India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద తెలంగాణలోని అర్బన్ ప్రాంతాలకు 3 లక్షల ఇళ్లు కేటాయించాలని కేంద్ర క్యాబినెట్ నిర్ణయించిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. ఈ స్కీమ్ కింద గతంలో కేంద్రం 2.5లక్షల ఇళ్లు ఇస్తే బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకోలేదని తెలిపారు. ఇళ్ల కేటాయింపుపై రాష్ట్రం నుంచి ఇంకా ప్రతిపాదన రాలేదని, రాగానే మంజూరు చేయనున్నట్లు పేర్కొన్నారు.
ఒలింపిక్ పతక విజేత సరబ్‌జ్యోత్ సింగ్ ప్రభుత్వ ఉద్యోగాన్ని తిరస్కరించారు. తన స్వరాష్ట్రం హరియాణా క్రీడా శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఉద్యోగాన్ని ఆఫర్ చేసింది. కానీ సరబ్ ప్రభుత్వ వినతిని సున్నితంగా తిరస్కరించారు. ‘నేను షూటర్‌గానే కొనసాగాలనుకుంటున్నా. ఒలింపిక్ గోల్డ్ సాధించాలనే నా లక్ష్యం కోసం ఇప్పటికే తీసుకున్న నిర్ణయాలను మార్చుకోలేను. అందుకే ప్రస్తుతానికి ఈ జాబ్ చేయలేను’ అని ఆయన పేర్కొన్నారు.
ప్రస్తుతం ప్రతి వంద మందిలో ఇద్దరు 40 ఏళ్లు నిండకుండానే మగతనాన్ని కోల్పోతున్నారని నిపుణులు అంటున్నారు. వృత్తి, ఉద్యోగాల ఒత్తిడి, నిద్రలేమి, భోజనం వంటి సమస్యలతో టెస్టోస్టిరాన్ పనితీరు మందగించడమే దీనికి కారణం. వీటికి బీపీ, షుగర్ వంటి రోగాలు తోడవుతున్నాయి. మద్యపానం, ధూమపానం కూడా పురుషత్వానికి శత్రువులే. పురుషత్వం ప్రమాదంలో పడకూడదంటే జీవనశైలి మార్చుకోవాలి. సరిపడా నిద్ర, ధ్యానం, మంచి భోజనం తీసుకోవాలి.
AP: రాష్ట్రంలో ఈ నెల 15 నుంచి 30 వరకు రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ‘ప్రతి గ్రామంలో ఈ సదస్సులు జరుగుతాయి. భూ ఆక్రమణలు, 22ఏ భూముల అక్రమాలతోపాటు పలు రెవెన్యూ సమస్యలపై ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తాం. ఆ ఫిర్యాదులను విచారణ జరిపి ఆన్‌లైన్ చేసి పరిష్కరిస్తాం’ అని మంత్రి వివరించారు.
రెండు రోజుల కిందట నాగచైతన్య-శోభిత ఎంగేజ్‌మెంట్ అయింది. ఈ విషయాన్ని తొలుత చైతూ తండ్రి నాగార్జునే అధికారికంగా ప్రకటించారు. అయితే తాజాగా ఆయన తన ఫేస్‌బుక్ ప్రొఫైల్ డీపీ మార్చారు. ఎంగేజ్‌మెంట్‌లో చైతూ-శోభితతో పాటు అమల, అఖిల్‌తో కలిసి ఆయన దిగిన ఫొటోను నాగ్ డీపీగా పెట్టుకున్నారు. దీంతో ‘సూపర్ ఫ్యామిలీ’ అంటూ ఆయన ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
IPLలో ధోనీని CSK రిటెన్షన్ చేసుకునే అంశంపై ఆ టీమ్ మాజీ ప్లేయర్, ప్రస్తుత RR ఆటగాడు అశ్విన్ స్పందించారు. ‘ధోనీ అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా ఆడనున్నాడా అన్నది పెద్ద ప్రశ్న. అతడు కొన్నేళ్లుగా అంతర్జాతీయ మ్యాచ్ ఆడలేదు. కాబట్టి ధోనీని అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా పేర్కొనడం కరెక్టే. కానీ ధోనీ లాంటి ఆటగాడు అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా ఆడతాడా అన్నది మరో చర్చ’ అని తన యూట్యూట్ ఛానల్‌లో అశ్విన్ అభిప్రాయపడ్డారు.
