News June 21, 2024

వయనాడ్‌లో ప్రియాంకా తరఫున దీదీ ప్రచారం?

image

వయనాడ్‌లో జరగనున్న ఉప ఎన్నికలో ఏఐసీసీ అగ్ర నేత ప్రియాంకా గాంధీ తరఫున పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రచారం నిర్వహించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇండియా కూటమి తరఫున ఆమె ప్రచారంలో పాల్గొననున్నట్లు తెలుస్తోంది. కాగా రాహుల్ గాంధీ రాజీనామాతో వయనాడ్‌‌కు ఉపఎన్నిక అనివార్యమైంది. ఖాళీ అయిన స్థానానికి 6 నెలల్లో ఎన్నిక జరపాలనే నిబంధన ఉంది. దీంతో త్వరలోనే ఈసీ నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంది.

News June 21, 2024

AIRTEL: రూ.9కే 10GB డేటా.. గంట వ్యాలిడిటీ

image

టెలికాం సంస్థ భారతీ ఎయిర్‌టెల్ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. రూ.9తో రీఛార్జ్ చేసుకుంటే 10GB డేటా లభిస్తుంది. అయితే దీన్ని కేవలం గంటలోనే వాడుకోవాల్సి ఉంటుంది. ఏదైనా పెద్ద ఫైల్, మూవీ డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఈ ప్లాన్ ఉపయోగకరంగా ఉంటుంది. ప్రస్తుతం ఇతర సర్వీస్ ప్రొవైడర్లలో 10GB డేటాకు రూ.100 వరకు చెల్లించాల్సి ఉంది.

News June 21, 2024

రైతుభరోసాపై CM రేవంత్ రెడ్డి కీలక ప్రకటన

image

TG: అర్హులందరికీ రైతుభరోసా అమలు చేస్తామని CM రేవంత్ రెడ్డి తెలిపారు. ‘జాతీయ రహదారులకు, శ్రీమంతులకు రైతుభరోసా నిధులు వస్తున్నాయని అంటున్నారు. ప్రభుత్వ సంక్షేమం సామాన్యులకు చేరాలి. ఇందుకోసం మంత్రులు భట్టి, తుమ్మల, శ్రీధర్ బాబు, పొంగులేటిల నేతృత్వంలో ఉపసంఘం ఏర్పాటు చేశాం. జులై 15 కల్లా నివేదిక వస్తుంది. బడ్జెట్ సమావేశాల్లో ఆ నివేదికను ప్రవేశపెట్టి రైతుభరోసా విధివిధానాలు నిర్ణయిస్తాం’ అని చెప్పారు.

News June 21, 2024

పాక్ క్రికెటర్లకు సెంట్రల్ కాంట్రాక్టు రద్దు?

image

కొందరు పాకిస్థాన్ క్రికెటర్లకు సెంట్రల్ కాంట్రాక్టు రద్దు చేయాలని పీసీబీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. టీ20 వరల్డ్ కప్‌లో పేలవ ప్రదర్శన చేసినందుకు వారికి డిమోషన్ ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. అలాగే పాత పద్ధతిలోనే సెలక్షన్ విభాగాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు టాక్. కెప్టెన్, హెడ్ కోచ్ సెలక్షన్ కమిటీ సమావేశాల్లో పాల్గొనకుండా చేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

News June 21, 2024

సింగరేణి గొంతు కోస్తుంటే సంతోషమా?: కేటీఆర్ ఫైర్

image

TG: బొగ్గు గనుల వేలంలో పాల్గొన్న డిప్యూటీ CM భట్టి విక్రమార్క, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై కేటీఆర్ Xలో విమర్శలు గుప్పించారు. ‘తెలంగాణ నేలపై సింగరేణి గొంతు కోస్తుంటే భట్టికి బాధ లేదు. కిషన్ రెడ్డికి రంది లేదు. చిరునవ్వులు చిందిస్తున్న ఈ చిత్రమే వీరి కుమ్మక్కు కుట్రలకు నిలువెత్తు నిదర్శనం. INC అధికారంలోకి రాగానే తెలంగాణ ఆగమైంది. BJP నీతి లేని నిర్ణయాల్లో INC కూడా భాగమైంది’ అని మండిపడ్డారు.

