News June 16, 2024

ఏకపక్షంగా విగ్రహాలు తరలించారు: ఖర్గే

image

పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్‌లోని ప్రముఖుల విగ్రహాల తరలింపును కాంగ్రెస్ చీఫ్ ఖర్గే తప్పుబట్టారు. ‘గాంధీ, అంబేడ్కర్‌ విగ్రహాలను ఎలాంటి సంప్రదింపులు లేకుండా ఏకపక్షంగా తొలగించారు. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తిని ఉల్లంఘించడమే. ఎన్నో చర్చలు, పరిశీలన తర్వాత అక్కడ ప్రతిష్ఠించిన విగ్రహాలను ఇప్పుడు ఒక మూలకు మార్చారు. ఇలాంటి ఏకపక్ష నిర్ణయాలు మన పార్లమెంటు నియమాలు, సంప్రదాయాలకు విరుద్ధం’ అని ఆయన ట్వీట్ చేశారు.

News June 16, 2024

కాంగ్రెస్‌ చీఫ్‌ను కలిసిన బీజేపీ మంత్రి

image

బీజేపీ నేత, కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గేను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ నెల 11న ఆయన పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. తాజాగా ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఇంటికి వెళ్లి కలిశారు. ఇదిలా ఉంటే ఈ నెల 24 నుంచి పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి. సమావేశాల్లో భాగంగా ఎంపీలు ప్రమాణస్వీకారం చేయాల్సి ఉంది. జూలై 22న బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

News June 16, 2024

అమర్నాథ్ యాత్రకు భారీ భద్రత

image

జమ్మూకశ్మీర్‌లో ఇటీవల వరుసగా ఉగ్రదాడులు జరుగుతుండటంతో ఈ నెల 29 నుంచి ప్రారంభమయ్యే అమర్నాథ్ యాత్రకు భారీ భద్రత కల్పించాలని కేంద్రం నిర్ణయించింది. యాత్రికులకు RFID కార్డ్స్ ఇవ్వాలని భావిస్తోంది. J&Kపై ఉన్నతాధికారులతో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఇవాళ సమీక్షించారు. ఉగ్రవాదుల ఏరివేతకు అదనపు బలగాలు తరలించి కూంబింగ్ వేగవంతం చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించారు.

News June 16, 2024

ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు: సీఎం చంద్రబాబు

image

AP: స్వార్థం, అసూయ, రాగద్వేషాలను విడిచిపెట్టి మానవుల్లో త్యాగనిరతిని వ్యాపింపచేయడమే బక్రీద్ పండుగ ఉద్దేశమని సీఎం చంద్రబాబు అన్నారు. ‘అన్ని గుణాల కన్నా దానగుణమే ఉత్తమమన్నది బక్రీద్ సారాంశం. హజ్రత్ ఇబ్రహీం త్యాగాన్ని స్మరించుకుంటూ పండుగను జరుపుకుంటున్న ముస్లిం సోదర సోదరీమణులకు శుభాకాంక్షలు. త్యాగగుణాన్ని ప్రబోధించే బక్రీద్ పండుగ స్ఫూర్తిగా సమైక్యతను, సమానత్వాన్ని సాధిద్దాం’ అని CM పిలుపునిచ్చారు.

News June 16, 2024

ప్రభాస్ అభిమానులకు బ్యాడ్‌న్యూస్

image

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ‘కల్కి’ మూవీలోని ‘భైరవ ఆంథమ్’ ఫుల్ వీడియో కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు నిరాశే ఎదురైంది. ఇవాళ రాత్రి 8 గంటలకు విడుదల చేయాల్సిన ఈ పాటను రేపు ఉదయం 11 గంటలకు విడుదల చేస్తామని చిత్ర యూనిట్ తాజాగా ప్రకటించింది. కొంచెం ఓపిక పట్టాలని అభిమానులను కోరింది. ప్రముఖ సింగర్ దిల్జీత్ దోసాంజ్ ఆలపించగా, సంతోష్ నారాయణ్ సంగీతం అందించారు.

