India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జులాయిగా తిరిగే లంకల రత్న(విశ్వక్ సేన్) MLAగా గెలిచి టైగర్ రత్నాకర్‌గా మారడమే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కథ. ఈ ప్రయాణంలో అతను ఎదుర్కునే సవాళ్లు, నేహా శెట్టితో ప్రేమ, రత్నమాల(అంజలి)తో ఉన్న సంబంధాన్ని సినిమాలో చూపించారు. విశ్వక్, అంజలి నటన, BGM, ఇంటర్వెల్ సీన్, ఫైట్స్, సెకండాఫ్ సినిమాకు ప్లస్. స్లో ఫస్ట్ ఆఫ్, కొత్తదనం లేని కథనం, పాత్రల మధ్య బలమైన సంఘర్షణ లేకపోవడం, బోరింగ్ సీన్స్ మైనస్.
రేటింగ్ 2.25/5
మే 31న పొగాకు నిరోధక దినోత్సవాన్ని WHO నిర్వహిస్తోంది. ఈ ఏడాది ‘పొగాకు నుంచి పిల్లలను రక్షించడం’ థీమ్‌తో అవగాహన కార్యక్రమాలు చేపడుతోంది. సర్వేల్లో 13-15 ఏళ్ల పిల్లల్లో నికోటిన్ ఉత్పత్తుల వినియోగం పెరగడం ఆందోళన కలిగిస్తోంది. దీనికి వ్యసనపరులుగా మారకముందే వారితో మాన్పించాలని నిపుణులు సూచిస్తున్నారు. లేకపోతే శ్వాసకోశ వ్యాధులు, గుండెపోటు, క్యాన్సర్, మానసిక ఆరోగ్య సమస్యలొస్తాయని హెచ్చరిస్తున్నారు.
అరేబియా సముద్రంలో పడమర గాలులు మరింత బలపడితే 3-4 రోజుల్లో ఏపీలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. అటు జూన్ 10లోగా తెలంగాణకు చేరుకుంటాయని తెలిపారు. రుతుపవనాల వల్ల ఈ ఏడాది సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదు అవుతుందని వాతావరణశాఖ ఇప్పటికే తెలిపింది. ముఖ్యంగా ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో ఎక్కువ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
T20WCలో ఫేవరెట్ జట్టు ఏదో చెప్పేందుకు కష్టమని, కానీ అందులో భారత్ ఉంటుందని ఆసీస్ మాజీ కెప్టెన్ మైకెల్ క్లార్క్ అభిప్రాయపడ్డారు. WC నెగ్గాలనుకునే జట్లకు టీమ్ ఇండియానే పెద్ద ముప్పు అని తెలిపారు. ‘భారత్ స్పిన్‌నే ఎక్కువగా నమ్ముకుంది. ఇది రిస్క్‌తో కూడుకున్నదే. అయితే ఆ జట్టు పొట్టి ఫార్మాట్‌లో చాలా క్రికెట్ ఆడింది. మిగతా టీమ్స్‌తో పోలిస్తే సన్నద్ధత కూడా బాగుంది’ అని చెప్పారు.
కుక్కలు, పిల్లుల శరీరంలో 180 రెట్లు(సైజ్) పారాసైట్ పురుగులు ఎక్కువగా పెరుగుతున్నట్లు ఓ పరిశోధనలో వెల్లడైంది. వీటి మైక్రోస్కోపిక్ చిత్రాలు భయంకరంగా ఉన్నాయి. పెట్స్‌కు నిత్యం డివార్మ్ ఔషధాలు ఇవ్వాలట. లేదంటే పేగుల్లో 16 అడుగుల వరకు పరాన్నజీవులు పెరుగుతాయని, అతిసారం, బరువు తగ్గడం లాంటి సమస్యలు వస్తాయని సైంటిస్టులు తెలిపారు. ఇవి మనుషుల్లోనూ చేరుతాయని, పిల్లల కంటి చూపునకు హాని కలిగిస్తాయని చెప్పారు.
