News February 22, 2025

కరకట్ట రోడ్డు విస్తరణ.. 7.2KMలకు రూ.1,300 కోట్లు

image

AP: అమరావతిలో కృష్ణా కరకట్ట రోడ్డును తొలి దశలో ప్రకాశం బ్యారేజీ నుంచి 7.2 కిలోమీటర్ల మేర నాలుగు లేన్లుగా నిర్మించనున్నారు. ఇందుకోసం రూ.1,300 కోట్లు ఖర్చవుతుందని అధికారులు అంచనా వేశారు. కరకట్టను మరో 3.5 మీటర్ల ఎత్తు పెంచి ఇరువైపులా రిటెయినింగ్ వాల్స్ ఏర్పాటుచేయనున్నారు. కృష్ణా నదికి 15 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా తట్టుకునేలా దీన్ని నిర్మించాలని CRDA అధికారులు నిర్ణయించారు.

News February 22, 2025

ఎల్లుండి ఖాతాల్లోకి డబ్బులు

image

పీఎం-కిసాన్ పథకంలో భాగంగా ఈ నెల 24న రైతుల ఖాతాల్లో డబ్బులు జమకానున్నాయి. దేశవ్యాప్తంగా 9.7 కోట్లమంది రైతులకు మొత్తం రూ.22వేల కోట్లను కేంద్రం ఇవ్వనుంది. 2019లో ప్రారంభమైన ఈ పథకంలో భాగంగా ఏటా రూ.6వేలను కేంద్రం మూడు విడతల్లో రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. ఈ డబ్బులు రావాలంటే <>E-KYC<<>> తప్పనిసరిగా చేయాలి.

News February 22, 2025

ఆ విషయంలో కోహ్లీకే నా ఓటు: సెహ్వాగ్

image

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తన రోల్ మోడల్ అని మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ అన్నారు. ఆయనతో కలిసి మైదానంలో నడుస్తుంటే అడవిలో సింహంతో వెళ్తున్నట్లే అనిపించేదని చెప్పారు. అయితే ఛేజింగ్‌లో సచిన్, కోహ్లీలో ఎవరు బెస్ట్ అనే పోటీ వస్తే మాత్రం విరాట్‌కే తాను ఓటు వేస్తానని తెలిపారు. 2011-12 నుంచి ఇప్పటివరకు చాలా మారిపోయినట్లు వెల్లడించారు. టీమ్ ఇండియాకు ఎన్నో కీలక ఇన్నింగ్సులు ఆడారని ప్రశంసించారు.

News February 22, 2025

దంచే ఎండలు.. తేలికపాటి జల్లులు

image

APలో విచిత్ర వాతావరణం నెలకొంది. ఓవైపు ఎండలు దంచేస్తుండగా మరోవైపు ఉపరితల ద్రోణి ఏర్పడింది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తా జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని IMD వెల్లడించింది. ఆకాశం మేఘావృతమై ఉంటుందని, అయితే వాతావరణం చల్లబడే పరిస్థితి లేదని పేర్కొంది. 3 రోజులపాటు కోస్తా జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3-5డిగ్రీలు, రాయలసీమలో 1-3డిగ్రీలు అధికంగా నమోదవుతాయంది.

News February 22, 2025

ఏప్రిల్ 1 నుంచే ఇంటర్ క్లాసులు.. సెలవులు కుదింపు

image

AP: ఇంటర్ విద్యలో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. వచ్చే విద్యాసంవత్సరంలో CBSE తరహాలో APR 1 నుంచే సెకండియర్ తరగతులు ప్రారంభించాలని విద్యాశాఖ నిర్ణయించింది. అకడమిక్‌తో పోటీ పరీక్షలకు సంబంధించి 22వ తేదీ వరకు క్లాసులు నిర్వహించనుంది. APR 23 నుంచి జూన్ 1 వరకు సెలవులు ఇవ్వనుంది. గతంలో పరీక్షల పూర్తయిన వెంటనే సెలవులు ఇస్తుండగా ఇకపై వాటిని కుదించనుంది.

