India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

AP: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. 25 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న వేంకటేశ్వరస్వామిని 62,112 మంది దర్శించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.36 కోట్లు వచ్చినట్లు టీటీడీ తెలిపింది. అటు, 2025 మార్చి నెలకు సంబంధించి శ్రీవారి రూ.300 ప్రత్యేక దర్శన టికెట్లు, వసతి గదుల కోటాను ఈనెల 24న విడుదల చేయనున్నారు.

జమిలి ఎన్నికల బిల్లు నేపథ్యంలో లోక్‌సభలో పార్టీల బలాబలాలపై ఆసక్తి నెలకొంది. కీలకమైన రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందాలంటే సంఖ్యాబలమే కీలకం. 543 స్థానాలున్న LSలో NDAకు 293 సీట్లు ఉన్నాయి. ఇందులో BJP 240, TDP 16, JDU 12, SS 7, LJP 5 పెద్దపార్టీలు. INDIAకు 249 సీట్లు ఉన్నాయి. కాంగ్రెస్ 99, SP 37, TMC 28, DMK 22 పెద్ద పార్టీలు. కూటమిని TMC పట్టించుకోవడం లేదు. ఇక తటస్థ పార్టీల వద్ద 11 సీట్లున్నాయి.

శబరిమలలో అయ్యప్ప భక్తుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సన్నిధానం సమీపంలోని ఫుట్ ఓవర్ బ్రిడ్జిపై నుంచి దూకడంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు అతడిని ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించాడు. మృతుడిది కర్ణాటకలోని రామనగరగా గుర్తించారు. అతడి మానసిక స్థితి సరిగ్గా లేదని పోలీసులు అనుమానిస్తున్నారు.

స్టాక్‌మార్కెట్లు ఫ్లాట్‌గా మొదలై నష్టాల్లోకి జారుకోవచ్చని విశ్లేషకులు అంటున్నారు. గ్లోబల్ మార్కెట్ల నుంచి నెగటివ్ సిగ్నల్స్ వస్తున్నాయి. నిన్న EU, US సూచీలు మిశ్రమంగా ముగిశాయి. నేడు నిక్కీ, తైవాన్ సూచీలు భారీ లాభాల్లో మొదలైనప్పటికీ గిఫ్ట్ నిఫ్టీ 39PTS పతనమవ్వడం ప్రతికూలతను సూచిస్తోంది. నిఫ్టీ సపోర్టు 24,640, రెసిస్టెన్సీ 24760 వద్ద ఉన్నాయి. USD/INR వీక్‌గా ఉంది. ఫెడ్ నిర్ణయంపై ఆసక్తి నెలకొంది.

AP: నేటి నుంచి 20వరకు, ఈ నెల 26-28 వరకు రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీల్లో ఆధార్ క్యాంపులు నిర్వహించనున్నారు. ఇక్కడ చిన్నపిల్లలకే ఆధార్ కార్డుల జారీ ఉండనుంది. రాష్ట్రంలో 0-6ఏళ్ల వయసు గల పిల్లల్లో 11లక్షల మంది వరకు ఆధార్ నమోదు చేసుకోలేదని గ్రామ, వార్డు సచివాలయ శాఖ తెలిపింది. అత్యధికంగా కర్నూలు జిల్లాలోని పిల్లలకు ఆధార్ లేదని స్పష్టం చేసింది. ఆధార్ క్యాంపుల కోసం కలెక్టర్లు ఏర్పాట్లు పూర్తి చేశారు.

చనిపోయిన తమ రెండు రోజుల కూతురి మృతదేహాన్ని తల్లిదండ్రులు మెడికల్ స్టడీస్ కోసం డొనేట్ చేసిన ఘటన డెహ్రాడూన్‌లో జరిగింది. హరిద్వార్‌కు చెందిన రామ్ మెహర్, నాన్సీ దంపతులకు మెదడు, శ్వాస సంబంధిత సమస్యలతో కూతురు జన్మించింది. ఆ శిశువును ఇంక్యుబేటర్‌లో ఉంచగా మృతిచెందింది. దీంతో డూన్ మెడికల్ కాలేజీకి బాడీని డొనేట్ చేశారు. ఇంత తక్కువ వయసున్న మృతదేహాన్ని దానం చేయడం దేశంలో ఇదే తొలిసారి అని డాక్టర్లు తెలిపారు.

సంధ్య థియేటర్ ప్రీమియర్ షోకి సెలబ్రిటీలను రానివ్వొద్దని థియేటర్ యాజమాన్యాన్ని ముందే హెచ్చరించినట్లున్న లేఖ <<14898794>>వైరల్<<>> అవుతున్న విషయం తెలిసిందే. దీని ప్రకారం యాజమాన్యం, అర్జున్ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారని పోలీసుల తరఫు లాయర్ వాదించినట్లు తెలుస్తోంది. దీంతో ఏకీభవించిన నాంపల్లి కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. హైకోర్టు మాత్రం ఈ కారణాన్ని తోసిపుచ్చుతూ అర్జున్‌కు మధ్యంతర బెయిల్ ఇచ్చింది.

TG: ఎండు మిర్చి ధర క్వింటాకు రూ.7వేల వరకు తగ్గడంతో రైతులు లబోదిబోమంటున్నారు. గత ఏడాది ఇదే నెలలో క్వింటా ఎండు మిర్చి గరిష్ఠంగా రూ.23వేలు పలకగా, ప్రస్తుతం రూ.12వేల నుంచి రూ.16వేలు పలుకుతోంది. విదేశీ మార్కెట్‌కు మిర్చి ఎగుమతులు తగ్గడమే ధరల తగ్గింపునకు కారణమని వ్యాపారులు చెబుతున్నారు. రాష్ట్రంలో ఉమ్మడి కరీంనగర్, WGL, NZB, నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లో మిర్చి అత్యధికంగా సాగవుతున్న సంగతి తెలిసిందే.

TG: త్వరలోనే రాష్ట్రంలోని చేనేత కార్మికుల రుణాలను మాఫీ చేస్తామని అసెంబ్లీలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. ఏడాదిలో 13 మంది నేతన్నలు ఆత్మహత్య చేసుకున్నారని, వారిలో ముగ్గురి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సాయం చేసినట్లు చెప్పారు. మరో 10 మందికీ త్వరలోనే సాయం చేస్తామని వెల్లడించారు. ఇక రాష్ట్రంలోని జిల్లాల సంఖ్యను తగ్గించే ఆలోచన ప్రభుత్వానికి లేదని మరో మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు.

సోమవారం సమావేశమైన తెలంగాణ క్యాబినెట్ నిర్ణయాలను ప్రజలకు వెల్లడించలేదు. CM రేవంత్ ఇవాళ లేదా రేపు నేరుగా అసెంబ్లీలో ప్రకటిస్తారని సమాచారం. ఫార్ములా రేసు- KTR, విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు-KCR వ్యవహారాలతో పాటు పంచాయతీరాజ్, యూనివర్సిటీ, GST చట్టాలకు చేసే సవరణ బిల్లులను మంత్రివర్గం ఆమోదించినట్లు తెలుస్తోంది. అటు భూమి లేని రైతులకు రైతు భరోసా, కొత్త రేషన్ కార్డుల జారీకి ఆమోదముద్ర వేసినట్లు సమాచారం.
Sorry, no posts matched your criteria.