News June 12, 2024

రేపు కేంద్రమంత్రిగా కిషన్ రెడ్డి బాధ్యతల స్వీకరణ

image

సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి రేపు కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఉదయం 9:45 గంటలకు తెలంగాణ భవన్‌లో అంబేడ్కర్ విగ్రహానికి శ్రద్ధాంజలి ఘటించి, అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించనున్నారు. ఆ తర్వాత బంగ్లాసాహిబ్‌ను సందర్శిస్తారు. అనంతరం ఉదయం 11 గంటలకు ఆయనకు కేటాయించిన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరిస్తారు.

News June 12, 2024

శార్దూల్‌ ఠాకూర్‌కు సర్జరీ

image

భారత పేసర్ శార్దూల్‌ ఠాకూర్‌కు సర్జరీ జరిగింది. చీలమండ గాయానికి లండన్‌లో శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయింది. ఈ విషయాన్ని శార్దూల్‌ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఆపరేషన్ విజయవంతంగా జరిగిందని, కోలుకోవడానికి కొంత సమయం పడుతుందని తెలిపారు. 2019 ఐపీఎల్ సమయంలో ఈ గాయం అవగా ప్రస్తుతం సర్జరీ అనివార్యం కావడంతో చేయించుకున్నారు. శార్దూల్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు.

News June 12, 2024

రేపట్నుంచి ‘CM చంద్రబాబు ఆన్ డ్యూటీ’

image

AP: నాలుగోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన చంద్రబాబు నాయుడు రేపటి నుంచి ఆన్ డ్యూటీలోకి రానున్నారు. రేపు సాయంత్రం 04.41గంటలకు ఆయన సచివాలయంలో మొదటి బ్లాక్‌లోని ఛాంబర్‌లో సీఎంగా బాధ్యతలు తీసుకుంటారు. బాధ్యతలు తీసుకున్న తొలిరోజే ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుపై <<13427998>>సంతకాలు<<>> చేయనున్నారు.

News June 12, 2024

PLI స్కీమ్‌తో రూ.4లక్షల కోట్ల పెట్టుబడులు: ICRA

image

ప్రొడక్షన్ లింక్డ్ ఇన్‌సెంటివ్ (PLI) స్కీమ్ ద్వారా వచ్చే నాలుగేళ్లలో రూ.4లక్షల కోట్ల వరకు పెట్టుబడులు రావొచ్చని ICRA వెల్లడించింది. సెమీకండక్టర్, సోలార్, ఫార్మా రంగాల్లో బడా ప్రాజెక్టులు ఏర్పాటయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ఈ స్కీమ్ కింద వివిధ రంగాల్లో రెండు లక్షల ఉద్యోగాలు కూడా వస్తాయని అంచనా వేసింది. కాగా 2021లో 14 రంగాలకు చెందిన పరిశ్రమలను ప్రోత్సహించేందుకు PLI స్కీమ్ అందుబాటులోకి వచ్చింది.

News June 12, 2024

మెగా కుటుంబానికి దూరంగా అల్లు ఫ్యామిలీ?

image

మెగా కుటుంబానికి అల్లు ఫ్యామిలీ క్రమంగా దూరమవుతోందనే ఊహాగానాలు సాగుతున్నాయి. ఈ ఎన్నికల్లో YCP అభ్యర్థి ఇంటికెళ్లి బన్ని మద్దతివ్వడం, ఆ తర్వాత నాగబాబు వివాదాస్పద ట్వీట్ చేయడం తెలిసిందే. తాజాగా సాయి ధరమ్ తేజ్ ట్విటర్‌లో అల్లు అర్జున్‌ను అన్‌ఫాలో కొట్టారు. వీటికి తోడు జనసేనాని ప్రమాణస్వీకారానికి అల్లు ఫ్యామిలీ హాజరు కాలేదు. అసలు ఆహ్వానం అందిందో? లేదో? తెలియదు. దీనిపై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి.

