news

News May 16, 2024

చంద్రగిరి అల్లర్లు.. పోలీసుల అదుపులో 30 మంది!

image

AP: చంద్రగిరి అల్లర్ల కేసులో 30 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని ఫిర్యాదుతో హత్యాయత్నంతో పాటు పలు కేసులు నమోదు చేశారు. ఇటు రామిరెడ్డి పల్లి, కూచివారిపల్లెలో పోలీసుల బందోబస్తు కొనసాగుతోంది. కాగా మంగళవారం తిరుపతి పద్మావతి యూనివర్సిటీలో స్ట్రాంగ్ రూమ్ పరిశీలనకు టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని వెళ్లగా.. అక్కడ ఆయనపై పలువురు దాడి చేశారు.

News May 16, 2024

తిరుమల ఘాట్ రోడ్డులో చిరుత ప్రత్యక్షం

image

AP: తిరుమల ఘాట్ రోడ్డులో మళ్లీ చిరుతపులి కనిపించడంతో యాత్రికులు ఆందోళనలో పడ్డారు. తిరుపతి నుంచి తిరుమలకు కారులో వెళ్తున్న భక్తులకు చిరుతపులి సంచరిస్తూ కనిపించింది. శేషాచలం అడవుల్లో చిరుతలు కనిపించడం సాధారణమైనప్పటికీ పాదచారుల మార్గం, ఘాట్ రోడ్లలో వెళ్లే భక్తులు అప్రమత్తంగా ఉండాలని టీటీడీ హెచ్చరించింది. గతేడాది ఆగస్టులో ఆరేళ్ల బాలికపై చిరుతపులి దాడి చేసిన విషయం తెలిసిందే.

News May 16, 2024

కలవరం.. తగ్గిపోతున్న సంతానోత్పత్తి

image

ప్రపంచవ్యాప్తంగా సంతానోత్పత్తి రేటు 2021 నాటికి 2.4కి పడిపోయినట్లు పలు నివేదికలు పేర్కొన్నాయి. 1960లో ప్రపంచంలో సంతానోత్పత్తి రేటు 5గా ఉంది. భారత్‌లో 1950లో ఈ రేటు 6.18గా ఉంటే 2021 నాటికి 2కంటే తక్కువకు పడిపోయింది. మారిన వాతావరణ పరిస్థితులు, ఆహారపు అలవాట్లు, ఆలస్యంగా పెళ్లి, ఒత్తిడి వంటివి ఇందుకు కారణాలు. ఇదిలాగే కొనసాగితే ఉత్పాదక శక్తిపై ప్రభావం పడి దేశాల ఆర్థిక వ్యవస్థలు ఛిన్నాభిన్నమవుతాయి.

News May 16, 2024

పెళ్లి కానుకలపై కోర్టు కీలక వ్యాఖ్యలు

image

పెళ్లిలో స్వీకరించే కానుకలకు సంబంధించి వధువు, వరుడు లిస్టు మెయింటైన్ చేయాలని అలహాబాద్ హైకోర్టు వ్యాఖ్యానించింది. తద్వారా వరకట్న ఆరోపణలు ఉండవని అభిప్రాయపడింది. వరకట్న నిరోధక చట్టం 1961 సెక్షన్ 3(2) ఇదే చెబుతోందని పేర్కొంది. ఈ చట్టం ప్రకారం వరకట్నం ఇచ్చినా లేక తీసుకున్నా 5ఏళ్ల జైలుతో పాటు ₹15 వేల జరిమానా లేదా కట్నం విలువకు సమాన మొత్తం చెల్లింపు.. ఏది ఎక్కువైతే అది అని తెలిపింది.

News May 16, 2024

చివరి నిమిషంలో ఫ్లైట్ టికెట్స్ రద్దు చేస్తున్న ప్రజ్వల్

image

కర్ణాటక MP ప్రజ్వల్ నిన్న బెంగళూరు వచ్చేందుకు టికెట్ బుక్ చేసుకుని చివరి క్షణంలో రద్దు చేసుకున్నారు. లైంగిక వేధింపుల కేసులో నిందితుడిగా ఉన్న ప్రజ్వల్ విదేశాలకు పారిపోయారు. ఆయన తండ్రి రేవణ్ణకు బెయిల్ రావడంతో ప్రజ్వల్ తిరిగి బెంగళూరు వస్తారని సిట్ అధికారులు భావించారు. బుధవారం విమానాశ్రయం వద్ద వారు కాపు కాయగా ఆయన టికెట్ రద్దు చేసుకున్నట్లు గుర్తించారు. ఇలా ఆయన 4సార్లు ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నారు.

