India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: తమ ప్రభుత్వం మహిళల భద్రతకు పెద్దపీట వేస్తోందని మంత్రి సీతక్క అన్నారు. మహిళలపై అఘాయిత్యాలు జరిగిన వెంటనే తాము వాయువేగంతో స్పందిస్తున్నామని చెప్పారు. రాజకీయ లబ్ధి కోసం కేటీఆర్ అవాస్తవాలు చెబుతున్నారని ఆమె విమర్శించారు. BRS హయాంలో మహిళలపై దాడులు జరిగితే బయటికి రాకుండా తొక్కిపెట్టారని మంత్రి ఆరోపించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఆమె ఇలా స్పందించారు.
IPL-2025 కోసం లక్నో సూపర్ జెయింట్స్ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. టీమ్ మెంటార్ రోల్ కోసం జహీర్ ఖాన్‌తో చర్చిస్తున్నట్లు క్రిక్‌బజ్ వెల్లడించింది. అతను మేనేజ్‌మెంట్-ఆటగాళ్ల మధ్య ఫ్రెండ్లీ వాతావరణాన్ని ఉంచడంతోపాటు బౌలర్లకు మంచి శిక్షణ ఇవ్వగలరని LSG భావిస్తున్నట్లు తెలిపింది. కాగా గతంలో LSG మెంటార్‌గా ఉన్న గంభీర్, బౌలింగ్ కోచ్ మోర్కెల్ ఇప్పుడు టీమ్ ఇండియా కోచింగ్ బృందంలో చేరిన విషయం తెలిసిందే.
డైరెక్టర్ హను రాఘవపూడి- హీరో ప్రభాస్ కాంబోలో తెరకెక్కనున్న సినిమాలో హీరోయిన్‌గా ఇమాన్వీని ఎంపిక చేయడంతో అంతా సర్‌ప్రైజ్ అయ్యారు. అనుభవం లేకున్నా ప్రభాస్ అంతటి స్టార్‌కు జోడీగా ఎంపిక చేసుకోవడానికి ఆమె ఎక్స్‌ప్రెసివ్ ఫేస్ కారణం. సోషల్ మీడియాలో ఆమె ఎక్స్‌ప్రెషన్స్, డాన్స్ చూసి సర్‌ప్రైజైన డైరెక్టర్ ఈ సినిమాకు ఎంపిక చేశారు. ఆమెను సంప్రదించగా వెంటనే ఓకే చెప్పారు.
ప్రాణాపాయంలో ఉన్న సోదరికి కిడ్నీని దానం చేసి ఈ రాఖీ పండుగను స్పెషల్‌గా మార్చాడు ఓ వ్యక్తి. గోవాలో ఓ మహిళ(43) పాలిసిస్టిక్ కిడ్నీ వ్యాధితో బాధపడేది. కచ్చితంగా కిడ్నీ మార్చాలని వైద్యులు చెప్పారు. సోదరుడూ కిడ్నీలో రాళ్లతో ఇబ్బంది పడుతున్నారు. అయినప్పటికీ తొలుత తాను చికిత్స తీసుకుని, మరో కిడ్నీని అక్కకు దానం చేశారు. సదరు మహిళ ఇవాళ సోదరుడికి రాఖీ కడుతూ భావోద్వేగానికి గురయ్యారని ఆమె భర్త వెల్లడించారు.
వినేశ్ ఫొగాట్‌కు పలు ఆర్గనైజేషన్లు రూ.16 కోట్ల నగదు బహుమతి ఇచ్చాయంటూ జరుగుతున్న ప్రచారాన్ని భర్త సోమ్‌వీర్ ఖండించారు. ‘వ్యాపారవేత్తలు, కంపెనీలు, పార్టీలు, ఆర్గనైజేషన్ల నుంచి వినేశ్ డబ్బు తీసుకోలేదు. మా మంచిని కోరుకునేవారు ఇలాంటి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయొద్దు. దీనివల్ల మేమే కాదు సామాజిక విలువలూ దెబ్బతింటాయి. ఇదంతా చీప్ పబ్లిసిటీ కోసం కొందరు చేస్తున్న ప్రయత్నం’ అని ట్వీట్ చేశారు.
కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరారు. న్యుమోనియాతో బాధపడుతూ సోమవారం ఆయన ఆస్పత్రిలో చేరినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.
ప్రపంచ వ్యాప్తంగా ఎంపాక్స్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలోని ఎయిర్‌పోర్టుల్లో అలర్ట్‌గా ఉండాలని అధికారులకు కేంద్రం సూచించింది. ఒంటిపై దద్దుర్లతో ఆసుపత్రుల్లో చేరేవారిని పరీక్షించి, అనుమానితులకు RT-PCR టెస్టులు నిర్వహించాలని ఆదేశించింది. ఇటు TGలో నివారణ, చికిత్సకు అవసరమైన చర్యలు చేపట్టాలని మంత్రి దామోదర అధికారులకు సూచించారు. గాంధీ, ఫీవర్ ఆసుపత్రుల్లో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేయాలన్నారు.
ముడా కేసులో సీఎం సిద్దరామయ్యపై ఇచ్చిన ఆదేశాలను గరవ్నర్ వెనక్కి తీసుకోకపోతే, లేదా రాష్ట్రపతి ఆయన్ని ఉపసంహరించుకొనేలా చెయ్యకపోతే ఆయనకు బంగ్లాదేశ్ తరహా గతిపడుతుందని కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఇవాన్ డిసౌజా హెచ్చరించారు. బంగ్లాలో ప్రధాని దేశం విడిచిపారిపోయినట్టే గవర్నర్ థావర్ చంద్ గహ్లోత్ కర్ణాటక వదిలి పారిపోవాల్సి వస్తుందని డిసౌజా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ జియో సినిమా మరో ప్లాట్‌ఫామ్ డిస్నీ+ హాట్‌స్టార్‌లో విలీనం కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. స్టార్ ఇండియా, వయాకామ్18 విలీనం తర్వాత రిలయన్స్ ఇండస్ట్రీస్ తన జియో సినిమాను హాట్‌స్టార్‌తో కలపనున్నట్లు సమాచారం. తద్వారా యూట్యూబ్, నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియోకు బలమైన పోటీ ఇచ్చే అవకాశం ఉంటుంది. కాగా స్టార్-వయాకామ్18 ఒప్పందం విలువ రూ.70వేల కోట్లు అని తెలుస్తోంది.
TG: ప్రతి లోక్‌సభ నియోజకవర్గంలో ఒక స్పోర్ట్స్ స్కూల్ నిర్మించాలని CM రేవంత్ నిర్ణయించారు. విద్యార్థుల్లో క్రీడానైపుణ్యాలను గుర్తించి, ప్రోత్సహించాలని అధికారులకు సూచించారు. ఫోర్త్ సిటీలో నిర్మించతలపెట్టిన స్పోర్ట్స్ వర్సిటీకి యంగ్ ఇండియా పేరు పెట్టాలని ఆదేశించారు. క్రీడా శిక్షణ సంస్థలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తేవాలన్నారు. భవిష్యత్తులో ఒలింపిక్స్‌కు HYD వేదికగా నిలిచేలా తీర్చిదిద్దాలన్నారు.
Sorry, no posts matched your criteria.