News November 24, 2024

చాహల్‌కు రూ.18 కోట్లు

image

IPL మెగా వేలంలో లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్‌ అదరగొట్టారు. రూ. 18 కోట్లకు పంజాబ్ కింగ్స్ కొనుగోలు చేసింది. ఇతను బేస్ ప్రైజ్ రూ.2 కోట్లతో వేలంలోకి వచ్చారు. గత సీజన్లో ఇతను రాజస్థాన్ రాయల్స్ తరఫున కీలక సమయంలో వికెట్లు తీసి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించారు.

News November 24, 2024

‘ప్రభాస్-హను’ కోసం జైలు సెట్

image

ప్రభాస్‌తో హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న సినిమా కోసం ఫిల్మ్ సిటీలో జైలు సెట్ వేశారు. అందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. సెట్‌పై అలీపోర్ జైలు, 1906 అని రాసి ఉంది. ఇది స్వాతంత్ర్యానికి పూర్వం జరిగే కథ అని ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ సైనికుడిగా చేస్తున్నట్లు సమాచారం. ఆయన సరసన డాన్సర్ ఇమాన్వీ హీరోయిన్‌గా నటిస్తున్నారు.

News November 24, 2024

గవర్నర్‌ను కలిసిన హేమంత్.. 28న ప్రమాణస్వీకారం

image

న‌వంబ‌ర్ 28న ఝార్ఖండ్ ముఖ్య‌మంత్రిగా హేమంత్ సోరెన్‌ ప్ర‌మాణ‌స్వీకారం చేయనున్నారు. కొద్దిసేపటి క్రితం గ‌వ‌ర్న‌ర్‌ సంతోష్ గంగ్వార్‌ను క‌లిసిన హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రిగా రాజీనామా చేసి కొత్త ప్ర‌భుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరారు. ఝార్ఖండ్‌లో జేఎంఎం ఆధ్వ‌ర్యంలోని ఇండియా కూట‌మి 56 స్థానాల్లో విజ‌యం సాధించడం తెలిసిందే. కాంగ్రెస్ 16, ఆర్జేడీ 4, CPI(ML)L 2, ఎన్డీయే 24 స్థానాల్లో గెలుపొందాయి.

News November 24, 2024

డేవిడ్ మిల్లర్‌ను ఎంతకు కొనుగోలు చేశారంటే?

image

డెత్ ఓవర్లలో హార్డ్ హిట్టింగ్‌తో బౌలర్లకు చుక్కలు చూపించే డేవిడ్ మిల్లర్‌ను లక్నో జట్టు రూ.7.5కోట్లకు కొనుగోలు చేసింది. గత ఐపీఎల్ సీజన్‌లో మిల్లర్ గుజరాత్ టైటాన్స్ తరఫున ప్రాతినిధ్యం వహించాడు.

News November 24, 2024

షమీని సొంతం చేసుకున్న SRH

image

పేస్ బౌలర్ మహ్మద్ షమీని SRH రూ.10కోట్లకు కొనుగోలు చేసింది. ఇతని బేస్ ప్రైజ్ రూ.2కోట్లు కాగా, గత సీజన్లో గుజరాత్ టైటాన్స్ తరఫున ఆడారు. ఇతను పవర్ ప్లే, డెత్ ఓవర్ల‌లోనూ రాణించగలరు.

News November 24, 2024

భ‌ర్త ఆత్మ‌హ‌త్యను వీడియో రికార్డు చేసిన భార్య‌

image

భ‌ర్త(29) ఆత్మ‌హ‌త్య చేసుకుంటుండ‌గా నిలువ‌రించాల్సింది పోయి ఆ ఘ‌ట‌నను ఫోన్‌లో రికార్డు చేసిన భార్య‌(29)పై మహారాష్ట్ర థానే పోలీసులు కేసు న‌మోదు చేశారు. భార్యాభర్తలిద్దరూ నిత్యం గొడ‌వ‌ప‌డేవారు. ఈ క్ర‌మంలో నవంబర్ 20న ఉరివేసుకొని భ‌ర్త ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. ఆ స‌మ‌యంలో అక్క‌డే ఉండి భ‌ర్త‌ను కాపాడ‌కుండా భార్య వీడియో రికార్డు చేసింది. మృతుడి త‌ల్లి ఫిర్యాదుతో పోలీసులు భార్యపై కేసు న‌మోదు చేశారు.

