News September 5, 2024

రీల్ ‘GOAT’ కోసం రియల్ GOATతో వచ్చాడు

image

తమిళ స్టార్ హీరో విజయ్ మూవీ GOAT(ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్‌టైమ్) ఈరోజు థియేటర్లలో రిలీజైన విషయం తెలిసిందే. కాగా ఆ సినిమా చూసేందుకు నటుడు కూల్ సురేశ్ మేకను తీసుకొని థియేటర్‌కు వచ్చారు. దీంతో ఆయనను ప్రేక్షకులంతా విచిత్రంగా చూశారు. అయితే గోట్ సినిమాను సెలబ్రేట్ చేసుకోవాలనే ఉద్దేశంతోనే మేకను తీసుకొని వచ్చినట్లు మీడియాతో సురేశ్ చెప్పారు.

News September 5, 2024

కేంద్రం సాయం త్వరగా అందేలా చూస్తా: శివరాజ్ సింగ్ చౌహాన్

image

AP: భారీ వరదలతో విజయవాడ అతలాకుతలమైందని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. తీవ్రంగా నష్టపోయిన ఏపీకి త్వరగా కేంద్రం నుంచి సాయం అందేలా ప్రయత్నిస్తానని చెప్పారు. ‘రాష్ట్రంలో పరిస్థితులపై ప్రధాని మోదీకి వివరిస్తా. ఐదురోజులపాటు విజయవాడ వాసులు నీటిలోనే ఉండిపోయారు. సహాయక చర్యల్లో సీఎం చంద్రబాబు కృషి అభినందనీయం. డ్రోన్ల ద్వారా ఆహారం, నీరు అందించడం భేష్’ అని ఆయన భరోసా ఇచ్చారు.

News September 5, 2024

వరద బాధితులకు రూ.11కోట్ల విరాళం

image

TG: రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన బాధితులను ఆదుకునేందుకు పలు సంస్థలు ముందుకొచ్చాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(TG) ఉద్యోగుల ఒకరోజు వేతనం రూ.5కోట్లు, అరబిందో ఫార్మా రూ.5కోట్లు, AIG హాస్పిటల్స్ రూ.కోటి విరాళం ఇచ్చాయి. ఈ మేరకు చెక్కులను సీఎం రేవంత్‌, డిప్యూటీ సీఎం భట్టికి అందజేశాయి. మొత్తంగా రూ.11కోట్లు CMRFకు అందాయి.

News September 5, 2024

39,481 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

image

BSF, CISF, CRPF, SSB, SSF, ITBP, అస్సాం రైఫిల్స్, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోలో 39,481 GD కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ <>నోటిఫికేషన్<<>> ఇచ్చింది. ఇవాళ్టి నుంచి అక్టోబర్ 14వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. టెన్త్ పాసైన 18-23 ఏళ్లలోపు వారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. నవంబర్ 5-7 వరకు దరఖాస్తుల్లో మార్పులు చేసుకోవచ్చు. 2025 జనవరి, ఫిబ్రవరి మధ్య పరీక్షలు జరుగుతాయి. వివరాలకు https://ssc.gov.in/loginను చూడండి.

News September 5, 2024

ఇంకా 25 రోజులే.. రైతు భరోసా ఎప్పుడు?: BRS

image

TG: BRS పార్టీ రైతు భరోసాపై ప్రభుత్వాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించింది. ‘వానాకాలం సీజన్ అయిపోవడానికి ఇంకా 25 రోజులే ఉంది. రైతు భరోసా ఎప్పుడిస్తావ్ రేవంత్?’ అని పోస్టు చేసింది. నిన్న కూడా ‘26 రోజులే ఉంది. రైతు భరోసా ఇంకెప్పుడు?’ అని ట్వీట్ చేసింది. ఇదిలా ఉంటే రైతు భరోసాపై విధివిధానాలు రూపొందించి రైతుల ఖాతాల్లో డబ్బు వేస్తామని ఆగస్టులో సీఎం రేవంత్ వెల్లడించారు.

