India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

పరీక్షల విధానంపై కేంద్ర విద్యాశాఖ CBSE కీలక సూచనలు చేసినట్లు తెలుస్తోంది. 2025-26 విద్యా సంవత్సరం నుంచి ఏడాదికి రెండు సార్లు పరీక్షలు నిర్వహించేలా ప్రణాళికలు రచించాలని ఆదేశించిందట. అయితే సెమిస్టర్ విధానంలో పరీక్షలను నిర్వహించాలనే ప్రతిపాదనను కేంద్రం తోసిపుచ్చినట్లు సమాచారం. విద్యార్థులు పరీక్షల్లో రాణించేందుకు ఈ విధానాన్ని తేవాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది.

TG: దేశాన్ని కార్పొరేట్ వ్యాపారుల చేతిలో పెట్టాలని PM మోదీ ప్రయత్నిస్తున్నారని CM రేవంత్ రెడ్డి ఆరోపించారు. ‘కాంగ్రెస్ హైదరాబాద్‌లో ECIL, BHEL, DRDO వంటి సంస్థలను తీసుకొచ్చింది. ఈ పదేళ్లలో HYDకు మోదీ ఒక్క పరిశ్రమైనా ఇచ్చారా? కాంగ్రెస్ ఇచ్చిన సంస్థలను అంబానీ, అదానీలకు మోదీ అమ్ముతున్నారు’ అని మండిపడ్డారు. ఇక రిజర్వేషన్లు పోవాలనుకుంటే BJPకి, ఉండాలంటే కాంగ్రెస్‌కు ఓటెయ్యాలని రేవంత్ సూచించారు.

TG: దేశాన్ని నాశనం చేసిన ప్రధాని మోదీ విశ్వగురువా? అని మాజీ సీఎం కేసీఆర్ ఎద్దేవా చేశారు. ‘దేశంలో 157 మెడికల్ కాలేజీలు పెడితే రాష్ట్రానికి ఒక్కటి కూడా ఇవ్వలేదు. ఒక్క స్కూల్ కూడా ఇవ్వని బీజేపీకి ఒక్క ఓటు కూడా వేయొద్దు. అచ్చే దిన్ కాదు.. సచ్చే దిన్ వచ్చింది. చోటే భాయ్‌కు ఓటేసినా.. బడే భాయ్‌కు ఓటేసినా ఒకటే. బీజేపీ, కాంగ్రెస్ ఏకమై రాష్ట్రాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు’ అని ఆయన మండిపడ్డారు.

ఈత సరదా తెలుగు రాష్ట్రాల్లోని పలు కుటుంబాల్లో విషాదం నింపింది. ఏపీలోని ఏలూరు జిల్లా జల్లేరు వాగులో ఈతకు వెళ్లి ముగ్గురు మరణించారు. ఇందులో రేష్మ(24) అనే యువతి కూడా ఉంది. ఆమెతో పాటు మొహిషాన్(23), హసద్(14) వాగులో మునిగి చనిపోయారు. అటు తెలంగాణలోనూ యాదాద్రి జిల్లా చాడ గ్రామంలో చెరువులో మునిగి తండ్రీకుమారుడు ప్రాణాలు కోల్పోయారు. వారిని రాయిపల్లి గ్రామానికి చెందిన నరేశ్(33), సాయి(13)గా గుర్తించారు.

AP: వైసీపీ నేత డొక్కా మాణిక్య వరప్రసాద్ టీడీపీలో చేరారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు సమక్షంలో ఆయన ఆ పార్టీ కండువా కప్పుకున్నారు. కాగా ఈరోజు ఉదయం వైసీపీకి డొక్కా రాజీనామా చేశారు. ఆ పార్టీ తరఫున తాడికొండ సీటు ఆశించారు. కానీ ఆ స్థానాన్ని మేకతోటి సుచరితకు కేటాయించడంతో ఆయన అసంతృప్తితో వైసీపీని వీడారు.

