News June 18, 2024

21 నుంచే అసెంబ్లీ సమావేశాలు

image

AP: ఈ నెల 21 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. 2 రోజులు మాత్రమే జరుగుతాయని చెప్పారు. సభ్యుల ప్రమాణస్వీకారం, స్పీకర్ ఎన్నిక ఉంటుందని పేర్కొన్నారు. తొలుత ఈ నెల 19న, ఆ తర్వాత 24 నుంచి <<13459306>>శాసనసభ<<>> సమావేశాలు జరుగుతాయని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

News June 18, 2024

ఇంటర్ ఫలితాలు విడుదల.. WAY2NEWSలో వేగంగా..

image

AP ఇంటర్ సెకండియర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. bie.ap.gov.in అధికారిక సైట్‌తో పాటు Way2News యాప్‌లోనూ ఫలితాలు పొందవచ్చు. మిగతా ప్లాట్‌ఫాంల తరహాలో విసిగించే యాడ్స్, లోడింగ్ సమస్యలు మన యాప్‌లో ఉండవు. ప్రత్యేక స్క్రీన్‌లో హాల్‌టికెట్ నంబర్ ఎంటర్ చేసి క్లిక్ చేస్తే ఫలితాలు వస్తాయి. ఒక్క క్లిక్‌తో వాట్సాప్ సహా ఏ ప్లాట్‌ఫాంకైనా రిజల్ట్‌ను షేర్ చేసుకోవచ్చు.

News June 18, 2024

ట్వీట్ డిలీట్ చేయాలని విద్యుత్ శాఖ సిబ్బంది ఇంటికొచ్చారు: నెటిజన్

image

‘పవర్ కట్’ అయిందని ట్విటర్ వేదికగా కంప్లైంట్ చేస్తే అధికారులు ఇంటికి వచ్చి ట్వీట్ డిలీట్ చేయాలని చెబుతున్నారని ఓ నెటిజన్ Xలో చేసిన పోస్ట్ వైరలవుతోంది. ‘గతంలో పవర్ కట్ గురించి కంప్లైంట్ చేశాను. అప్పుడు USC, మొబైల్ నంబర్ ఇచ్చాను. సిబ్బంది ఇప్పుడు ఇంటికి వచ్చి ప్రాబ్లమ్ సాల్వ్ అయింది కాబట్టి ట్వీట్ డిలీట్ చేయండని అడిగారు. ఉన్నత అధికారుల నుంచి ఒత్తిడి ఉందని చెప్పారు’ అని ట్వీట్ చేశారు.

News June 18, 2024

2500 ఏళ్ల క్రితం దారి మార్చుకున్న గంగానది!

image

సుమారు 2500 ఏళ్ల క్రితం వచ్చిన భూకంపం కారణంగా గంగానది తన ప్రవాహ దిశను మార్చుకుందని అమెరికా పరిశోధకులు తాజాగా అంచనా వేశారు. హిమాలయాల్లో ప్రారంభమయ్యే గంగ, భారత్‌, బంగ్లాదేశ్ మీదుగా బంగాళాఖాతంలో కలుస్తుంది. అయితే వేల ఏళ్ల క్రితం.. బంగ్లా ప్రస్తుత రాజధాని ఢాకా ప్రాంతానికి దక్షిణంగా సుమారు 100 కిమీ దూరంలో గంగమ్మ ప్రవహించేదని, భూకంపం అనంతరం ఇప్పుడున్న దిశలోకి మారిందని పరిశోధకులు వివరించారు.

News June 18, 2024

మంత్రి కోసం పవన్ కళ్యాణ్ ఛాంబర్ మార్పు

image

AP: రేపు డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టనున్న పవన్ కళ్యాణ్ ఛాంబర్‌ను మార్చారు. తొలుత సచివాలయంలోని 212, 214 రూమ్‌లను కేటాయించగా ఆ గదులు తనకు కావాలని మంత్రి పయ్యావుల కేశవ్ అడిగినట్లు సమాచారం. దీంతో పవన్ కోసం 211 రూమ్‌ను సిద్ధం చేశారు. కాసేపట్లో ఆయన ఛాంబర్‌ను పరిశీలించనున్నారు. రేపు ఇక్కడే పవన్ బాధ్యతలు చేపట్టనున్నారు.