News September 5, 2024

ఈ నెల 8న అమెరికాకు రాహుల్

image

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈ నెల 8-10 తేదీల మధ్యలో USలో పర్యటించనున్నారు. ప్రవాసులతో భేటీ అవడంతో పాటు పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. అమెరికా ప్రభుత్వ ప్రతినిధులతోనూ భేటీ కావొచ్చని తెలుస్తోంది. చివరిగా గత ఏడాది మేలో రాహుల్ అమెరికాలో పర్యటించారు. ప్రభుత్వ వ్యవస్థల్ని బీజేపీ దుర్వినియోగం చేస్తోందని అప్పట్లో ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.

News September 5, 2024

టాలీవుడ్‌లోనూ కమిషన్: మంచు విష్ణు

image

టాలీవుడ్‌లోని మహిళల భద్రత కోసం కమిషన్ ఏర్పాటు చేయాలని ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఆయన సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టిని కోరుతూ ట్వీట్ చేశారు. మహిళల రక్షణ విషయంలో టాలీవుడ్ అందరికీ ఆదర్శంగా నిలవాలని విష్ణు పేర్కొన్నారు. ఇందుకు ఎలాంటి సూచనలు, సలహాలైనా పాటిస్తామని స్పష్టం చేశారు.

News September 5, 2024

ALERT.. కాసేపట్లో ఈ జిల్లాల్లో వర్షాలు

image

తెలంగాణలోని పలు జిల్లాల్లో మరికాసేపట్లో వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్, గద్వాల, మహబూబ్‌నగర్, మల్కాజ్‌గిరి, నాగర్‌కర్నూల్, నారాయణపేట్, నిర్మల్, రంగారెడ్డి, వికారాబాద్, వనపర్తి, భువనగిరి, నల్గొండ, సంగారెడ్డిలో వర్షాలు పడతాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. పలు జిల్లాల్లో ఇప్పటికే వర్షాలు పడుతున్నాయి.

News September 5, 2024

ప్రాణాపాయ స్థితిలో ఐర్లాండ్ క్రికెటర్

image

భారత సంతతికి చెందిన ఐర్లాండ్ క్రికెటర్ సిమీ సింగ్ ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాలేయం పూర్తిగా దెబ్బతినడంతో గురుగ్రామ్‌లోని ఓ ఆస్పత్రిలో ఆయనకు వైద్యులు సర్జరీ చేశారు. సిమీ భార్య అగమ్‌దీప్ కౌర్ తన కాలేయంలోని కొంత భాగం దానం చేశారు. సిమీ సింగ్ ఐర్లాండ్ తరఫున 35 వన్డేలు, 53 టీ20లు ఆడారు. రెండు ఫార్మాట్లలో కలిపి 83 వికెట్లు పడగొట్టారు. 2021లో సౌతాఫ్రికాపై సెంచరీ కూడా బాదారు.

News September 5, 2024

తెలంగాణ పోలీస్ హెచ్చరిక

image

TG: కొమురంభీం(D) జైనూర్‌కు సంబంధించి సోషల్ మీడియాలో రెచ్చగొట్టే తప్పుడు వార్తలు వ్యాప్తి చేస్తే కఠినచర్యలు తీసుకుంటామని రాష్ట్ర పోలీస్ విభాగం హెచ్చరించింది. ‘జైనూర్‌లో ప్రస్తుతం ప్రశాంతమైన వాతావరణం నెలకొని ఉంది. ఆ ప్రాంతంలో ప్రశాంతతను నెలకొల్పేందుకు, స్థానికుల్లో మనోధైర్యం కలిగించేందుకు పోలీస్ శాఖ చర్యలు చేపట్టింది’ అని పేర్కొంది. జైనూర్‌లో ఆదివాసీ మహిళపై అత్యాచార <<14025482>>ఘటన<<>> ఉద్రిక్తతలకు దారి తీసింది.