News June 12, 2024

‘పుష్ప2’ రిలీజ్ వాయిదా?

image

అల్లు అర్జున్ హీరోగా, సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘పుష్ప2’ రిలీజ్ వాయిదా పడొచ్చని టీటౌన్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ప్రకటించిన తేదీ ప్రకారం 2024 ఆగస్టు 15న ఈ మూవీ రిలీజ్ కావాల్సి ఉంది. ఈ మూవీ షూటింగ్ కోసం అదనంగా మరో నెల సమయం పట్టేలా ఉందని, జూలై చివరికల్లా షూటింగ్ పూర్తవుతుందని టాక్. ఫిలిం ఎడిటర్ మారడంతో పాటు vfxపై సుకుమార్ అసంతృప్తిగా ఉన్నారట. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

News June 12, 2024

పాముని కర్రీ వండుకుని తిన్న వ్యక్తి అరెస్ట్

image

పాముని చర్మాన్ని ఒలుస్తూ చేసిన వీడియో ఓ వ్యక్తిని జైలు పాలయ్యేలా చేసింది. తమిళనాడులోని తిరుపత్తూరు(D) పెరుమపట్టు ప్రాంతానికి చెందిన రాజేశ్ ఇటీవల పాము చర్మాన్ని ఒలుస్తూ ఓ వీడియో చేశాడు. అది సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అటవీశాఖ అధికారులు విచారణ చేపట్టారు. అతణ్ని గుర్తించి అదుపులోకి తీసుకుని విచారించగా పాముని కూర వండుకుని తిన్నట్లు తేలింది. వన్య జంతుసంరక్షణ చట్టం కింద అతణ్ని అరెస్ట్ చేశారు.

News June 12, 2024

రేపు లాసెట్, పీజీ ఎల్‌సెట్ ఫలితాలు

image

TG: న్యాయ కళాశాలల్లో LLB, LLM కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన లాసెట్, పీజీ ఎల్‌సెట్ ఫలితాలు రేపు మధ్యాహ్నం 3.30 గంటలకు విడుదల కానున్నాయి. ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి ఫలితాలను విడుదల చేస్తారు. జూన్ 3న ఈ పరీక్షలను నిర్వహించిన సంగతి తెలిసిందే.

News June 12, 2024

హైదరాబాద్-అయోధ్య స్పైస్‌జెట్ విమాన సేవలు రద్దు

image

హైదరాబాద్ నుంచి అయోధ్యకు గతంలో ప్రారంభించిన విమాన సేవలను రద్దు చేసినట్లు స్పైస్‌జెట్ సంస్థ వెల్లడించింది. తగిన డిమాండ్ లేకపోవడమే ఇందుకు కారణమని పేర్కొంది. జూన్ 1 నుంచే ఈ సేవలు నిలిపివేసినట్లు ఓ ప్రకటనలో వెల్లడించింది. అయితే చెన్నై- అయోధ్య విమాన సేవలను కొనసాగిస్తున్నట్లు తెలిపింది. కాగా ఏప్రిల్‌లో వారానికి మూడు రోజుల చొప్పున HYD నుంచి అయోధ్యకు స్పైస్‌జెట్ నాన్ స్టాప్ ఫ్లైట్ సేవలను ప్రారంభించింది.

News June 12, 2024

బుమ్రా తొలి ఓవర్ వెయ్యాలి: కపిల్ దేవ్

image

బుమ్రా వికెట్ టేకింగ్ బౌలర్ అని, తొలి ఓవర్‌ను అతనే వేయాల్సిన అవసరం ఉందని దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ అన్నారు. అలా కాకుండా 5 లేదా 6 ఓవర్లో బౌలింగ్ ఇస్తే మ్యాచ్ చేజారే అవకాశం ఉందని మీడియాతో చెప్పారు. బుమ్రా తొలుత బౌలింగ్ చేసి వికెట్లు తీస్తే ప్రత్యర్థిపై ఒత్తిడి పెరిగి ఇతర బౌలర్లకు ఈజీగా ఉంటుందన్నారు. కాగా పాక్‌తో మ్యాచులో బుమ్రాకు తొలి ఓవర్ ఇవ్వకపోవడంతో కెప్టెన్ రోహిత్‌పై విమర్శలు వెల్లువెత్తాయి.