ప్రముఖ తమిళ నిర్మాత జ్ఞాన్‌వేల్ రాజా, ఆయన భార్య నేహాపై కేసు నమోదైంది. ఇటీవల జ్ఞాన్‌వేల్ ఇంట్లో నగలు మాయమయ్యాయి. వాటిని పనిమనిషి లక్ష్మీ తీసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ పోలీసుల విచారణతో మనస్తాపానికి గురైన లక్ష్మీ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. దీంతో పనిమనిషి కుమార్తె జ్ఞాన్‌వేల్ రాజా, నేహాపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన తల్లిని చిత్రహింసలకు గురి చేశారంటూ ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఈ సీజన్‌లో ఇప్పటివరకు 41 మ్యాచ్‌లు జరగ్గా పంజాబ్ కింగ్స్ ఏ జట్టునూ 200 పరుగులు చేయనీయలేదు. బెంగళూరుకు ఇచ్చిన 199 పరుగులే అత్యధికం. మిగతా 9 జట్లూ ప్రత్యర్థులకు 200పైగా స్కోర్లు ఇచ్చుకున్నాయి. పంజాబ్ బౌలింగ్ యావరేజ్ 24.94గా ఉంది. ఆ జట్టు తర్వాత కేకేఆర్‌కు మాత్రమే మెరుగైన బౌలింగ్ యావరేజ్ ఉంది. కాగా పంజాబ్ ఇప్పటివరకు టోర్నీలో 8 మ్యాచ్‌లు ఆడి రెండింట్లోనే గెలిచింది.

ఢిల్లీ హైకోర్టులో ఐటీ నిబంధనలపై విచారణ సందర్భంగా వాట్సాప్ కీలక వ్యాఖ్యలు చేసింది. ‘ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఉండటంతోనే యూజర్లు తమ సమాచారం సేఫ్‌గా ఉందనే ధీమాతో వాట్సాప్ వాడుతున్నారు. ఒకవేళ మమ్మల్ని కేంద్రం ఈ ఎన్‌క్రిప్షన్ తొలగించమంటే ఇండియాలో మా సేవలను రద్దు చేసుకుంటాం. 2021లో తెచ్చిన ఈ కొత్త రూల్స్ ప్రకారం లక్షల మెసేజ్‌లను ఏళ్ల తరబడి స్టోర్ చేయాలి. ఈ రూల్ ప్రపంచంలో ఎక్కడా లేదు’ అని పేర్కొంది.

TG: మంత్రి కొండా సురేఖకు కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. ఇటీవల కేటీఆర్‌పై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆమెపై బీఆర్ఎస్ ఈసీకి ఫిర్యాదు చేసింది. దీంతో ఈసీ ఆమెకు నోటీసులు ఇచ్చింది. ఎన్నికల వేళ జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించింది. స్టార్ క్యాంపెయినర్‌గా, మంత్రిగా మరింత బాధ్యతాయుతంగా ఉండాలని పేర్కొంది.

AP: YCP అభ్యర్థులు కొడాలి నాని, బుగ్గన రాజేంద్రనాథ్ నామినేషన్లకు ఎట్టకేలకు ఆమోదం లభించింది. నామినేషన్ పత్రాల్లో నాని తప్పుడు సమాచారం ఇచ్చారని ఆర్వోకు TDP ఫిర్యాదు చేసింది. సాయంత్రం వరకు ఉత్కంఠ నెలకొంది. చివరికి నామినేషన్‌ను ఆమోదించినట్లు ఆర్వో ప్రకటించారు. బుగ్గన తన ఆస్తులను పూర్తిగా వెల్లడించలేదని TDP అభ్యర్థి అభ్యంతరం తెలిపారు. ఆయన నామినేషన్‌ను పెండింగ్‌లో పెట్టిన ఆర్వో.. తర్వాత ఆమోదించారు.
Sorry, no posts matched your criteria.