News June 16, 2024

టికెటింగ్ బిజినెస్‌లోకి జొమాటో?

image

పేటీఎం సినిమా, ఈవెంట్స్ టికెట్ సేల్స్ కోసం జొమాటోను వేదికగా చేసుకునేందుకు సిద్ధమైంది. ఈమేరకు టికెటింగ్ బిజినెస్‌లోకి జొమాటోను ఆహ్వానించిందట. గత నెలలో పేటీఎం సేల్స్ క్షీణించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ డీల్ విలువ రూ.1,500కోట్లు అని తెలుస్తోంది. ఇది సక్సెస్ అయితే జొమాటో చరిత్రలో రెండో అతి పెద్ద డీల్‌గా నిలుస్తుంది. 2021లో బ్లింకిట్‌ను రూ. 4,447 కోట్లకు కొనుగోలు చేసింది.

News June 16, 2024

సౌతాఫ్రికాను చిత్తు చేసిన భారత్

image

తొలి వన్డేలో సౌతాఫ్రికా మహిళల జట్టును భారత మహిళల జట్టు చిత్తుగా ఓడించింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన భారత్ ప్రత్యర్థి ముందు 266 రన్స్ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఛేదనకు దిగిన సఫారీ జట్టు 37.4ఓవర్లలోనే కేవలం 122 పరుగులకే ఆలౌట్ అయ్యింది. బ్యాటింగ్‌లో స్మృతి మంధాన (117) సెంచరీతో చెలరేగగా, బౌలింగ్‌లో ఆశా శోభన 4 వికెట్లతో పర్యాటక సౌతాఫ్రికా నడ్డి విరిచారు. దీంతో 143 పరుగుల భారీ తేడాతో భారత్ గెలిచింది.

News June 16, 2024

ఐపీఎస్ బిందుమాధవ్‌పై సస్పెన్షన్ ఎత్తివేత

image

AP: ఐపీఎస్ అధికారి బిందు మాధవ్‌పై సస్పెన్షన్‌ను ఎత్తివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తక్షణమే ఆయనను విధుల్లోకి తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించింది. కాగా ఎన్నికల పోలింగ్ సమయంలో పల్నాడు జిల్లాలో అల్లర్లు చెలరేగాయి. ఆ సమయంలో పల్నాడు SPగా ఉన్న బిందుమాధవ్‌‌ను ఎన్నికల సంఘం సస్పెండ్ చేసింది. దీనిపై ఆయన ఇచ్చిన వివరణతో సంతృప్తి చెందిన ప్రభుత్వం సస్పెన్షన్‌ను ఎత్తివేస్తూ ఆదేశాలు జారీ చేసింది.

News June 16, 2024

ALERT.. రేపు ఈ జిల్లాల్లో వర్షాలు

image

ఏపీలోని పలు ప్రాంతాల్లో రేపు పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, తూ.గో, ప.గో, ఏలూరు, కృష్ణా, NTR, GNT, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, NLR, నంద్యాల, శ్రీసత్యసాయి, YSR, అన్నమయ్య, చిత్తూరు, TPTY జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయంది. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశు-గొర్రెల కాపరులు చెట్లు, టవర్స్ కింద ఉండరాదని హెచ్చరించింది.

News June 16, 2024

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పాకిస్థాన్

image

టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్థాన్ బౌలింగ్ ఎంచుకుంది.
ఐర్లాండ్: పాల్ స్టిర్లింగ్(C), ఆండ్రూ బల్బిర్నీ, టక్కర్, టెక్టర్, కాంఫర్, జార్జ్ డాక్రెల్, గారెత్ డెలానీ, మార్క్ అడైర్, బారీ మెక్‌కార్తీ, జాషువా లిటిల్, బెంజమిన్ వైట్.
పాకిస్థాన్: రిజ్వాన్, సైమ్ అయూబ్, బాబర్(C), ఫఖర్ జమాన్, ఉస్మాన్ ఖాన్, షాదాబ్ ఖాన్, ఇమాద్ వసీం, షాహీన్ అఫ్రిది, హరీస్ రవూఫ్, అమీర్.