News March 27, 2024

నిరుద్యోగుల్లో 83% యువత: ILO

image

భారత్‌లోని నిరుద్యోగానికి సంబంధించి ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్(ILO) షాకింగ్ విషయాలు వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం.. దేశంలోని నిరుద్యోగుల్లో 83% యువతే ఉంది. టెన్త్ చదివిన నిరుద్యోగుల సంఖ్య భారీగా పెరిగింది. 2000లో 35.2%గా ఉండగా.. 2022లో 65.7%కి చేరింది. అంటే 12ఏళ్లలో నిరుద్యోగితశాతం రెట్టింపు అయ్యింది. SSC తర్వాత ఇక డ్రాపౌట్స్ రేటు కూడా భారీగా ఉంది. మరోవైపు యువతలో నిరుద్యోగం పెరుగుతోంది.

News March 27, 2024

సీయూఈటీ(UG) దరఖాస్తు గడువు పొడిగింపు

image

CUET(UG)-2024 ప్రవేశ పరీక్షకు దరఖాస్తుల గడువును నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) పొడిగించింది. నిన్నటితో గడువు ముగియగా ఈ నెల 31 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని పేర్కొంది. తప్పుల సవరణకు ఏప్రిల్ 3 వరకు అవకాశం కల్పించింది. మే 15 నుంచి 31 మధ్యలో పరీక్షలు నిర్వహించనుంది. పూర్తి వివరాలకు https://exams.nta.ac.in/CUET-UG/ వెబ్‌సైట్‌‌ను సంప్రదించండి.

News March 27, 2024

దమ్ముంటే లోకేశ్, బాబు నాపై పోటీ చేయాలి: కొడాలి నాని

image

AP: టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేశ్‌కు దమ్ముంటే తనపై గుడివాడలో పోటీ చేయాలని మాజీ మంత్రి కొడాలి నాని సవాల్ విసిరారు. ‘నాకు భయపడి గంటకో వ్యక్తిని పోటీకి దింపుతున్నారు. ఇప్పుడు అమెరికా నుంచి వచ్చిన వ్యక్తిని పోటీకి పెట్టారు. ఈసారి అంతరిక్షం నుంచి తీసుకొస్తారేమో? చంద్రబాబు తలకిందులుగా తపస్సు చేసినా నన్ను ఓడించలేరు. ఎంతమంది వచ్చినా గుడివాడలో ఐదోసారి గెలవబోతున్నా’ అని ఆయన తెలిపారు.

News March 27, 2024

కన్నీళ్లు పెట్టించే ఘటన

image

TG: నారాయణపేట జిల్లా గోపాల్‌పేటలో హృదయవిదారక ఘటన జరిగింది. స్థానికుడు రమేశ్ కూతురు లక్ష్మీప్రణీత(13) హోలీరోజు మినీ వాటర్ ట్యాంకు కూలి మరణించింది. అంత్యక్రియల అనంతరం ఇంటికి వచ్చిన రమేశ్ స్నానం చేసి బయటికి వెళ్లాడు. రాత్రయినా ఇంటికి రాకపోవడంతో కుటుంబీకులు వెతుక్కుంటూ వెళ్లారు. రమేశ్ తన కూతురిని పూడ్చిపెట్టిన స్థలం పక్కనే నిద్రిస్తూ కనిపించాడు. ఈ ఘటన చూసి అక్కడున్నవాళ్లు కన్నీళ్లు పెట్టుకున్నారు.

News March 27, 2024

ఏప్రిల్ 13న BRS భారీ బహిరంగ సభ

image

TG: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఏప్రిల్ 13న చేవెళ్లలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. మాజీ సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో జరిగే ఈ సభకు పెద్ద సంఖ్యలో ప్రజలను తరలించి విజయవంతం చేయాలని ఆయన పార్టీ నేతలను ఆదేశించారు. కాగా చేవెళ్ల బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి ఇటీవల కాంగ్రెస్‌లో చేరడంతో ఆ పార్టీ నుంచి కాసాని జ్ఞానేశ్వర్‌ బరిలో నిలిచారు.

