News September 20, 2024

అశ్విన్ సూపర్ సెంచరీ.. పలు రికార్డులు

image

BANపై సెంచరీ చేసిన అశ్విన్ పలు రికార్డులను సొంతం చేసుకున్నారు. ఒకే వేదికలో 2సెంచరీలు, పలుమార్లు 5+ వికెట్లు తీసుకున్న ఆటగాళ్ల జాబితాలో చేరారు. అశ్విన్ చెన్నైలో 2 సెంచరీలు, 4సార్లు 5 వికెట్లు తీశారు. సోబెర్స్ హెడ్డింగ్లీలో, కపిల్ చెన్నైలో, క్రెయిన్స్ ఆక్లాండ్‌లో, ఇయాన్ హెడ్డింగ్లీలో ఈ ఫీట్ చేశారు. అలాగే నం.8 లేదా దిగువన బ్యాటింగ్‌కు దిగి అత్యధిక సెంచరీలు(4) చేసిన రెండో ప్లేయర్‌గా అశ్విన్ నిలిచారు.

News September 20, 2024

పేజర్లు, వాకీటాకీలపై విమానాల్లో నిషేధం

image

పేజర్లు, వాకీటాకీల పేలుళ్లతో వణికిపోతున్న లెబనాన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై తమ రాజధాని బీరుట్ నుంచి వెళ్లే విమానాల్లో వాటిని తీసుకెళ్లడంపై నిషేధం విధించింది. విమాన ప్రయాణికులందరినీ క్షుణ్ణంగా చెక్ చేయాలని ఆదేశించింది. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఈ నిషేధం కొనసాగుతుందని పేర్కొంది. కాగా వాకీటాకీలు, పేజర్లు పేలుడు ఘటనల్లో 30 మందికి పైగా చనిపోగా, వేలాది మంది గాయపడ్డారు.

News September 20, 2024

పట్టాలపై 6 మీటర్ల ఇనుప స్తంభం.. తప్పిన ప్రమాదం

image

లోకో పైలట్ అప్రమత్తతతో ఘోర రైలు ప్రమాదం తప్పింది. ఉత్తరాఖండ్‌లోని రుద్రపూర్ వద్ద పట్టాలపై 6 మీటర్ల ఇనుప స్తంభం ఉన్నట్లు జన్ శతాబ్ది ఎక్స్‌ప్రెస్ లోకో పైలట్ గుర్తించాడు. ఎమర్జెన్సీ బ్రేకులు అప్లై చేసి రైలును ఆపేయడంతో ప్రమాదం తప్పింది. పోల్ తీసేసిన తర్వాత రైలు అక్కడి నుంచి ముందుకు కదిలింది. కాగా ఇటీవల పట్టాలపై రాళ్లు, సిమెంట్ దిమ్మెలు, సిలిండర్లు ఉంచిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి.

News September 20, 2024

ALERT: ఈ జిల్లాల్లో వర్షాలు

image

తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వర్షాలు మొదలవనున్నాయి. ఇవాళ APలోని శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి జిల్లాల్లో మోస్తరు వానలు పడతాయని APSDMA వెల్లడించింది. విశాఖ, అనకాపల్లి, ఉ.గో, కృష్ణా, NTR, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయంది. TGలోని ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం జిల్లాల్లో ఎల్లుండి వానలు పడతాయని HYD వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ ఇచ్చింది.

News September 20, 2024

ఆ కేంద్రమంత్రి తల తెచ్చిన వారికి నా ఆస్తి రాసిస్తా: కాంగ్రెస్ ఎమ్మెల్యే

image

TG: రాహుల్ గాంధీ నంబర్ వన్ ఉగ్రవాది అంటూ కేంద్రమంత్రి రవ్‌నీత్ సింగ్ బిట్టు చేసిన ఆరోపణలపై ఖానాపూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు తీవ్రస్థాయిలో ఫైరయ్యారు. బిట్టు తల నరికి తెచ్చినవారికి తన ఎకరం 38 గుంటల వ్యవసాయ భూమిని రాసిస్తానని ప్రకటించారు. బిట్టుపై బీజేపీ కఠినచర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అటు బిట్టుపై కర్ణాటక కాంగ్రెస్ నేతల ఫిర్యాదుతో బెంగళూరులో కేసు నమోదైంది.