News November 24, 2024

‘ఫార్మాసిటీ’ గెజిట్‌ను రద్దు చేయండి: హరీశ్‌రావు

image

TG: లగచర్లలో ఫార్మాసిటీ ఏర్పాటుచేస్తున్నట్లు జులై 19న గెజిట్ విడుదల చేసి ఇప్పుడు పారిశ్రామిక కారిడార్ అని సీఎం రేవంత్ అబద్ధాలు చెబుతున్నారని హరీశ్‌రావు మండిపడ్డారు. వెంటనే పాత గెజిట్‌ను రద్దుచేయాలని డిమాండ్ చేశారు. సీఎం లగచర్లకు వెళ్లి అక్కడి ప్రజలతో మాట్లాడాలని, పోలీసులను ప్రయోగిస్తే కుదరదని స్పష్టం చేశారు. మహారాష్ట్ర ఎన్నికల్లో ఓటమి తర్వాతైనా కాంగ్రెస్ తీరు మార్చుకోవాలని సూచించారు.

News November 24, 2024

IPL: రిషభ్ పంత్‌కు రూ.27 కోట్లు

image

అందరూ అనుకున్నట్లుగానే రిషభ్ పంత్ అదరగొట్టారు. ఈ యువ సంచలనాన్ని రూ.27 కోట్లకు లక్నో సొంతం చేసుకుంది. RTM పద్ధతిలో ఢిల్లీ దక్కించుకునేందుకు ప్రయత్నించినా లక్నో తగ్గలేదు. IPL చరిత్రలో ఇదే అత్యధిక ధర. ఇదే వేలంలో శ్రేయస్ అయ్యర్ రూ.26.75 కోట్లు పలకగా ఆ రికార్డును పంత్ బద్దలుకొట్టారు.

News November 24, 2024

ప్రశాంత్ కిశోర్ పార్టీకి బిహార్‌లో పరాభవం

image

ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త ప్రశాంత్ కిశోర్ స్థాపించిన జ‌న్ సురాజ్ పార్టీకి మొద‌టి రాజ‌కీయ‌ ప‌రాభ‌వం ఎదురైంది. బిహార్‌లో నాలుగు అసెంబ్లీ స్థానాల‌కు జ‌రిగిన ఉప ఎన్నిక‌ల్లో ఆ పార్టీ అభ్య‌ర్థులు కనీస ప్ర‌భావం చూప‌లేక‌పోయారు. తరారీ, రామ్‌గ‌ఢ్‌, బెలగంజ్, ఇమామ్‌గంజ్ స్థానాల‌ను అధికార ఎన్డీయే కైవ‌సం చేసుకుంది. విప‌క్ష ఆర్జేడీ రెండో స్థానంలో నిలవగా, జ‌న్ సురాజ్ మూడో స్థానానికి పరిమిత‌మైంది.

News November 24, 2024

మిచెల్ స్టార్క్‌కు రూ.11.75 కోట్లు

image

పేస్ బౌలర్ మిచెల్ స్టార్క్‌ను రూ.11.75 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది. గత వేలంలో ఇతణ్ని ఐపీఎల్ చరిత్రలోనే రికార్డు ధర రూ.24.75కోట్లకు కోల్‌కతా కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. పవర్ ప్లే, డెత్ ఓవర్లలోనూ స్టార్క్ స్పెషలిస్ట్ బౌలర్.