India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: ఈ నెల 4న ఓట్ల లెక్కింపు సమయంలో కౌంటింగ్ కేంద్రాల వద్ద నాలుగంచెల భద్రత ఉంటుందని CEO వికాస్ రాజ్ మీడియా సమావేశంలో వెల్లడించారు. కౌంటింగ్ హాల్లో ఎలక్ట్రానిక్ పరికరాలు అనుమతి లేదని పునరుద్ఘాటించారు. లెక్కింపు ప్రక్రియలో దాదాపు 10 వేల మంది సిబ్బంది పాల్గొంటారని వెల్లడించారు. ETPBS(ఆర్మీ, పారా మిలిటరీ) ఓట్లు ఇంకా వస్తున్నాయని, జూన్ 4 ఉదయం 8 గంటల వరకు వచ్చిన వాటిని పరిగణనలోకి తీసుకుంటామన్నారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఎక్కువగా ‘CASIO’ వాచ్‌లు ధరించడానికి గల కారణాన్ని వెల్లడించారు. తెలంగాణలో జరిగిన లోక్‌సభ ఎన్నికల పోలింగ్ సమయంలో ఆయన CASIO వాచ్ ధరించగా.. దీనిపై ఓ నెటిజన్ ప్రశ్నించారు. దీనికి ఆయన స్పందిస్తూ.. ‘ఈ వాచ్ సమయం మాత్రమే చూపించదు. మనం ఎక్కడి నుంచి వచ్చామో గుర్తుచేస్తుంది’ అని రిప్లై ఇచ్చారు.
రేపటి నుంచి T20 ప్రపంచ కప్ ప్రారంభం కానుంది. ధనాధన్ ఆటతో ఆటగాళ్లు ప్రేక్షకులను అలరించనున్నారు. T20 WCలో భారత మాజీ ఆటగాడు యువరాజ్ సింగ్ పేరిట ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ రికార్డు ఉంది. 2007 WCలో 12 బంతుల్లోనే యూవీ అర్ధసెంచరీ సాధించారు. ఆ తర్వాత మైబర్గ్ (17 బంతుల్లో), స్టొయినిస్ (17), మ్యాక్స్‌వెల్ (18), కేఎల్ రాహుల్ (18), షోయబ్ మాలిక్ (18) ఉన్నారు. ఈ WCలో ఎవరు ఫాస్టెస్ట్ ఫిఫ్టీ కొడతారో కామెంట్ చేయండి.
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అనారోగ్యానికి గురయ్యారని ఆయన తరఫు లాయర్ల బృందం కోర్టుకు తెలిపింది. ఆయనకు చికిత్స అవసరమని వివరించింది. లిక్కర్ పాలసీ కేసులో మధ్యంతర బెయిల్‌పై బయటికి వచ్చిన కేజ్రీవాల్ జూన్ 2న తిహార్ జైలులో సరెండర్ కావాల్సి ఉంది. ఇదిలా ఉంటే ఆరోగ్యం విషయంలో కేజ్రీవాల్ తప్పుడు సమాచారం ఇస్తున్నారని ED ఆరోపిస్తోంది.
TG: తెలంగాణ ఏర్పాటులో BJP దివంగత నాయకురాలు సుష్మా స్వరాజ్ పాత్ర మర్చిపోలేమని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆవిర్భావ వేడుకలు రాజకీయ విమర్శలకు వేదిక కాకూడదని అభిప్రాయపడ్డారు. అన్ని పార్టీలు ఈ వేడుకలు చేసుకోవాలని కోరారు. పరేడ్ గ్రౌండ్స్‌లో వేడుకల ఏర్పాట్లను పరిశీలించిన సందర్భంగా మంత్రి మాట్లాడారు. తెలంగాణ బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందడంలో సుష్మా స్వరాజ్ కీలకపాత్ర పోషించిన విషయం తెలిసిందే.
TG: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తుండగా, మరికొన్ని చోట్ల విపరీతమైన ఎండలు ఉంటున్నాయి. ఈ నెల 6 వరకు వానలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం వెల్లడించింది. రేపు నల్గొండ, సూర్యాపేట, వరంగల్, హన్మకొండ, జనగామ, మహబూబ్‌నగర్, వనపర్తి, నారాయణపేట, గద్వాల్ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయంటూ ఎల్లో అలర్ట్ ఇచ్చింది. ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, భద్రాద్రి, ఖమ్మం జిల్లాల్లో వడగాలులు వీస్తాయని తెలిపింది.
POK విదేశీ భూభాగమని పాక్ ప్రభుత్వ న్యాయవాది చేసిన వ్యాఖ్యలు నెట్టింట సంచలనంగా మారాయి. ఇస్లామాబాద్ HCలో ఓ కేసు విచారణ సందర్భంగా POK(ఆజాద్ కాశ్మీర్) పాక్‌లో అంతర్భాగం కాదని పేర్కొన్నారు. దీనిపై కోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ అక్కడ సైన్యాన్ని ఎందుకు మోహరించారని ప్రశ్నించింది. న్యాయవాది వ్యాఖ్యలతో ఇన్నాళ్లూ ఆజాద్ కాశ్మీర్‌గా ఆ దేశం పేర్కొంటూ వస్తున్న పీఓకే భారత్‌లో అంతర్భాగమని అంగీకరించినట్లయింది.
బాలకృష్ణ-బోయపాటి శ్రీను కాంబోలో అఖండ-2 మూవీ ప్రీప్రొడక్షన్ పనులు మొదలైనట్లు సమాచారం. డైరెక్టర్ ఇప్పటికే స్క్రిప్ట్ పూర్తి చేసినట్లు తెలుస్తోంది. సినిమాలో కీలకమైన విలన్ పాత్ర కోసం సంజయ్ దత్, బాబీ డియోల్ లాంటి స్టార్లను సంప్రదించినట్లు టాలీవుడ్ టాక్. త్వరలోనే మూవీ షూటింగ్ ప్రారంభిస్తారని వార్తలు వస్తున్నాయి. 2021లో రిలీజైన ‘అఖండ’ సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే.
TG: రాష్ట్రంలో కాంగ్రెస్ 9-12 లోక్‌సభ సీట్లు గెలవబోతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. వచ్చే పదేళ్లు కాంగ్రెస్ పార్టీయే అధికారంలో ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ నెల 4 తర్వాత BRS పార్టీయే ఉండదని మీడియా సమావేశంలో తెలిపారు. సోనియాపై విమర్శలు చేసిన KCRకు ప్రజలు బుద్ధి చెప్పారన్నారు. రాష్ట్ర చిహ్నంపై BRS నేతలు అనవసరమైన వివాదం చేస్తున్నారని దుయ్యబట్టారు.
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పోలింగ్ బూత్‌లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ పోలింగ్ కేంద్రం హిమాచల్‌ప్రదేశ్‌లోని తాషిగ్యాంగ్‌లో ఉంది. సముద్ర మట్టానికి 15,256 అడుగుల ఎత్తులో ఉన్న ఈ పోలింగ్ కేంద్రంలో మొత్తం 62 మంది ఓటర్లు ఉన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం దీన్ని మోడల్ పోలింగ్ స్టేషన్‌గా ప్రకటించింది. 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో ఈ పోలింగ్ కేంద్రంలో 100 శాతం పోలింగ్ నమోదైంది.
Sorry, no posts matched your criteria.