News June 18, 2024

మాల్యా కుమారుడి పెళ్లి.. వారం పాటు వేడుకలు

image

బ్యాంకులకు రూ.వేల కోట్లు ఎగవేసి విదేశాల్లో దాక్కొన్న బిలియనీర్ విజయ్ మాల్యా ఇంట త్వరలో పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఆయన తనయుడు సిద్ధార్థ్ మాల్యా పెళ్లి చేసుకోనున్నారు. తన ప్రియురాలు జాస్మిన్‌ను త్వరలోనే పెళ్లాడనున్నట్లు ఇన్‌స్టా వేదికగా ఆయన ప్రకటించారు. వీరి పెళ్లి వేడుకలు వారం రోజుల పాటు జరగనుండటం విశేషం. అమెరికాకు చెందిన జాస్మిన్‌తో గత ఏడాది అక్టోబరులో సిద్ధార్థ్‌కు నిశ్చితార్థమైంది.

News June 18, 2024

NEETలో తండ్రీకూతుళ్లు క్వాలిఫై

image

కూతురి కోసం తండ్రి ఏమైనా చేయగలడు అనేదానికి ఇదే ఉదాహరణ. ఢిల్లీలో కార్పొరేట్ ఉద్యోగిగా పనిచేస్తోన్న వికాస్ మంగోత్రా కూతురు మీమాన్స కోసం మరోసారి విద్యార్థిగా మారారు. ఇద్దరూ NEET UG 2024 పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. తాను చాలా సింపుల్‌గా పాఠాలు చెప్తానని, తన దగ్గర నేర్చుకోవడం ఇష్టమని కూతురు చెప్పడంతో లాంగ్ లీవ్ పెట్టి ప్రిపేర్ అయినట్లు తెలిపారు. ఈయన 2022లో కూడా నీట్ పరీక్ష రాసి క్వాలిఫై అయ్యారు.

News June 18, 2024

ఈరోజు గంభీర్‌కు బీసీసీఐ ఇంటర్వ్యూ!

image

టీం ఇండియా హెడ్ కోచ్‌ పదవికి షార్ట్‌లిస్ట్ అయిన గౌతమ్ గంభీర్‌కు ఈరోజు ముంబైలోని బీసీసీఐ కార్యాలయంలో ఇంటర్వ్యూ జరగనుంది. ఆయనతో పాటు షార్ట్ లిస్ట్ అయిన మరో వ్యక్తిని కూడా క్రికెట్ అడ్వైజరీ కమిటీ ప్రశ్నించనుంది. అయితే ఇది లాంఛనమేనని, గంభీర్ ఎంపిక దాదాపు ఖరారైనట్లేనని బోర్డు వర్గాలు చెబుతున్నాయి. ఐపీఎల్‌లో కేకేఆర్, లక్నో జట్లను ఆయన విజయపథంలో నడిపించారు.

News June 18, 2024

పవన్ కళ్యాణ్‌కు పోలీసుల గౌరవ వందనం(PHOTO)

image

AP: డిప్యూటీ సీఎం హోదాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. క్యాంప్ ఆఫీసు పరిశీలన కోసం విజయవాడ సూర్యారావుపేటలోని నీటిపారుదల శాఖ అతిథి గృహానికి వచ్చిన ఆయనకు పోలీసులు మర్యాదపూర్వకంగా వందనం సమర్పించారు. అనంతరం రేపు సచివాలయంలో మంత్రిగా తాను బాధ్యతలు స్వీకరించడంపై అధికారులతో పవన్ చర్చించారు.

News June 18, 2024

రేపు పులివెందులకు YS జగన్

image

AP: మాజీ సీఎం జగన్ రేపు పులివెందుల పర్యటనకు వెళ్లనున్నారు. ఎన్నికల్లో ఘోర ఓటమి అనంతరం తాడేపల్లిలోని ఇంటికే పరిమితమైన ఆయన తొలిసారి బయటకు రానున్నారు. జూన్ 21 వరకు పులివెందులలోనే ఉండి, ఆ రోజు సాయంత్రానికి తాడేపల్లికి తిరిగి చేరుకోనున్నారు. అనంతరం ఈ నెల 22న పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో జగన్ పాల్గొననున్నారు.