News March 11, 2025

నెలకు రూ.5,000.. దరఖాస్తు గడువు పెంపు

image

PM ఇంటర్న్‌షిప్ స్కీమ్ దరఖాస్తు గడువు రేపటితో ముగియాల్సి ఉండగా ఈనెల 31 వరకు పొడిగిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఈ స్కీమ్ కింద SSC, ఇంటర్, డిప్లొమా, ITI, డిగ్రీ చదివిన 21-24 ఏళ్ల వయసు నిరుద్యోగులకు దేశంలోని టాప్-500 కంపెనీల్లో 1yr ఇంటర్న్‌షిప్ కల్పిస్తారు. నెలకు ₹5000 స్టైఫండ్, వన్‌టైం గ్రాంట్ కింద ₹6000 ఇస్తారు. అభ్యర్థుల కుటుంబ ఆదాయం ఏడాదికి ₹8Lలోపు ఉండాలి. దరఖాస్తుకు ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.

News March 11, 2025

CM రేవంత్‌ను కలిసిన మోహన్ బాబు, విష్ణు

image

TG: నటుడు మోహన్ బాబు, ఆయన తనయుడు మంచు విష్ణు సీఎం రేవంత్‌ను ఈరోజు మర్యాదపూర్వకంగా కలిశారు. జూబ్లీహిల్స్‌లోని తన నివాసానికి వచ్చిన వారిని సీఎం సాదరంగా పలకరించారు. అనంతరం నటులిద్దరూ ముఖ్యమంత్రికి శాలువాలు కప్పి సత్కరించారు. విష్ణు ట్విటర్లో ఈ విషయాన్ని వెల్లడించారు. పలు కీలక అంశాలపై చర్చించామని, రాష్ట్రంలో సినీ పరిశ్రమ అభివృద్ధికి తన సహకారం ఉంటుందని సీఎం హామీ ఇచ్చారని ఆయన పేర్కొన్నారు.

News March 11, 2025

గ్రూప్-2 ఫస్ట్ ర్యాంకర్ ఇతనే

image

TG: టీజీపీఎస్సీ వెల్లడించిన గ్రూప్-2 ఫలితాల్లో నారు వెంకట హర్షవర్ధన్ రెడ్డి ఫస్ట్ ర్యాంక్ సాధించారు. 600 మార్కులకుగానూ 447.088 మార్కులు సాధించి టాపర్‌గా నిలిచారు. కాగా హర్షవర్ధన్ సూర్యాపేట జిల్లా కోదాడ వాసి. ఆయన తండ్రి రమణారెడ్డి కేఆర్ఆర్ ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపల్‌గా పనిచేస్తున్నారు. హర్షవర్ధన్ ఏడో తరగతి వరకు ఖమ్మం, 8 నుంచి ఇంటర్ వరకు విజయవాడ, బీటెక్ తాడేపల్లిగూడెంలో చదివారు.

News March 11, 2025

రేవంత్ రెడ్డి పిటిషన్.. విచారణ వాయిదా

image

TG: నార్సింగి పీఎస్‌లో తనపై నమోదైన కేసును కొట్టివేయాలని CM రేవంత్ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. జన్వాడ ఫామ్‌హౌస్‌పై డ్రోన్ ఎగరవేశారని 2020 మార్చిలో రేవంత్‌పై కేసు నమోదైంది. అదేమి నిషేధిత ప్రాంతమేమీ కాదని, తప్పుడు కేసులు పెట్టి రేవంత్‌ను జైలుకు పంపారని ఆయన తరఫు లాయర్లు వాదించారు. కౌంటర్ దాఖలు చేయాలని పీపీకి నోటీసులు జారీ చేసిన కోర్టు తదుపరి విచారణను ఈ నెల 19కి వాయిదా వేసింది.

News March 11, 2025

స్కూలు విద్యార్థులకు శుభవార్త

image

APలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి యూనిఫాం మారుస్తున్నట్లు మంత్రి నారా లోకేశ్ అసెంబ్లీలో ప్రకటించారు. పిల్లల పుస్తకాల బరువు తగ్గించేందుకు ప్రయత్నిస్తామని వెల్లడించారు. సెమిస్టర్ వారీగా పుస్తకాలు ఇస్తామని, ఒకటో తరగతికి రెండు పుస్తకాలే ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఇక ప్రతి శనివారం నో బ్యాగ్ డే‌గా ప్రకటించామని, టీచర్లకు కూడా దీనిపై శిక్షణ ఇచ్చేలా కార్యాచరణ చేపట్టినట్లు తెలిపారు.

