News March 8, 2025

నటుడు మృతి.. కారణం ఇదే

image

హాలీవుడ్ నటుడు హాక్‌మన్, అతని భార్య అమెరికాలోని ఇంట్లో అనుమానాస్పద స్థితిలో <<15598233>>చనిపోయిన <<>>సంగతి తెలిసిందే. వారి మృతదేహాలకు నిర్వహించిన పోస్టుమార్టం పరీక్షలో అతడు గుండె జబ్బు, అల్జీమర్స్‌తో చనిపోయినట్లు తేలింది. అతని భార్య హాంటావైరస్ ఇన్‌ఫెక్షన్ వల్ల ఊపిరితిత్తులు దెబ్బతిని మరణించిందని గుర్తించారు. అటు భార్య అనారోగ్యంతో వారం క్రితం మృతి చెందిన విషయం హాక్‌మన్‌కు తెలియదని సమాచారం.

News March 8, 2025

IPLకు పాకిస్థాన్ ప్లేయర్ ఆమిర్?

image

IPL 2026 వేలంలో తన పేరు నమోదు చేసుకుంటానని పాకిస్థాన్ స్టార్ బౌలర్ మహ్మద్ ఆమిర్ తెలిపారు. వేలంలో ఎంపికైతే తన బెస్ట్ ఇస్తానని చెప్పారు. ECB తరఫున వేలంలో రిజిస్టర్ చేసుకుంటానని వెల్లడించారు. కాగా ఆమిర్ భార్య నర్జిస్ బ్రిటిష్ పౌరురాలు. అతడికి కూడా ఆ దేశ పౌరసత్వం వచ్చింది. దీంతో ECB తరఫున ఆయన వేలంలో పేరు నమోదు చేసుకోవచ్చు. కాగా IPLలో పాకిస్థాన్ ప్లేయర్లపై నిషేధం ఉన్న విషయం తెలిసిందే.

News March 8, 2025

అమెరికా వీసా ట్రై చేసేవారికి బ్యాడ్ న్యూస్

image

US వెళ్లాలనుకునేవారికి బ్యాడ్ న్యూస్. ఆ దేశపు వీసా లేదా గ్రీన్ కార్డుకు అప్లై చేసుకోవాలంటే ఇకపై సోషల్ మీడియా వివరాలూ సమర్పించాల్సి ఉంటుంది. అమెరికా హోంశాఖ ఈ విషయాన్ని ఇటీవల ప్రకటించింది. వలసల్ని మరింత కట్టుదిట్టం చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. సోషల్ మీడియాలో సందేశాలు, పోస్టులపై సర్కారు నిఘా వేయనున్న నేపథ్యంలో హెచ్-1బీ, ఈబీ-5 కోసం యత్నిస్తున్నవారికి ఇది ఇబ్బందికరంగా మారొచ్చు.

News March 8, 2025

నిజమైన ఉమెన్స్ డే అప్పుడే.. ఏమంటారు?

image

ఈరోజు మహిళా దినోత్సవం. సమాజంలో మహిళలకూ పురుషులకున్న హక్కులు ఉంటాయని, అన్ని రంగాల్లోనూ వారికి సమాన అవకాశాలు కల్పించాలనే మాట ప్రతి రాజకీయ నాయకుడి నోటి నుంచి వస్తుంటుంది. రాజ్యాంగం వీరికి 33% రిజర్వేషన్ కల్పించినా ఎంత మంది రాజకీయాల్లో సక్సెస్ అయ్యారు? ఎంత మంది మహిళా మూర్తులకు మంత్రుల పీఠం దక్కింది? ప్రైవేటు ఉద్యోగాల్లో ఎంత మందికి ఛాన్స్ ఇచ్చారు? వారి హక్కులను వారు పొందినప్పుడే నిజమైన ‘ఉమెన్స్ డే’.

News March 8, 2025

స్త్రీల సలహాలు.. పెడచెవిన పెట్టొద్దు బ్రో!

image

లేడీస్‌ సలహా ఇస్తే.. ఆడదానివి నువ్వు చెప్పేదేంటి? అంటున్నారా? ఇకపై అలా అనేముందు ఆలోచించండి. మహిళల సలహాలు వినే పురుషుల ఆలోచనాశక్తి మెరుగ్గా ఉంటుందని ఓ సర్వేలో తేలింది. ‘పురుషులతో పోలిస్తే స్త్రీలు తార్కికంగా, ప్రశాంత చిత్తంతో ఆలోచిస్తారు. అందువల్ల ఏ సమస్యలోనైనా తమ దృష్టి కోణంతో వారిచ్చే సలహా పురుషులు విస్తృతంగా ఆలోచించేందుకు, తప్పుంటే దిద్దుకునేందుకు ఉపకరిస్తుంది’ అని సర్వే నివేదిక పేర్కొంది.

