India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన మాల్దీవులు అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జుకు ప్రధాని నరేంద్ర మోదీ ధన్యవాదాలు తెలియజేశారు. ‘మాల్దీవులను భారత్ విలువైన మిత్రుడిగా పరిగణిస్తోంది. ప్రజల మేలు కోసం రెండు దేశాలు కలిసి పనిచేయాలి’ అని ఎక్స్‌లో ఆయన బదులిచ్చారు. కొన్ని రోజుల క్రితం వరకు శత్రుత్వం ప్రదర్శించిన ముయిజ్జు ప్రస్తుతం భారత్‌కు అనుకూలంగా ప్రవర్తిస్తున్నారు. ఈ మధ్యే కొన్ని దీవుల్నీ అప్పగించారు.
వినేశ్ 100gr అధిక బరువుతో డిస్‌క్వాలిఫై కావడం తెలిసిందే. సెమీస్ తర్వాత ఆమె 49.9-52.7 కిలోలకు పెరిగారు. ఉదయం 300gr జ్యూస్, బౌట్స్‌కు ముందు తర్వాత తీసుకున్న ఫ్లూయిడ్స్‌తో 2KG, మధ్యాహ్నం స్నాక్స్‌తో మరో 700gr పెరిగారు. ఫైనల్‌కు ముందు రాత్రి ఎన్ని కసరత్తులు చేసినా 50KG లోపు తగ్గలేదు. బట్టలు, జుట్టు కత్తిరించినా వృథానే అయింది. నిజానికి ఆమె సాధారణ బరువు 57KG. ఈ స్థాయి నుంచి తగ్గుతూ వస్తోంది.
హమాస్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం కొనసాగుతోంది. గత 10 నెలలుగా జరుగుతున్న ఈ పోరులో 40వేల మందికి పైగా పాలస్తీనియన్లు మరణించినట్లు గాజా ఆరోగ్య విభాగం వెల్లడించింది. గాజా జనాభాలో ఇది 2శాతం కావడం గమనార్హం. ఇంకా మిస్ అయిన వారి వివరాలు తెలియాల్సి ఉందని అధికారులు తెలిపారు. గత ఏడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ మెరుపు దాడులకు పాల్పడటంతో యుద్ధం ప్రారంభమైంది.
కర్ణాటకలోని తుంగభద్ర డ్యాం గేటు బిగింపు ప్రక్రియ ప్రారంభమైంది. గేట్ల నిపుణుడు కన్నయ్య నాయుడి పర్యవేక్షణలో తాత్కాలిక గేటును అమరుస్తున్నారు. రేపు సాయంత్రంలోగా పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. ఈ నెల 10న 19వ క్రస్ట్ గేట్ విరిగి కొట్టుకుపోయింది. కొత్త గేట్ ఏర్పాటు చేసేందుకు నీటిని దిగువకు వదలాల్సి రావడంతో ఆరు రోజుల్లో 45 టీఎంసీల నీటిని విడుదల చేశారు.
స్టార్ డైరెక్టర్లలో ఒకరిగా వెలుగొందిన పూరీ జగన్నాథ్‌ను కష్టకాలం వెంటాడుతోంది. డైలాగ్స్, స్క్రీన్ ప్లేతో మెస్మరైజ్ చేసే ఈ క్రేజీ డైరెక్టర్‌కు వరుస ఫ్లాపులు ఎదురవుతున్నాయి. ఆయన దర్శకత్వంలో వచ్చిన చివరి 8 చిత్రాల్లో ‘ఇస్మార్ట్ శంకర్’ మినహా మిగతావన్నీ ఫ్లాపయ్యాయి. తాజాగా ‘డబుల్ ఇస్మార్ట్’కు డివైడ్ టాక్ వస్తుండటంతో పూరీ మార్క్ టేకింగ్ మిస్సయిందని, ఇక వింటేజ్ పూరీని చూడలేమా? అని పోస్టులు చేస్తున్నారు.