News May 16, 2024

ఏపీలో డీబీటీ పథకాల నిధులు విడుదల

image

APలో డీబీటీ పథకాలకు ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. జగనన్న విద్యాదీవెన (ఫీజు రీయింబర్స్‌మెంట్) కింద రూ.502 కోట్లు, డ్వాక్రా మహిళలకు సంబంధించి ఆసరాకు రూ.1,480 కోట్లు రిలీజ్ చేసింది. రెండు, మూడు రోజుల్లో మిగతా డీబీటీ పథకాల నిధుల విడుదల ప్రక్రియ పూర్తి చేయనున్నట్లు సమాచారం. కాగా, ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత నిధులు విడుదల చేసేందుకు ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో నేడు ప్రభుత్వం ఫండ్స్ రిలీజ్ చేసింది.

News May 16, 2024

పర్పుల్ పటేల్ మళ్లీ.. టాప్5లో అంతా మనోళ్లే..

image

2021లో 32 వికెట్లు తీసిన పర్పుల్ పటేల్‌గా పేరు తెచ్చుకున్న హర్షల్ పటేల్ మళ్లీ బౌలింగ్‌లో టాప్-1లోకి వచ్చారు. 13 మ్యాచుల్లో 22 వికెట్లు తీసిన ఈ పంజాబ్ కింగ్ పర్పుల్ క్యాప్ సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత ముంబై ఇండియన్స్ స్పీడ్ గన్ జస్ప్రీత్ బుమ్రా (20 వికెట్లు), KKR మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి(18), RR లెగ్ స్పిన్నర్ చాహల్(17), ఢిల్లీ పేసర్ ఖలీల్ అహ్మద్(17) టాప్5లో ఉన్నారు.

News May 16, 2024

ఒక్క షోకి ₹5వేల నష్టం: థియేటర్ల యాజమాన్యాలు

image

TG: పెద్ద సినిమాలు లేకపోవడం, ఎన్నికలు, IPL వల్ల థియేటర్లకు జనాలు వెళ్లడం లేదు. దీంతో రేపటి నుంచి సింగిల్ స్క్రీన్ థియేటర్లను 10 రోజులపాటు మూసివేయాలని యాజమాన్యాలు నిర్ణయించాయి. ఒక్క షోను రన్ చేయడానికి ₹15వేల వరకు ఖర్చవుతోందని, టికెట్ల ద్వారా ₹10వేలు కూడా రాకపోవడంతో ₹5వేల నష్టం వస్తోందని చెబుతున్నాయి. సిబ్బందికి జీతాలు, షోలకు అయ్యే ఖర్చులో సగం కూడా కలెక్షన్ల ద్వారా రావట్లేదని పేర్కొంటున్నాయి.

News May 16, 2024

బీజేపీ అభ్యర్థులకు పోటీ ఉండకూడదా?: ధ్రువ్ రాఠీ

image

ప్రధాని మోదీకి పోటీగా వారణాసిలో కమెడియన్ శ్యామ్ రంగీలా వేసిన నామినేషన్‌ను తిరస్కరించడంపై ప్రముఖ యూట్యూబర్ ధ్రువ్ రాఠీ మండిపడ్డారు. గాంధీనగర్‌లోనూ అమిత్ షాపై పోటీ చేయకుండా అభ్యర్థులను బెదిరించారని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్‌ను తిరస్కరించి, మరో 8 మందిని ఉపసంహరించుకునేలా చేసి సూరత్ స్థానంలో బీజేపీ ఏకగ్రీవమయ్యేలా చేశారంటూ విమర్శించారు. ఇదేనా ప్రజాస్వామ్యం అంటూ ట్వీట్ చేశారు.

News May 16, 2024

SRHకు గోల్డెన్ ఛాన్స్!

image

ఇవాళ గుజరాత్‌తో జరిగే మ్యాచ్‌లో SRH గెలుపొందితే 16 పాయింట్లతో ప్లేఆఫ్స్‌కు చేరనుంది. దీంతో పాటు 19న PBKSతో మ్యాచ్‌లోనూ SRH గెలుపొందితే పాయింట్స్ టేబుల్‌లో రెండో స్థానానికి చేరుతుంది. ఇది జరిగితే పాయింట్స్ టేబుల్‌లో మొదటి స్థానంలో ఉన్న కోల్‌కతా నైట్ రైడర్స్‌తో కమిన్స్ సేన క్వాలిఫయర్-1 మ్యాచ్ ఆడనుంది. అందులో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు చేరుతుంది. ఓడినా ఫైనల్ చేరేందుకు మరో ఛాన్స్ ఉంటుంది.