News March 27, 2024

సాంకేతిక లోపంతో నిలిచిన మెట్రో

image

TG: హైదరాబాద్ మెట్రో రైళ్లు కాసేపు నిలిచిపోయాయి. సాంకేతిక లోపంతో జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ మెట్రో స్టేషన్లో ఆగాయి. దీంతో 15 నిమిషాల పాటు ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. సమాచారం అందుకొని రంగంలోకి దిగిన టెక్నికల్ సిబ్బంది సమస్యను పరిష్కరించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News March 27, 2024

భారీగా స్కాలర్షిప్స్‌ పెండింగ్.. RTIలో వెల్లడి!

image

TG: ఇంటర్, డిగ్రీ విద్యార్థులు స్కాలర్షిప్స్ అందక ఇబ్బందులు పడుతున్నారు. ఈక్రమంలో బీసీ సంక్షేమ శాఖ ద్వారా 2020 నుంచి నిలిచిపోయిన స్కాలర్షిప్స్ వివరాలు తెలపాలని ఓ RTI కార్యకర్త కోరారు. దీనిపై సంబంధిత శాఖ స్పందించింది. వివిధ కారణాలతో భారీ సంఖ్యలో దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్లు వెల్లడించింది. 2020-21లో రూ. 96 లక్షలు, 2021-22లో రూ.1.9కోట్లు, 2022-23లో రూ.17.52 కోట్లు చెల్లించాల్సి ఉందని తెలిపింది.

News March 27, 2024

మళ్లీ కెప్టెన్‌గా బాబర్!

image

పాకిస్థాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజం మళ్లీ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. జూన్‌లో జరగనున్న T20WCకు అతడి నాయకత్వంలోనే పాక్ బరిలోకి దిగనున్నట్లు వార్తలొస్తున్నాయి. వన్డే వరల్డ్ కప్-2023లో పాక్ పేలవ ప్రదర్శనకు బాధ్యత వహిస్తూ గతేడాది NOV 15న బాబర్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. తాజా పరిణామాలతో బాబర్‌కే కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాలని PCB నిర్ణయించుకున్నట్లు సమాచారం.

News March 27, 2024

పాపులేషన్ ఎఫెక్ట్.. బేబీ డైపర్స్ ఉత్పత్తిని ఆపేసిన జపాన్ సంస్థ

image

జపాన్‌లో జనాభా రేటు ఆందోళనకర స్థాయిలో పడిపోతుందనడానికి ఓ డైపర్ల కంపెనీ పరిస్థితి ఉదాహరణగా నిలుస్తోంది. డిమాండ్ తగ్గడంతో ఇకపై పిల్లల డైపర్ల తయారీని నిలిపివేస్తున్నామని ఆ స్థానంలో అడల్ట్ డైపర్ల ఉత్పత్తి పెంచనున్నట్లు ఓజీ హోల్డింగ్స్ సంస్థ ప్రకటించింది. గత పదేళ్లలో అడల్ట్ డైపర్లకు డిమాండ్ పెరగడం గమనార్హం. కాగా ప్రస్తుతం 125 మిలియన్లుగా ఉన్న జపాన్ జనాభా 2065కి 88 మిలియన్లకు క్షీణిస్తుందని అంచనా.

News March 27, 2024

‘వివేకం’ సినిమాపై ఈసీ కీలక ఆదేశాలు

image

AP: రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారిన ‘వివేకం’ సినిమా ప్రదర్శనపై ఈసీ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ మూవీ స్ట్రీమింగ్ కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. కాగా ఈ మూవీ హింసను ప్రేరేపించేదిగా, ప్రజలను రెచ్చగొట్టేదిగా ఉందని ఈసీకి వైసీపీ ఫిర్యాదు చేసింది. దీంతో ఈసీ చర్యలకు దిగింది.