News March 11, 2025

విదేశీ విద్యపై మోజు తగ్గుతోంది!

image

ప్రపంచ రాజకీయ పరిస్థితుల ప్రభావం భారత విద్యార్థులపై కనిపిస్తోంది. విదేశాలకు వెళ్తున్న భారత విద్యార్థుల సంఖ్య గత ఏడాది భారీగా తగ్గింది. బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్ వివరాల ప్రకారం.. US, కెనడా, UKకు వెళ్లే విద్యార్థుల సంఖ్య 27శాతం మేర పడిపోయింది. వీటిలో ఒక్క కెనడాకు వెళ్లేవారే 41శాతం తగ్గిపోవడం గమనార్హం. కఠిన వీసా నిబంధనలు, ఆర్థిక నిబంధనలు, దౌత్యపరమైన సమస్యలు దీనికి కారణమని విశ్లేషకులు చెబుతున్నారు.

News March 11, 2025

బోయ, వాల్మీకిలను ఎస్టీల్లో చేర్చండి: DK అరుణ

image

తెలుగు రాష్ట్రాల్లోని బోయ, వాల్మీకిలను ఎస్టీల జాబితాలో చేర్చాలని మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. లోక్‌సభలో జీరో అవర్‌లో ఈ విషయాన్ని ఆమె ప్రస్తావించారు. తెలంగాణలో 5 లక్షల మందికిపైగా బోయ వాల్మీకులున్నారని, ఎస్టీలపై చెల్లప్ప కమిషన్ కేంద్రానికి నివేదిక పంపిందని తెలిపారు. ఈ విషయంపై గిరిజన శాఖ మంత్రి తగిన చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.

News March 11, 2025

ఎవరినీ బాధపెట్టాలని కాదు: రోహిత్ శర్మ

image

ఛాంపియన్స్ ట్రోఫీ సెమీస్, ఫైనల్ మ్యాచుల్లో బౌలర్ కుల్దీప్ యాదవ్‌పై కెప్టెన్ రోహిత్, కోహ్లీ ఆగ్రహం వ్యక్తం చేశారు. బౌలింగ్ వేశాక కుల్దీప్ స్టంప్స్ వెనక ఉండకపోవడం, త్రో విసిరిన బంతిని పట్టుకోకపోవడంతో వారు సీరియస్ అయ్యారు. ‘ఫీల్డ్‌లో భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి. కొన్నిసార్లు నియంత్రణ కోల్పోతాం. అంతా ఆటలో భాగం. గ్రౌండ్‌లో అనే మాటలు ఎవరినీ బాధ పెట్టడానికి కాదు’ అని రోహిత్ శర్మ దీనిపై వివరణ ఇచ్చారు.

News March 11, 2025

ఇక దూకుడే.. ప్రభుత్వంపై పోరాటమే: KCR

image

TG: BRS శాసనసభాపక్ష సమావేశంలో MLAలు, MLCలకు KCR దిశానిర్దేశం చేశారు. ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేయాలని సూచించారు. ‘ప్రభుత్వ అవినీతి, ప్రజా వ్యతిరేక కార్యక్రమాలపై పోరాడాలి. రైతు సమస్యలు, మంచినీటి కొరతపై సభలో గళం విప్పాలి. BC, SC రిజర్వేషన్ల బిల్లుకు మద్దతుగా గొంతు వినిపించాలి. గురుకుల స్కూళ్లు, ఉద్యోగ సమస్యలు, మహిళలకు ఇచ్చిన వాగ్దానాలు, 6 గ్యారంటీలపై ప్రభుత్వాన్ని నిలదీయాలి’ అని KCR సూచించారు.

News March 11, 2025

CM స్టాలిన్‌కు లోకేశ్ పరోక్ష కౌంటర్

image

AP: తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌కు మంత్రి నారా లోకేశ్ పరోక్షంగా కౌంటర్ వేశారు. ‘పక్క రాష్ట్రాల వారు త్రిభాషా విధానంపై కొన్ని అపోహలు సృష్టిస్తున్నారు. భాష చుట్టూ రాజకీయం చేయడం తగదు. మాతృభాష అందరికీ కీలకమే. మాతృభాషను కాపాడుకోవాలని కేంద్రం కూడా స్పష్టంగా చెబుతోంది. త్రిభాషా విధానంపై అనవసర రాద్ధాంతం చేయకూడదు. దీని వల్ల ప్రాంతీయ భాషలకు ఎలాంటి ప్రమాదం లేదు’ అని ఆయన వ్యాఖ్యానించారు.