఫ్యాన్ చెట్టుపైకి ఎక్కాడు. బస్సు చెట్టు దగ్గరకు రాగానే ప్లేయర్లు ఒక్కసారిగా అతడిని చూసి భయపడ్డారు. తాజాగా అతడి ఫొటో బయటకు వచ్చింది. T20WCలో ఇతర జట్లను వణికించి కప్ సాధించిన భారత ప్లేయర్లను భయపెట్టింది ఇతడే అంటూ నెటిజన్లు ఫన్నీగా అతడి ఫొటోపై కామెంట్ చేస్తున్నారు. జట్టును దగ్గరగా చూసే ఛాన్స్ కొట్టేశావంటూ మెచ్చుకుంటున్నారు.

News July 5, 2024

AUG 16 నుంచి ముంబైకి ఇండిగో సర్వీస్

image

AP: విజయవాడ ఎయిర్‌పోర్టు-ముంబైకి ఆగస్టు 16 నుంచి ఇండిగో సర్వీసులు నడపనుంది. రోజూ సా.6.30కు ముంబై నుంచి విమానం బయలుదేరి రా.8.20కి గన్నవరం చేరుకుంటుంది. రాత్రి 9 గంటలకు ఇక్కడ బయలుదేరి రా.11కు ముంబైలో ల్యాండ్ అవుతుంది. ఈ సర్వీస్ వల్ల ముంబైతోపాటు గల్ఫ్, UK, USA వెళ్లే ప్రయాణికులకు సులభమైన కనెక్టివిటీ ఉంటుందని ఇండిగో ప్రతినిధులు తెలిపారు. కాగా ఈ రూట్‌లో ఇప్పటికే ఎయిరిండియా సర్వీసులు నడుపుతోంది.

News July 5, 2024

ఎంపీ కలిశెట్టికి చంద్రబాబు అభినందన

image

AP: విజయనగరం టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు లోక్‌సభలో ఎంపీగా ప్రమాణస్వీకారానికి సైకిల్‌పై వెళ్లిన సంగతి తెలిసిందే. టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు ఆయన్ను ఈ విషయంపై తాజాగా అభినందించారు. గురువారం నితిన్ గడ్కరీతో భేటీ అనంతరం బయటికి వస్తున్న ఏపీ సీఎంకు కలిశెట్టి సైకిల్‌పై వచ్చిన విషయాన్ని టీడీపీ కేంద్రమంత్రులు గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో కలిశెట్టితో మాట్లాడిన సీబీఎన్, ఆయనపై ప్రశంసలు కురిపించారు.

News July 5, 2024

బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్

image

TG: MLAల చేరికతో ఇప్పటికే ఉక్కిరిబిక్కిరి అవుతున్న BRS పార్టీకి ఒక్కసారిగా ఊహించని షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఆరుగురు MLCలు ఎలాంటి ముందస్తు ప్రకటనలు, ఊహాగానాలు లేకుండా ఒకేసారి కాంగ్రెస్‌లో చేరారు. భవిష్యత్తులోనూ ఆ పార్టీని పలువురు నేతలు వీడొచ్చని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. దీంతో ప్రస్తుత పరిస్థితిని చక్కదిద్దేందుకు గులాబీ బాస్ ఎలాంటి వ్యూహం రచిస్తారనేది ఆసక్తిగా మారింది.

News July 5, 2024

తెలంగాణకు కొత్తగా 200 ఇంజినీరింగ్ కాలేజీలు

image

TG: తెలంగాణలో కొత్తగా మరో 200 ఇంజినీరింగ్ కళాశాలలు రానున్నాయి. ఈ మేరకు AICTE అనుమతులు జారీ చేసింది. వీటిలో ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీలతో పాటు 10 డీమ్డ్ వర్సిటీలు, వాటి క్యాంపస్‌లు ఉన్నాయి. సీఎం సొంత నియోజకవర్గమైన కొడంగల్‌లోని కోస్గిలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో 3 బ్రాంచీల్లో బీటెక్‌ ప్రారంభించేందుకు గ్రీన్ సిగ్నల్ లభించింది.

News July 5, 2024

అమరావతికి రానున్న ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థ

image

AP: దేశంలోనే ప్రముఖ బిజినెస్ స్కూళ్లలో ఒకటైన XLRI అమరావతిలో తమ క్యాంపస్ నెలకొల్పనుంది. ఈ సంస్థకు గతంలో 50 ఎకరాలను చంద్రబాబు కేటాయించారు. ప్రభుత్వం మారిన తర్వాత ఈ సంస్థ వెనక్కి తగ్గింది. ఇప్పుడు కొత్త ప్రభుత్వం మళ్లీ సంప్రదింపులు జరపడంతో రూ.250 కోట్లతో క్యాంపస్ ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. నిర్మాణం పూర్తైతే 5వేల మంది రాష్ట్ర, దేశ, విదేశీ విద్యార్థులు UG, PG కోర్సుల్లో విద్యను అభ్యసించొచ్చు.

News July 5, 2024

త్వరలో కొత్త రేషన్‌కార్డులు

image

TG: ఆరోగ్యశ్రీతో సంబంధం లేకుండా త్వరలోనే కొత్త రేషన్ కార్డులు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. సన్న బియ్యం పండించే రైతులను ప్రోత్సహిస్తామని వెల్లడించారు. వాటినే మిల్లింగ్ చేయించి రేషన్‌కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీ చేస్తామని తెలిపారు. బియ్యాన్ని వినియోగదారులే తింటారు కాబట్టి రీసైక్లింగ్ ఆగిపోతుందని CM అభిప్రాయపడ్డారు.

News July 5, 2024

రాజ్యాంగ స్ఫూర్తి రక్షణలో రాహుల్ ఫెయిల్: కేటీఆర్

image

TG: రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడటంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విఫలమయ్యారని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. రాజ్యాంగంలోని పదో షెడ్యూల్‌కు కట్టుబడి ఉన్నామంటూనే ఇతర పార్టీల గుర్తులపై గెలిచినవారిని పార్టీలో చేర్చుకుంటున్నారని మండిపడ్డారు. చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్‌లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని సవాల్ చేశారు. రాజ్యసభ ఎంపీగా కేకే రాజీనామా చేయడాన్ని ఆయన స్వాగతించారు.