News March 8, 2025

ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్

image

ముంబై ఇండియన్స్ స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా వెన్ను నొప్పి నుంచి ఇంకా కోలుకోలేదని తెలుస్తోంది. దీంతో ఐపీఎల్‌కు తొలి రెండు వారాలపాటు ఆయన దూరం కానున్నారని సమాచారం. ముంబై ఆడే తొలి 4, 5 మ్యాచులకు ఆయన మిస్ అవుతారని టాక్. ఆ తర్వాత జట్టుతో చేరతారని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం బుమ్రా బెంగళూరులోని COEలో కోలుకుంటున్నారు. గాయంతోనే ఆయన బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు.

News March 8, 2025

మహిళా దినోత్సవం ఎలా మొదలైందంటే?

image

అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్మిక ఉద్యమం నుంచి పుట్టుకొచ్చింది. 1908లో న్యూయార్క్‌లో ఓటు హక్కు, మెరుగైన జీతాల కోసం 15 వేల మంది మహిళలు నిరసనకు దిగారు. ఆ రోజును దృష్టిలో పెట్టుకుని USలోని సోషలిస్టు పార్టీ 1909లో జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రకటించింది. ఆ తర్వాత క్లారా జెట్కిన్ 1910లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరపాలని నిర్ణయించారు. ఐక్యరాజ్యసమితి 1975లో మార్చి 8ను మహిళా దినోత్సవంగా గుర్తించింది.

News March 8, 2025

విజయవాడకు పోసాని తరలింపు

image

AP: సినీ నటుడు పోసాని కృష్ణమురళిని పోలీసులు కర్నూలు జైలు నుంచి విజయవాడకు తరలిస్తున్నారు. పీటీ వారెంట్‌పై ఆయనను అక్కడికి తీసుకెళ్తున్నారు. కాగా విజయవాడలోని భవానీపురం పీఎస్‌లో పోసానిపై కేసు నమోదైంది. పీటీ వారెంట్‌పై ఆయనను అక్కడికి తీసుకువెళ్లేందుకు విజయవాడ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు అనుమతించింది. దీంతో పోలీసులు కర్నూలు నుంచి ఆయనను విజయవాడకు తరలిస్తున్నారు.

News March 8, 2025

మహిళలకు SBI గుడ్ న్యూస్

image

మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు ఎలాంటి పూచీకత్తు లేకుండా తక్కువ వడ్డీ రేటుకే రుణాలు మంజూరు చేస్తామని SBI ప్రకటించింది. ‘అస్మిత’ పేరుతో ప్రత్యేక లోన్లు ఇవ్వనున్నట్లు తెలిపింది. మహిళా వ్యాపార, పారిశ్రామికవేత్తలకు సులభంగా లోన్లు అందిస్తామని పేర్కొంది. మహిళల కోసం ‘నారీ శక్తి’ డెబిట్ కార్డును రూపొందించినట్లు తెలిపింది. మరోవైపు బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా చౌక వడ్డీకే మహిళలకు లోన్లు ఇస్తామని ప్రకటించింది.

News March 8, 2025

ఫాల్కన్ స్కామ్: నిందితుడి విమానాన్ని సీజ్ చేసిన ఈడీ

image

ఫాల్కన్ కుంభకోణంలో ప్రధాన నిందితుడైన అమర్‌దీప్ విమానాన్ని ఈడీ హైదరాబాద్‌లో సీజ్ చేసింది. అతడు రూ.14 కోట్లతో ఆ విమానాన్ని కొనుగోలు చేసినట్లు సమాచారం. అమర్‌దీప్ సహా స్కామ్‌లో కీలక నిందితులందరూ పరారీలో ఉన్నారు. ప్రస్తుతం పవన్, కావ్య అనే ఇద్దరు ఈడీ అదుపులో ఉన్నారు. తమ కంపెనీలో డిపాజిట్లు పెడితే తక్కువ కాలంలోనే ఎక్కువ లాభాలు ఇస్తామంటూ నమ్మించి 6979 మందికి రూ.1700 కోట్లకు నిందితులు కుచ్చుటోపీ పెట్టారు.