పారిస్ ఒలింపిక్స్‌లో 4×400 మీ.రిలేలో అమెరికా దుమ్మురేపింది. పురుషులు, మహిళలు రెండు విభాగాల్లోనూ ఆ దేశం స్వర్ణ పతకాలు కొల్లగొట్టింది. పురుషుల టీమ్ 2:54.53 నిమిషాలు, మహిళల జట్టు 3:15.27 నిమిషాల్లో రన్నింగ్ ముగించాయి. మెన్స్ పోటీల్లో బోట్స్‌వానా వెండి, గ్రేట్ బ్రిటన్ కాంస్యంతో సరిపెట్టుకున్నాయి. అలాగే వుమెన్స్ కేటగిరీలో నెదర్సాండ్స్ వెండి, గ్రేట్ బ్రిటన్ కాంస్యం దక్కించుకున్నాయి.
పరువు హత్యలపై తమిళ నటుడు, దర్శకుడు రంజిత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘పరువు హత్య హింస కానే కాదు.. అది వారి పిల్లలపై తల్లిదండ్రులు చూపించే ప్రేమ. మన బైక్‌ను ఎంతో శ్రద్ధగా చూసుకుంటాం. దానికి ఏమైనా అయితే తట్టుకోలేం. అలాంటిది పిల్లల జీవితంపై ఎంత శ్రద్ధ పెడతాం. పిల్లలు దారి తప్పినప్పుడు తల్లిదండ్రులు కోపం చూపిస్తారు. అది హింస కాదు, పిల్లలపై ఉన్న శ్రద్ధ’ అని ఆయన వ్యాఖ్యానించారు.
సూపర్ స్టార్ మహేశ్ బాబు, కృష్ణవంశీ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘మురారి’ మూవీ రీరిలీజ్‌లో దుమ్మురేపుతోంది. థియేటర్ల వద్ద అభిమానులు హంగామా చేస్తున్నారు. ఈ క్రమంలో మురారి ప్రదర్శితమవుతోన్న ఓ థియేటర్‌లో ప్రేమికులు పెళ్లి చేసుకున్నారు. దీనిపై కృష్ణవంశీ ఘాటుగా స్పందించారు. ‘ఇది చాలా చెత్త నిర్ణయం. మన సంస్కృతి, సంప్రదాయాలను అవమానించడమే. దయచేసి ఇలాంటివి మళ్లీ రిపీట్ చేయొద్దు’ అని ఆయన ట్వీట్ చేశారు.
భారత్ తరఫున మూడు ఫార్మాట్లలో ఆడాలని ఉందని టీమ్ ఇండియా T20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తన మనసులో మాట బయటపెట్టారు. టెస్టుల్లో ఆడేందుకు బుచ్చిబాబు టోర్నమెంట్ పనికొస్తుందని ఆయన చెప్పారు. కాగా T20ల్లో ఆకాశమే హద్దుగా చెలరేగుతున్న సూర్య వన్డేల్లో మాత్రం తేలిపోతున్నారు. పేలవ ఆటతీరుతో నిరాశపరుస్తున్నారు. వన్డేలతోపాటు టెస్టులకూ ఆయనను సెలక్టర్లు పరిగణనలోకి తీసుకోవటం లేదు. SKY ఇప్పటివరకు ఒకే ఒక్క టెస్టు ఆడారు.
Sorry, no posts matched your criteria.