News June 21, 2024

పేపర్ లీక్ ఛానళ్లను బ్లాక్ చేశాం: టెలిగ్రామ్

image

UGC NET ప్రశ్నపత్రాల లీక్‌కు పాల్పడిన ఛానళ్లను బ్లాక్ చేసినట్లు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ టెలిగ్రామ్ ప్రకటించింది. ఈ కేసులో లా అండ్ ఆర్డర్‌కు కట్టుబడి, అధికారుల దర్యాప్తునకు సహకరిస్తామని పేర్కొంది. తమ హెల్ప్‌డెస్క్‌కు ఏ ఫిర్యాదు వచ్చినా చట్టాన్ని అనుసరిస్తూ చర్యలు తీసుకుంటూ వస్తున్నామని తెలిపింది. టెలిగ్రామ్ ద్వారానే పేపర్ లీకైందని వస్తున్న వార్తలపై ఆ సంస్థ ఇలా స్పందించింది.

News June 21, 2024

రూ.2 లక్షల వరకు రుణాలు మాఫీ: CM రేవంత్

image

TG: రూ.2 లక్షల వరకు రుణమాఫీని ఏకకాలంలో చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ‘డిసెంబర్ 12, 2018 నుంచి డిసెంబర్ 9, 2023 వరకు రైతులు తీసుకున్న రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేయాలని నిర్ణయించాం. ఇందుకోసం దాదాపు రూ.31 వేల కోట్లు అవసరం. వీటిని సేకరించి అన్నదాతలకు రుణవిముక్తి కల్పిస్తాం. వ్యవసాయం దండగ కాదు పండగ అని భరోసా కల్పిస్తాం’ అని సీఎం స్పష్టం చేశారు.

News June 21, 2024

ఈ వృద్ధురాలి నిర్ణయాన్ని మెచ్చుకోవాల్సిందే!

image

మొబైల్‌కు అతుక్కుపోతున్న ప్రజలకు పుస్తక పఠనాన్ని అలవాటు చేసేందుకు భీమాబాయి కృషి చేస్తున్నారు. MHలోని నాసిక్ వద్ద ఉన్న ‘పుస్తకాంచ్ హోటల్ రిలాక్స్ కార్నర్’ను 74 ఏళ్ల భీమాబాయి నిర్వహిస్తున్నారు. హోటల్‌కు వచ్చిన వాళ్లు ఖాళీ సమయంలో మొబైల్‌ చూస్తూ ఉండటాన్ని గమనించాను. దీంతో ఫుడ్ వచ్చే దాకా వాళ్లు బుక్స్ చదువుకునేలా ఏర్పాట్లు చేశాను‘ అని ఆమె చెప్పారు. ప్రస్తుతం హోటల్‌లో 5వేల పుస్తకాలున్నాయి.

News June 21, 2024

పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా ‘SDT18’

image

సాయి ధరమ్ తేజ్ హీరోగా పీరియాడికల్ యాక్షన్ డ్రామా కథాంశంతో ‘SDT18’ చిత్ర షూటింగ్ ప్రారంభమైంది. ఈ సినిమాతో కేపీ రోహిత్ దర్శకుడిగా పరిచయమవుతున్నట్లు మేకర్స్ తెలిపారు. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో భారీ బడ్జెట్‌తో మూవీని తెరకెక్కిస్తున్నట్లు చెప్పారు. ల్యాండ్ మైన్లతో కూడిన ప్రాంతంలో ఓ పచ్చని చెట్టుతో ఉన్న పోస్టర్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

News June 21, 2024

రేపు పులివెందులకు వైఎస్ జగన్

image

AP: మాజీ సీఎం వైఎస్ జగన్ రేపటి నుంచి 5 రోజులపాటు పులివెందులలో పర్యటించనున్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారి ఆయన సొంత నియోజకవర్గానికి వస్తుండటంతో ప్రాధాన్యత సంతరించుకుంది. రాయలసీమ జిల్లాల YCP నేతలు, కార్యకర్తలతో ఆయన విడివిడిగా సమావేశం నిర్వహిస్తారని తెలుస్తోంది. నిత్యం ప్రజల్లో ఉండేలా దిశానిర్దేశం చేస్తారని సమాచారం.