News January 8, 2025

షేక్ హసీనా వీసా పొడిగించిన కేంద్రం!

image

బంగ్లా మాజీ PM షేక్ హసీనా వీసా గడువును కేంద్ర ప్రభుత్వం పొడిగించినట్టు తెలుస్తోంది. గత ఆగస్టు నుంచి ఆమె భారత్‌‌లోనే తలదాచుకుంటున్నారు. గడువు పెంపుతో ఆమె మరికొంత కాలం ఇక్కడే ఉండేందుకు వీలవుతుంది. అయితే ఇది రాజకీయ ఆశ్రయం కల్పించినట్టు కాదని తెలుస్తోంది. నిన్న ఆమె పాస్‌పోర్టును బంగ్లా ప్రభుత్వం రద్దుచేసింది. ఓవైపు ఆమెను తిరిగి పంపించాలని యూనస్ ప్రభుత్వం ఒత్తిడి చేస్తున్నా కేంద్రం స్పందించడం లేదు.

News January 8, 2025

గురుకులాల్లో ప్రవేశాలు.. ఇలా అప్లై చేసుకోండి!

image

TG: వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించి గురుకులాల్లో 5-9 తరగతుల ప్రవేశాలకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. <>https://tgcet.cgg.gov.in<<>> సైట్‌లో ఫిబ్రవరి 1లోపు అప్లై చేసుకోవాలి. రాత పరీక్ష (TG CET)ను ఫిబ్రవరి 28న నిర్వహిస్తారు. SC, ST, BC, జనరల్ గురుకులాల్లో ఐదో తరగతి, SC, ST గురుకులాల్లో 6-9, TGSWREIS గౌలిదొడ్డి, అలుగునూరు COEలలో 9, TGTWREIS ఖమ్మం, పరిగి SOEలలో ఎనిమిదో తరగతి ప్రవేశాలకు సీట్లను భర్తీ చేస్తారు.

News January 8, 2025

మందుబాబులకు బ్యాడ్ న్యూస్

image

TG: కింగ్ ఫిషర్, హీనెకిన్ బీర్లను సరఫరా చేయలేమని యునైటెడ్ బేవరేజెస్ లిమిటెడ్ రాష్ట్ర ప్రభుత్వానికి తెలిపింది. గత ఐదేళ్లుగా బీర్ల ధరల పెంపునకు TGBCL అంగీకరించకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఇంతటి భారీ నష్టాల్లో తాము బీర్లను సరఫరా చేయలేమని పేర్కొంది. కాగా రాష్ట్రంలోని అన్ని మద్యం దుకాణాల్లో ఈ బీర్లు దొరకకపోవడంతో కొన్నేళ్లుగా మందుబాబులు జిల్లా కలెక్టర్లకు కూడా ఫిర్యాదులు చేశారు.

News January 8, 2025

పరీక్షల తొలగింపుపై నిర్ణయం జరగలేదు: BIE

image

ఫస్ట్ ఇయర్ బోర్డు పరీక్షల తొలగింపుపై తుది నిర్ణయం జరగలేదని ఏపీ ఇంటర్ బోర్డు వెల్లడించింది. కొత్త ప్రతిపాదనలపై ప్రస్తుతం సలహాలు, సూచనలు, అభ్యంతరాలను స్వీకరిస్తున్నట్లు పేర్కొంది. అన్ని వర్గాల అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకుని తుది నిర్ణయం తీసుకుంటామని క్లారిటీ ఇచ్చింది.

News January 8, 2025

AAG ఏం చెబుతారు..?

image

TG: ACB విచారణకు లాయర్‌ను అనుమతించాలన్న <<15097073>>KTR<<>> పిటిషన్‌పై ఈ సాయంత్రం హైకోర్టు తుది నిర్ణయం వెల్లడించే అవకాశముంది. ఇలాంటి దర్యాప్తును న్యాయవాది చూసే అవకాశం ఉందా? అని ACB తరఫు లాయర్‌ను న్యాయస్థానం ప్రశ్నించింది. సాయంత్రం గం.4లోపు చెబుతామని దర్యాప్తు సంస్థ తరఫున హాజరైన AAG కోర్టుకు తెలిపారు. దీంతో అప్పుడు తిరిగి ప్రారంభమయ్యే విచారణలో ప్రభుత్వ కౌన్సిల్ ఏం చెప్పబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది.