ఏపీలో 16 మంది <<13850500>>IPSలకు<<>> రెగ్యులర్ పోస్టింగులు ఇవ్వకుండా వెయిటింగ్‌లో పెట్టడాన్ని TGకి చెందిన మాజీ ఐపీఎస్ RS ప్రవీణ్ తప్పుపట్టారు. ‘గత నెల ఇద్దరు డీజీపీ ర్యాంకు ఆఫీసర్లపై క్రిమినల్ కేసులు పెట్టారు. ఇప్పుడు ఈ 16 మంది IPSలను DGP ఆఫీసులో రోజూ వచ్చి సైన్ చేయాలంటున్నారు. ఆఫీసర్లను ఖాళీగా ఉంచే బదులు పోస్టింగ్ ఇస్తే ప్రజలకోసం పని చేస్తారు. అసలు ఏపీ పోలీస్ వ్యవస్థలో ఏం జరుగుతోంది?’ అని <
ఢిల్లీలోని ఎర్రకోటలో జరిగిన స్వాతంత్ర్య వేడుకలకు హాజరైన <<13857131>>రాహుల్<<>> గాంధీని కేంద్రం అవమానించిందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఆయనకు మొదటి వరుసలో కాకుండా వెనుక వరుసలో సీటును కేటాయించారని మండిపడుతున్నారు. అయితే, ఈసారి ఒలింపిక్ పతక విజేతలకు ముందు వరుసలో కూర్చునే అవకాశం ఇచ్చామని, అందుకే రాహుల్ వెనుక వరుసలో కూర్చున్నారని కేంద్రం వివరణ ఇచ్చింది.
బంగ్లాదేశ్‌లో జరగాల్సిన మహిళల టీ20 ప్రపంచకప్ టోర్నీకి ఆతిథ్యం ఇవ్వాలన్న ICC ప్రతిపాదనను తిరస్కరించానని BCCI కార్యదర్శి జైషా తెలిపారు. ‘భారత్‌లో అక్టోబర్లో వర్షాలు కురుస్తాయి. పైగా వచ్చే ఏడాది మహిళల వన్డే వరల్డ్ కప్‌నకు ఆతిథ్యం ఇవ్వాలి. అందుకే వరుసగా 2 మెగా టోర్నీలు నిర్వహించలేమని సంకేతాలు పంపించా’ అని ఆయన అన్నారు. బంగ్లాలో రాజకీయ అనిశ్చితి నెలకొనడంతో క్రికెటర్ల భద్రతపై ICC ఆందోళన చెందుతోంది.
SBI, PNBలో అన్ని ఖాతాలను మూసేయాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. డిపాజిట్లు వెనక్కి తీసుకోవాలని, ఇకపై లావాదేవీలు చేపట్టొదని ప్రభుత్వ శాఖలు, సంస్థలను ఆదేశించింది. KIADB చేసిన రూ.12 కోట్లు, KSPCBకి చెందిన రూ.10 కోట్ల డిపాజిట్ల అవినీతిలో తమ ఉద్యోగుల పాత్ర ఉందంటూ బ్యాంకులు డబ్బుల్ని వెనక్కి ఇవ్వలేదు. బ్యాంకు అధికారులతో చర్చలూ విఫలమవ్వడంతో విషయం న్యాయ పరిధిలోకి వెళ్లింది.
పంద్రాగస్టు రోజున ఒడిశా ప్రభుత్వం మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగినులకు ఒక రోజు నెలసరి సెలవు ప్రవేశపెడుతున్నట్లు ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం ప్రవతీ పరిదా ప్రకటించారు. ఇది తక్షణమే అమల్లోకి వస్తుందన్నారు. పీరియడ్స్‌లో తొలి రోజు లేదా రెండో రోజు సెలవు తీసుకునేలా దీనిని రూపొందించినట్లు తెలిపారు. మరోవైపు మహిళలకు నెలసరి సెలవులు ఇవ్వాలని దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే.
Sorry, no posts matched your criteria.