News August 14, 2024

భార్యతో విమానంలో సామాన్యుడిగా YS జగన్(PHOTO)

image

AP: మాజీ సీఎం YS జగన్ సాధారణ వ్యక్తిలా విమానంలో భార్యతో కలిసి ప్రయాణించారు. గతంలో సీఎంగా ప్రత్యేక విమానాల్లో ప్రయాణించిన ఆయన ప్రస్తుతం సామాన్యుడిలా సాధారణ విమానాల్లో ఎకానమీ క్లాసులో ప్రయాణిస్తున్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇటీవల విజయవాడ-బెంగళూరు మధ్య మాజీ సీఎం ఎక్కువగా ప్రయాణిస్తుండగా ఆ సమయంలో ఈ ఫొటో తీసినట్లు తెలుస్తోంది.

News August 14, 2024

రేపటి నుంచి ఆరోగ్య శ్రీ బంద్: ఆస్పత్రులు

image

AP: పెండింగ్ బకాయిలు చెల్లించనందున ఆగస్టు 15 నుంచి రోగులకు ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగించలేమని ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ వెల్లడించింది. ‘2023 సెప్టెంబర్ తర్వాత బిల్లుల చెల్లింపులు నిలిచిపోయాయి. రూ.2500 కోట్లు రావాల్సి ఉంది. కొత్త ప్రభుత్వం రూ.160 కోట్లు ఇచ్చింది. ఆస్పత్రుల రోజువారీ ఖర్చులకూ డబ్బులు లేవు. అందుకే సేవలు కొనసాగించలేం’ అని ప్రభుత్వానికి లేఖ రాసింది.

News August 14, 2024

రాజ్‌నాథ్ సింగ్ కీలక సమావేశం

image

జమ్మూకశ్మీర్‌లో పరిస్థితులపై కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కీలక సమావేశం నిర్వహించారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, ఇతర భద్రతా ఏజెన్సీల అధిపతులతో నార్త్ బ్లాక్‌లో భేటీ అయ్యారు. ఇటీవల జమ్మూలో ఉగ్రదాడులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ సమావేశంలో భద్రత కట్టుదిట్టం చేయడంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

News August 14, 2024

అయోధ్యలో రూ.50లక్షల విలువైన లైట్లు చోరీ!

image

అయోధ్యలో రామాలయ నిర్మాణం అనంతరం మందిర పరిసర ప్రాంతాలను సర్కారు సుందరంగా ముస్తాబు చేసింది. భక్తిపథం, రామపథం మార్గాల్లో వెదురు స్తంభాలతో కూడిన లైట్లను ఏర్పాటు చేసింది. వాటిలో 3800 వెదురు స్తంభాల లైట్లను, 36 గోబో ప్రొజెక్టర్ లైట్లను దుండగులు చోరీ చేశారు. వీటి విలువ రూ.50 లక్షల వరకు ఉంటుందని అంచనా. ఆలయ ట్రస్టు పోలీసులకు ఈ నెల 9న ఫిర్యాదు చేయగా తాజాగా వెలుగులోకి వచ్చింది.

News August 14, 2024

రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట

image

TG: గవర్నర్ కోటా MLCల నియామకంపై సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికి ఊరట లభించింది. గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే విధించింది. కొత్తగా MLCలను నియమించకుండా స్టే విధించాలన్న BRS నేతలు దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణ వేసిన పిటిషన్లను తిరస్కరించింది. కొత్త MLCల నియామకాన్ని అడ్డుకుంటే గవర్నర్, ప్రభుత్వ హక్కులు హరించినట్లే అవుతుందని విచారణ సందర్భంగా జస్టిస్ విక్రంనాథ్ ధర్మాసనం వ్యాఖ్యానించింది.