News September 20, 2024

నేటి నుంచి ఆన్‌లైన్‌లో ఇసుక బుకింగ్

image

AP: ఇసుక బుకింగ్ కోసం రూపొందించిన ఏపీ శాండ్ మేనేజ్‌మెంట్ పోర్టల్ నేడు అందుబాటులోకి రానుంది. ఉ.10.30-మ.12 వరకు గ్రామ, వార్డు సచివాలయాల్లో, మ.12-సా.6 వరకు ఎవరైనా వ్యక్తిగతంగా బుకింగ్‌ చేసుకునేలా పోర్టల్‌ను రూపొందించారు. అయితే 24 గంటలూ బుకింగ్‌కు అవకాశం ఉండాలని CM చంద్రబాబు ఆదేశించడంతో అధికారులు మార్పులు చేస్తున్నారు. వాగులు, వంకల నుంచి ఇసుక తీసుకెళ్లే ప్రజలను ఇబ్బంది పెట్టొద్దని ఆయన స్పష్టం చేశారు.

News September 20, 2024

ఇసుక ఆన్‌లైన్ బుకింగ్ ఇలా

image

✒ <>https://www.mines.ap.gov.in/<<>> వెబ్‌సైట్‌లోని ఏపీ శాండ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్(APSMS) పోర్టల్‌లో తొలుత రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
✒ ఆ తర్వాత జనరల్ కన్‌జ్యూమర్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి, ఆధార్, మొబైల్ నంబర్ నమోదు చేయాలి.
✒ మెయిల్ ఐడీ, చిరునామా ఎంటర్ చేస్తే రిజిస్ట్రేషన్ ఖరారవుతుంది.
✒ ఆ తర్వాత నిర్మాణ వివరాలు నమోదు చేయాలి. పేమెంట్ పూర్తిచేశాక ఏ రోజు డెలివరీ అవుతుందో మెసేజ్ వస్తుంది.

News September 20, 2024

‘మీసేవ’లో సర్వర్ సమస్యలు.. ప్రజలకు ఇబ్బందులు

image

TG: రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 3 వారాలుగా ‘మీసేవ’ సర్వర్లలో సమస్యలు ఏర్పడుతున్నాయి. క్యాస్ట్, ఇన్‌కమ్, నివాస, జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు, ఇతర సర్టిఫికెట్లు డౌన్‌లోడ్ కాకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. రాష్ట్రంలోని 5,216 మీసేవా కేంద్రాల ద్వారా 38 శాఖలకు చెందిన 204 రకాల సేవలు అందుతున్నాయి.

News September 20, 2024

కూటమి పాలనకు 100 రోజులు.. ‘ఇది మంచి ప్రభుత్వమేనా?’

image

AP: కూటమి పాలనకు నేటితో 100 రోజులు పూర్తవడంతో 26వ తేదీ వరకు ‘ఇది మంచి ప్రభుత్వం’ పేరుతో MLAలు క్యాంపెయిన్ చేయనున్నారు. పెన్షన్ల పెంపు, మెగా DSC, అన్న క్యాంటీన్లు, అమరావతి, పోలవరానికి నిధులు, ‘ల్యాండ్ టైటిలింగ్’ రద్దు తదితర 100 కార్యక్రమాలు చేశామని నేతలు చెబుతున్నారు. ‘సూపర్-6’ ఊసు లేదని, ప్రత్యర్థులపై దాడులు, హత్యలు తప్ప చేసిందేమీ లేదని YCP విమర్శిస్తోంది. మీరేమంటారు? ఇది మంచి ప్రభుత్వమేనా?

News September 20, 2024

విశాఖ స్టీల్ ప్లాంట్‌కు రూ.500 కోట్లు?

image

AP: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరుగుతోందన్న ఆరోపణల వేళ కేంద్రం ఈ ఫ్యాక్టరీకి రూ.500 కోట్లు మంజూరు చేసినట్లు సమాచారం. ఈ నిధులతో జీఎస్టీ, ఉద్యోగ భవిష్య నిధి, ప్రభుత్వ లెవీలు వంటి చట్టబద్ధమైన చెల్లింపులు చేయాలని సూచించినట్లు తెలుస్తోంది. చెల్లింపుల నిర్వహణను SBIకి అప్పగించినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇతర అంశాలకు వినియోగిస్తే వెంటనే నిలిపేయాలని సూచించినట్లు పేర్కొంటున్నాయి.