News January 8, 2025

శర్వా సినిమా కోసం రంగంలోకి నందమూరి& కొణిదెల

image

టాలీవుడ్ హీరో శర్వానంద్ నటించనున్న SHARWA37 సినిమా ఈనెల 14న లాంచ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. నందమూరి & కొణిదెల ఫ్యామిలీలు కలిసి ఈ సినిమాను లాంచ్ చేయనున్నట్లు వెల్లడించారు. అదేరోజు ఫస్ట్ లుక్& టైటిల్ రివీల్ చేస్తామని పేర్కొన్నారు. ఈ చిత్రంలో సంయుక్తా మేనన్, సాక్షి వైద్య హీరోయిన్లుగా నటించనుండగా రామ్ అబ్బరాజు తెరకెక్కించనున్నారు.

News January 8, 2025

KTRతో పాటు లాయర్ కూర్చోరాదు: HC

image

లాయర్‌తో ACB విచారణకు హాజరు అయ్యేందుకు అనుమతించాలన్న KTR వినతిని హైకోర్టు తోసిపుచ్చింది. లాయర్‌ను ఆయనతో పాటు కూర్చోబెట్టలేమని స్పష్టం చేసింది. దూరంగా ఉండి లాయర్ గమనించేందుకు మాత్రం పర్మిషన్ ఇస్తామని KTR లంచ్ మోషన్ పిటిషన్‌పై విచారణలో తెలిపింది. వెంట వెళ్లే ముగ్గురు లాయర్ల పేర్లను ఇవ్వాలని మాజీ మంత్రి కౌన్సిల్‌ను ఆదేశించింది. తదుపరి విచారణను సాయంత్రం గం.4కు వాయిదా వేసింది.

News January 8, 2025

TG జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజనం?

image

తెలంగాణలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజనం పథకాన్ని అమలు చేసేందుకు ఇంటర్ విద్యా కమిషనరేట్ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఈనెలలోనే ప్రభుత్వానికి ప్రతిపాదనలను సమర్పించనున్నట్లు సమాచారం. రాష్ట్రంలోని 424 జూనియర్ కళాశాలల్లో లక్షన్నరకు పైగా స్టూడెంట్స్ చదువుతున్నారు. కాగా ఏపీలోని జూనియర్ కాలేజీల్లో ఇటీవలే ఈ స్కీమ్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే.

News January 8, 2025

నిబంధనల ప్రకారమే అల్లు అర్జున్ విడుదల: డీజీ

image

TG: అల్లు అర్జున్ విడుదలకు సంబంధించి జైళ్ల శాఖలో ఎలాంటి లోపం లేదని డీజీ సౌమ్య మిశ్రా స్పష్టం చేశారు. నిబంధనల ప్రకారమే ఆయనను రిలీజ్ చేశామన్నారు. గత నెల 13న బన్నీని పోలీసులు అరెస్ట్ చేయగా, అదే రోజు కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. మధ్యంతర బెయిల్ ఆన్‌లైన్‌లో ఆలస్యంగా అప్‌లోడ్ కావడంతో ఆయనను ఆ రోజు రాత్రి జైల్లోనే ఉంచి తర్వాతి రోజు విడుదల చేశారు. దీంతో పోలీసులు కావాలనే అలా చేశారని ఆరోపణలు వచ్చాయి.

News January 8, 2025

అమెరికాలో కెనడా విలీనం.. ట్రంప్ పోస్ట్ వైరల్

image

అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇన్‌స్టా పోస్ట్ వైరలవుతోంది. కెనడా పీఎంగా జస్టిన్ ట్రూడో రాజీనామా చేయడంతో ‘ఓహ్ కెనడా’ అంటూ ఓ మ్యాప్‌ను షేర్ చేశారు. ఇది అమెరికాలో కెనడా విలీనం అయినట్లు ఉంది. కెనడా విస్తీర్ణం 99.84 లక్షల చదరపు కిలోమీటర్లు కాగా, USAది 98.33 లక్షలు. ఈ రెండు కలిస్తే 1.98 కోట్ల చ.కి.మీల విస్తీర్ణంతో అమెరికా ప్రపంచంలోనే అతిపెద్దదిగా మారనుంది. ప్రస్తుతం రష్యా విస్తీర్ణంలో అతిపెద్దది.