News April 24, 2024

‘ప్రతినిధి-2’ రిలీజ్ వాయిదా

image

నారా రోహిత్ హీరోగా నటిస్తున్న ‘ప్రతినిధి-2’ మూవీ విడుదల వాయిదా పడింది. త్వరలోనే కొత్త తేదీని ప్రకటించనున్నట్లు మేకర్స్ తెలిపారు. తొలుత ఈ సినిమాను ఏప్రిల్ 25న విడుదల చేయాలని నిర్ణయించారు. టీవీ5 మూర్తి డైరెక్ట్ చేసిన ఈ మూవీలో సిరి లెల్లా హీరోయిన్‌గా నటించారు. అజయ్ ఘోష్, సప్తగిరి, జిషు సేన్ గుప్తా కీలకపాత్రలు పోషించారు. కుమార్ రాజా, ఆంజనేయులు, సురేంద్రనాథ్ సంయుక్తంగా నిర్మించారు.

News April 24, 2024

విమానయాన సంస్థలకు డీజీసీఏ కీలక ఆదేశాలు

image

విమానయాన సంస్థలకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) కీలక ఆదేశాలు జారీ చేసింది. 12 ఏళ్ల చిన్నారులకు అదే పీఎన్‌ఆర్ నంబర్‌పై ప్రయాణిస్తున్న తల్లిదండ్రులు లేదా సంరక్షకుల్లో ఒకరి పక్కన సీటు కేటాయించాలని సూచించింది. దీంతో పాటు జీరో బ్యాగేజీ, సీట్ల ప్రాధాన్యం, మీల్స్, సంగీత వాయిద్య పరికరాలు తీసుకెళ్లడానికి రుసుములు వసూలు చేసుకోవచ్చని పేర్కొంది.

News April 24, 2024

ఆ ఇద్దరికీ బుద్ధి చెప్పాలి: కేటీఆర్

image

TG: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తల్లిపాలు తాగి రొమ్ముగుద్దిన రంజిత్ రెడ్డి, కొండా విశ్వేశ్వర్ రెడ్డికి ఓట్లతో బుద్ధి చెప్పాలన్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో చేవెళ్లలోని రాజేంద్రనగర్‌లో ఆయన మాట్లాడారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పారిపోయే పిరికిపందలకు బుద్ధి చెప్పాలని పార్టీ నేతలను కోరారు. BRSకు 8-10 సీట్లు ఇస్తే కేంద్రంలోని ప్రభుత్వం తాము చెప్పినట్లే వింటుందన్నారు.

News April 24, 2024

సోషల్ మీడియా కార్యకర్తలతో సీఎం సెల్ఫీ

image

AP: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలతో సీఎం జగన్ సెల్ఫీ దిగారు. సోషల్ మీడియా వింగ్‌తో విశాఖలో ముఖాముఖి సమావేశం ముగిసిన అనంతరం సెల్ఫీదిగి కార్యకర్తల్లో జోష్ నింపారు. ‘మా సోషల్ మీడియా సూపర్‌స్టార్స్‌తో నేను’ అంటూ ఆ ఫొటోను సీఎం జగన్ ట్వీట్ చేశారు.

News April 24, 2024

పవన్ కళ్యాణ్ అప్పులు రూ.64.26 కోట్లు

image

AP: ఐదేళ్లలో తన సంపాదన రూ.114.76 కోట్లని జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ తెలిపారు. పన్ను రూపంలో ప్రభుత్వానికి రూ.73.92 కోట్లు చెల్లించినట్లు వివరించారు. మరో రూ.20 కోట్లను విరాళాలుగా ఇచ్చినట్లు పేర్కొన్నారు. తనకు రూ.64.26 కోట్ల అప్పులు ఉన్నట్లు ఆయన తెలిపారు. బ్యాంకులు, వ్యక్తుల నుంచి ఈ అప్పులు తీసుకున్నట్లు వివరిస్తూ జనసేన పార్టీ ప్రకటన విడుదల చేసింది.

News April 24, 2024

ALERT.. రేపు వర్షాలు

image

తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు,మెరుపులు, గంటకు 40-50కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఎల్లుండి కూడా వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

News April 24, 2024

చెన్నై బదులు తీర్చుకుంటుందా?

image

IPLలో నేడు మరో ఆసక్తికర మ్యాచ్ జరగనుంది. చెన్నై వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ తలపడనున్నాయి. ఈ సీజన్‌లో ఈ రెండు జట్ల మధ్య ఇప్పటికే ఓ మ్యాచ్ జరగ్గా.. అందులో లక్నో గెలిచింది. హెడ్ టు హెడ్ రికార్డుల్లోనూ CSK 1-2తో వెనకబడి ఉంది. దీంతో గత మ్యాచ్‌లో ఎదురైన పరాభవానికి బదులు తీర్చుకోవాలని పట్టుదలతో ఉంది. మరోవైపు ఇందులో గెలిచి ప్లేఆఫ్స్‌కు మరింత చేరువ కావాలని LSG భావిస్తోంది.

News April 24, 2024

అత్యధిక ప్రకృతి విపత్తులు ఆసియాలోనే: యూఎన్

image

ప్రకృతి విపత్తుల కారణంగా ప్రపంచంలో ఆసియా అత్యధికంగా ప్రభావితమవుతోందని ఐక్యరాజ్యసమితి వాతావరణ సంస్థ(WMO) ఓ నివేదికలో తెలిపింది. తుఫాన్లు, వరదలే ఈ విపత్తుల్లో అత్యధికమని వెల్లడించింది. వీటి వలన గత ఏడాది 2వేలమందికి పైగా ప్రాణాలు కోల్పోయారని వివరించింది. ఇక అత్యధిక ఉష్ణోగ్రతలు, కరవు, భూకంపాలు, అగ్నిపర్వత విస్ఫోటనాలు వంటివి కూడా ఆసియా దేశాలపై విరుచుకుపడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది.

News April 24, 2024

బంగ్లాకు భారత మహిళా క్రికెట్ జట్టు

image

భారత మహిళా క్రికెటర్లు బంగ్లాదేశ్‌కు పయనమయ్యారు. ఐదు టీ20ల సిరీస్ కోసం హర్మన్ ప్రీత్ నాయకత్వంలో 16 మందితో కూడిన జట్టు బెంగళూరు నుంచి సిల్హెట్‌కు తరలి వెళ్లింది. భారత్-బంగ్లా మధ్య ఈ నెల 28న తొలి టీ20తో సిరీస్ మొదలుకానుంది. ఈ నెల 30న, మే 2, 6, 8 తేదీల్లో మిగతా మ్యాచ్‌లు జరుగుతాయి.

News April 24, 2024

కవితకు బెయిల్ ఇవ్వొద్దు: ఈడీ

image

లిక్కర్ స్కాం కేసులో ఈడీ అరెస్ట్‌పై కవిత బెయిల్ పిటిషన్‌పై రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ ప్రారంభమైంది. ఆమె అరెస్ట్ చట్టబద్ధంగానే జరిగిందని, బెయిల్ ఇవ్వొద్దని ఈడీ వాదిస్తోంది. అయితే లోక్‌సభ ఎన్నికల్లో కవిత స్టార్ క్యాంపెయినర్‌గా ప్రచారం చేయాల్సి ఉందని, బెయిల్ ఇవ్వాలని ఆమె తరఫు లాయర్ కోరారు. కాసేపట్లో తీర్పు వెలువడే అవకాశం ఉంది.