AP: సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు రాష్ట్ర ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. ఆయనను ప్రింటింగ్, స్టేషనరీ అండ్ స్టోర్స్ పర్చేజ్ కమిషనర్‌గా నియమించింది. కాసేపట్లో ఆయన బాధ్యతలు స్వీకరించబోతున్నారు. కాగా ఈ సాయంత్రం ఏబీవీ ఉద్యోగ విరమణ చేయనున్నారు.
ఏక్తా యాత్ర సందర్భంగా 1991లో కన్యాకుమారిలోని ఐకానిక్ ‘వివేకానంద రాక్ మెమోరియల్’ వద్ద ప్రధాని మోదీ తీసుకున్న ఫొటో తాజాగా వైరలవుతోంది. బీజేపీ నాయకుడు మురళీ మనోహర్ జోషి, మోదీ వివేకానందుడికి నివాళులర్పించారు. అప్పుడు సాధారణ బీజేపీ కార్యకర్తగా అక్కడికి వెళ్లిన మోదీ.. ఇప్పుడు 45 గంటల పాటు ధ్యానం చేపట్టారు. 2019 ఎన్నికల ప్రచారం ముగిశాక కేదార్‌నాథ్ గుహలో ఆయన ధ్యానం చేసిన విషయం తెలిసిందే.
ప్రధాని మోదీ 45 గంటల ధ్యానంలో కేవలం ద్రవపదార్థాలు మాత్రమే తీసుకుంటారని జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. కొబ్బరి నీళ్లు, ద్రాక్ష రసం స్వీకరిస్తారని తెలిపాయి. మౌనంగా ఉంటూ మెడిటేషన్ హాల్ నుంచి బయటకు రారని పేర్కొన్నాయి. తమిళనాడులోని కన్యాకుమారిలో వెలసిన స్వామి వివేకానంద శిలాస్మారకం వద్ద మోదీ నిన్న సా.6.45 గంటలకు ధ్యానం ప్రారంభించారు.
2025 IPL సీజన్‌కు ఒక్కో జట్టు ముగ్గురు ఆటగాళ్లను రిటైన్ చేసుకోనున్నట్లు తెలుస్తోంది. అలాగే ఒకరిని RTM (రైట్ టు మ్యాచ్) ద్వారా ఎంచుకోవచ్చని సమాచారం. దీంతో ఇద్దరు విదేశీ, ఇద్దరు ఇండియన్ ప్లేయర్లను ఫ్రాంఛైజీలు అట్టిపెట్టుకోవచ్చు. దీనిపై BCCI నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మరోవైపు 8 మందిని రిటెన్షన్ చేసుకునేలా అనుమతించాలని ఫ్రాంఛైజీలు BCCIకి విజ్ఞప్తి చేయగా.. ఇందుకు బోర్డు అంగీకరించలేదని టాక్.
ఇన్నాళ్లూ పక్షులు, జంతువులకు పరిమితమైన బర్డ్‌ఫ్లూ USలో మనుషులకూ విస్తరిస్తోంది. తాజాగా మూడో కేసు నమోదైందని, అతనికి ఆవుల నుంచి సోకిందని ఆ దేశ ఆరోగ్య శాఖ వెల్లడించింది. అతను దగ్గు, కళ్ల సమస్యలతో బాధపడుతున్నాడంది. ఇంట్లోనే ఉంచి యాంటీవైరల్ మెడిసిన్ oseltamivirతో చికిత్స అందిస్తున్నట్లు పేర్కొంది. H5N1 అనే వైరస్ కారణంగా బర్డ్‌ఫ్లూ సోకుతుంది. ప్రస్తుతం 50 జంతు జాతులకు విస్తరించడం ఆందోళన కలిగిస్తోంది.
Sorry, no posts matched your criteria.