News February 22, 2025

కులగణనపై నేడు సీఎం అధ్వర్యంలో భేటీ

image

TG: కులగణనపై నేడు ప్రజాభవన్‌లో సీఎం రేవంత్ రెడ్డి అధ్వర్యంలో సమావేశం జరగనుంది. పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, పార్టీ బీసీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నేతలు ఈ భేటీకి హాజరుకానున్నారు. కులగణనలో వివరాల నమోదుపై అవగాహన కల్పించడంపై చర్చించే అవకాశం ఉంది. వచ్చే నెలలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో రిజర్వేషన్లపై తీర్మానం చేసే అంశాన్ని ప్రచారం చేయాలని సూచించనున్నట్లు సమాచారం.

News February 22, 2025

ఏపీ CS, DGPకి NHRC నోటీసులు

image

AP: తిరుపతి డిప్యూటీ మేయర్ ఉప ఎన్నిక సందర్భంగా జరిగిన అవాంఛనీయ ఘటనలపై NHRC ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజాప్రతినిధులపై దాడులు జరుగుతుంటే పోలీసులేం చేస్తున్నారని ప్రశ్నించింది. వారికి ఎందుకు భద్రత కల్పించలేదని నిలదీసింది. వైసీపీ ఎంపీ గురుమూర్తి పలువురిపై ఫిర్యాదు చేస్తే వారి పేర్లు FIRలో ఎందుకు లేవో చెప్పాలంది. ఈ అంశంపై 4 వారాల్లో నివేదిక ఇవ్వాలని సీఎస్, డీజీపీకి నోటీసులు జారీ చేసింది.

News February 22, 2025

భర్త కట్నం అడగనప్పటికీ 498ఏ కేసు పెట్టొచ్చు: సుప్రీం కోర్టు

image

భర్తపై 498A చట్టం ప్రకారం కేసు పెట్టడానికి అతడు కట్నం అడిగి ఉండాల్సిన అవసరం లేదని సుప్రీం కోర్టు తేల్చిచెప్పింది. ‘భర్త కట్నం అడిగితేనే ఆ కేసు పెట్టాలన్న రూలేం లేదు. క్రూరత్వం ఏ రూపంలో ఉన్నా అది వర్తిస్తుంది’ అని పేర్కొంది. ఓ భర్త కట్నం అడగకపోయినా భార్య 498ఏ కేసు పెట్టగా అది చెల్లదని AP హైకోర్టు తీర్పు చెప్పింది. దాన్ని సవాలు చేస్తూ బాధితురాలు సుప్రీంకు వెళ్లగా ధర్మాసనం తాజా వ్యాఖ్యలు చేసింది.

News February 22, 2025

ఇంకా ప్రమాదంలోనే పోప్ ఆరోగ్యం

image

పోప్ ఫ్రాన్సిస్ ఆరోగ్యం ఇంకా కుదుటపడలేదని ఆయనకు చికిత్స అందిస్తున్న జెమెల్లీ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ‘పోప్ న్యుమోనియాతో బాధపడుతున్నారు. బ్రాంకైటిస్‌గా మొదలైన సమస్య డబుల్ న్యుమోనియాగా మారింది. ఆయనకు విశ్రాంతి అవసరం. కనీసం వారం రోజుల పాటు ఆస్పత్రిలోనే ఉండాల్సి ఉంటుంది’ అని స్పష్టం చేశారు.

News February 22, 2025

నేడు మిర్చి యార్డ్, ట్రేడర్లతో సీఎం భేటీ

image

AP: మిర్చి ధరల అంశంపై సీఎం చంద్రబాబు నేడు మిర్చి యార్డ్ అధికారులు, ట్రేడర్లతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ధరల పతనంపై వారితో చర్చించే అవకాశం ఉంది. ఈ ఏడాది 5 లక్షల ఎకరాల్లో 12 లక్షల మెట్రిక్ టన్నుల మిర్చి ఉత్పత్తైంది. అందులో 4లక్షల మెట్రిక్ టన్నుల్ని వ్యాపార వర్గాలు కొనుగోలు చేశాయి. ఇక మిగిలిన 8 లక్షల మెట్రిక్ టన్నుల మిర్చి పంటకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది.