News September 18, 2024

‘పుష్ప-2’ వల్ల చిన్న సినిమాలు వెనకడుగు!

image

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తోన్న ‘పుష్ప-2’ డిసెంబర్ 6న రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. ఈ సినిమా రిలీజ్ నేపథ్యంలో డిసెంబర్‌లో చిన్న సినిమాలు విడుదల తేదీలను ప్రకటించడంలో వెనకడుగేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఒకవేళ ‘పుష్ప-2’ పోస్ట్‌పోన్ అయితే అప్పుడు రిలీజ్ చేస్తారని సమాచారం. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ కూడా సంక్రాంతి లేకపోతే మార్చిలో రిలీజయ్యే ఛాన్స్ ఉందని సినీవర్గాలు తెలిపాయి.

News September 18, 2024

నెలలోనే 48 మంది శిశువులు మృతి.. KTR ఫైర్

image

గాంధీ ఆస్పత్రిలో ఆగస్టు నెలలో 48 మంది పసిపిల్లలు, 14 మంది బాలింతలు చనిపోవడంపై కేటీఆర్ ఫైరయ్యారు. ‘ఇది ఊహించుకుంటేనే ఒళ్లు జ‌ల‌ద‌రిస్తోంది. రాష్ట్రంలో ప్ర‌భుత్వం ఉందా? వ్య‌వ‌స్థ‌లు ప‌నిచేస్తున్నాయా? ఎంతో మందికి ప్రాణం పోసిన గాంధీలో ఇంత విషాదం ఎవ‌రి పాపం? ఒక్క ఆస్పత్రిలోనే ఇలా ఉంటే రాష్ట్రం మొత్తం ఇంకెలా ఉందో. పాల‌న గాలికి వ‌దిలి విగ్ర‌హ రాజ‌కీయాలు చేస్తే ఇలానే ఉంటుంది’ అని మండిపడ్డారు.

News September 18, 2024

పటేల్ లేకపోతే తెలంగాణ పాకిస్థాన్‌లో ఉండేది: సంజయ్

image

TG: సర్దార్ వల్లభాయ్ పటేల్ లేకపోతే తెలంగాణ పాకిస్థాన్‌లో ఉండేదని కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు. తెలంగాణను పాకిస్థాన్‌లో కలపాలని నిజాం అనుకున్నాడని, పటేల్ అసలైన తెలంగాణకు విముక్తి కల్పించారని తెలిపారు. MIMకు భయపడి BRS, కాంగ్రెస్ తెలంగాణ విమోచన దినం జరపడం లేదని ఫైరయ్యారు. MIM పార్టీ రజాకార్ల దళం నుంచి పుట్టిందని సంజయ్ వ్యాఖ్యానించారు.

News September 18, 2024

APPLY NOW: 1,130 కానిస్టేబుల్ ఉద్యోగాలు

image

CISFలో 1,130 కానిస్టేబుల్(పురుషులు) ఉద్యోగాలకు ఈ నెల 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్ పూర్తిచేసి, 18-23 ఏళ్లలోపు వయసు ఉన్న వారు అర్హులు. PET, PST, సర్టిఫికెట్ వెరిఫికేషన్, రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఫీజు రూ.100. పే స్కేల్ రూ.21,700-69,100 ఉంటుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.
వెబ్‌సైట్: https://cisfrectt.cisf.gov.in/

News September 18, 2024

పంజాబ్ కింగ్స్ హెడ్ కోచ్‌గా పాంటింగ్?

image

IPLలో పంజాబ్ కింగ్స్ హెడ్ కోచ్‌గా ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ నియమితులయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ఆయన ఆ జట్టు యాజమాన్యంతో సంప్రదింపులు జరిపారని cricbuzz వెల్లడించింది. 2018 నుంచి పాంటింగ్ ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్‌గా పని చేశారు. 2019, 20, 21లో ఆ టీమ్ ప్లేఆఫ్స్‌కు వెళ్లింది.

News September 18, 2024

పారిశ్రామికవేత్తలకు రాయితీలు కల్పిస్తున్నాం: మంత్రి శ్రీధర్

image

TG: పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేలా నూతన MSME పాలసీని రూపొందించినట్లు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఈ మేరకు పలు రాయితీలను కల్పిస్తున్నామన్నారు. ‘MSMEల్లో ఆధునిక సాంకేతికతకు రూ.100 కోట్లు కేటాయిస్తున్నాం. టెండర్ దరఖాస్తుకు ఖర్చు లేకుండా చేస్తున్నాం. పాలసీ విషయంలో 120 మంది పారిశ్రామిక ప్రముఖుల సలహాలు తీసుకున్నాం. రాష్ట్ర ఎకానమీని 1 ట్రిలియన్‌ డాలర్లకు చేర్చడమే మా లక్ష్యం’ అని పేర్కొన్నారు.

News September 18, 2024

ఆ బీఆర్ఎస్ భవనాన్ని కూల్చివేయండి: హైకోర్టు

image

TG: బీఆర్ఎస్‌కు హైకోర్టులో షాక్ తగిలింది. నల్గొండలోని బీఆర్ఎస్ కార్యాలయాన్ని 15 రోజుల్లో కూల్చివేయాలని హైకోర్టు ఆదేశించింది. పార్టీ ఆఫీసును రెగ్యులర్ చేసేలా అనుమతి ఇవ్వాలని పిటిషన్ దాఖలవ్వగా ముందే అనుమతి తీసుకోవాల్సిందని కోర్టు పేర్కొంది. కాగా అంతకుముందు ప్రభుత్వ స్థలంలో ఎలాంటి అనుమతి లేకుండా ఆఫీసును కట్టారని కాంగ్రెస్ ఆరోపించింది.

News September 18, 2024

ఒత్తిడికి లోనవుతున్నారా? ఇలా చేయండి

image

పని ఒత్తిడి వల్ల <<14129191>>ఆత్మహత్యలు<<>> చేసుకోవడం ఆందోళన కలిగించే అంశం. ఒత్తిడిని తగ్గించేందుకు వ్యాయామం చేయడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. రోజూ యోగా, ధ్యానం, ప్రాణాయామం చేయాలి. నచ్చినవాళ్లతో మాట్లాడాలి. మ్యూజిక్ వినాలి. పుస్తకాలు చదవాలి. నచ్చిన ఆహారం తినాలి. ఆందోళనలో చెడు వ్యసనాలు దగ్గరయ్యే అవకాశం ఉంది. వాటికి దూరంగా ఉండాలి. వారాంతాల్లో పనులన్నీ పక్కన పెట్టి కుటుంబం, స్నేహితులతో జాలీగా గడపండి. SHARE IT

News September 18, 2024

మళ్లీ టెన్షన్: అరుణాచల్ సమీపంలో చైనా హెలీపోర్ట్ నిర్మాణం

image

అరుణాచల్ ప్రదేశ్‌లోని ఫిష్‌టెయిల్ ప్రాంతానికి సమీపంలో LAC వద్ద 20KM దూరంలో చైనా హెలీపోర్ట్ నిర్మించడం మళ్లీ టెన్షన్ పెంచుతోంది. మెరుగైన సదుపాయాల్లేని ఈ ప్రాంతంలోకి అత్యంత వేగంగా మిలిటరీ సామగ్రిని తరలించేందుకే దీనిని నిర్మించారని సమాచారం. 2023, డిసెంబర్ 1కి ముందు అక్కడేమీ లేదని శాటిలైట్ ఇమేజెస్ ద్వారా తెలిసింది. చైనా నియంత్రణలోని టిబెట్‌లో దీనిని నిర్మించడంతో భారత్ అభ్యంతరం చెప్పలేకపోతోంది.

News September 18, 2024

రాజకీయ పార్టీల ఫ్రీబీస్‌పై విచారిస్తాం: సుప్రీం కోర్టు

image

ఎన్నికలప్పుడు రాజకీయ పార్టీల ఉచిత హామీలపై విచారణ అత్యంత ముఖ్యమని సుప్రీంకోర్టు తెలిపింది. అవతలిపక్షం వాదనలు వినాల్సి ఉండటంతో పిల్‌ను నేడు విచారించడం కుదరదంది. కాజ్‌లిస్టు నుంచి డిలీట్ చేయబోమని CJI చంద్రచూడ్, జస్టిస్‌లు పార్థివాల, మనోజ్ మిశ్రా బెంచ్ పేర్కొంది. ఫ్రీబీస్ హామీలిచ్చే పార్టీల గుర్తుల్ని నిలిపేయాలని, వాటి గుర్తింపు రద్దు చేసేలా ఈసీకి ఆదేశాలివ్వాలంటూ మార్చి 20న ఓ లాయర్ ఈ పిల్ వేశారు.