News August 14, 2024

‘ధరణి’లో ఆపరేటర్లుగా వారికి ఛాన్స్?

image

TG: ధరణి ఆపరేటర్ల స్థానంలో బీఎస్సీ, బీకాం కంప్యూటర్స్ చదివిన వారిని పోటీ పరీక్షల ద్వారా నియమించుకోవాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. కొంత మంది ఉద్యోగులు వసూళ్లకు పాల్పడుతున్నారన్న ఆరోపణల నేపథ్యంలో అవినీతి, అక్రమాలపై ప్రభుత్వం నిఘా ఉంచింది. ప్రస్తుతం పోర్టల్ నిర్వహణ చూస్తున్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ సిబ్బందిని కొనసాగించాలా? వద్దా? అనేది త్వరలో నిర్ణయించనున్నట్లు సమాచారం.

News August 14, 2024

జగన్&కో దురాగతాలకు పాల్పడుతున్నారు: లోకేశ్

image

AP: కర్నూలు(D) హోసూరులో జరిగిన మాజీ సర్పంచ్ శ్రీనివాసులు <<13847578>>హత్యను<<>> మంత్రి లోకేశ్ ఖండించారు. ‘ఎన్నికల్లో TDP తరఫున పనిచేశాడనే కక్షతో YCP మూకలు శ్రీనివాసులును హతమార్చాయి. ప్రజాక్షేత్రంలో తిరస్కారానికి గురైనప్పటికీ జగన్&కో తమ పాత పంథా మార్చుకోకుండా దురాగతాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి వారిపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుంది. శ్రీనివాసులు కుటుంబానికి అండగా ఉంటాం’ అని ట్వీట్ చేశారు.

News August 14, 2024

టెట్ రాసిన వారికి ALERT

image

TG: టెట్ రాసిన అభ్యర్థులు తమ వ్యక్తిగత వివరాల నమోదులో పొరపాట్లు చేసి ఉంటే సవరించుకోవాలని పాఠశాల విద్యాశాఖ సూచించింది. ఇందుకోసం ఈనెల 20వ తేదీ సా.5 గంటలలోపు helpdesktsdsc2024@gmail.comకు ఈ-మెయిల్ పంపాలని తెలిపింది. అలాగే డీఎస్సీ ప్రాథమిక ‘కీ’పై అభ్యంతరాలుంటే అభ్యర్థులు ఈనెల 20 సా.5గంటల వరకు <>https://schooledu.telangana.gov.in<<>> వెబ్‌సైట్‌కు పంపొచ్చని పేర్కొంది.

News August 14, 2024

ట్రోలర్స్‌పై సైనా నెహ్వాల్ ఆగ్రహం

image

జావెలిన్ త్రో ఒలింపిక్ క్రీడ అని నీరజ్ స్వర్ణం గెలిచేవరకూ తెలీదని బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా ఇటీవల వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యలపై నెట్టింట ట్రోలింగ్‌ జరుగుతోంది. దీంతో సైనా తన ట్విటర్‌లో స్పందించారు. ‘నేను నా క్రీడలో అగ్రస్థానానికి చేరుకున్నా. దేశానికి ఒలింపిక్ మెడల్ తీసుకొచ్చా. వాటి పట్ల గర్వంగా ఉన్నాను. ఇంట్లో కూర్చుని చెప్పడం సులువే. బయటికొచ్చి ఆడితే తెలుస్తుంది’ అని ట్రోలర్స్‌కు కౌంటర్ ఇచ్చారు.

News August 14, 2024

ఇది మనం ప్రామిస్ చేయాల్సిన రోజు: మోదీ

image

దేశాన్ని ముక్కలు చేయడం వల్ల లెక్కలేనంత మంది బాధితులుగా మారారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దేశ విభజన గాయాల స్మృతి దినాన వారిని స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇది వారి ధైర్యసాహసాలకు నివాళులు అర్పించాల్సిన రోజన్నారు. ‘విభజన తర్వాత ఎందరో తమ జీవితాలను పునర్నిర్మించుకున్నారు. విజయవంతం అయ్యారు. మన జాతి ఐక్యత, సౌభ్రాతృత్వాన్ని కాపాడుకుంటామని మనం ఈ రోజు పునరుద్ఘాటించాలి’ అని ఆయన Xలో పిలుపునిచ్చారు.