India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ఈడీ, సీబీఐని మూసివేసేందుకు తాను ప్రతిపాదిస్తానంటూ SP చీఫ్ అఖిలేశ్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ప్రతి రాష్ట్రంలో అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) ఉంది. అలాంటప్పుడు ఈడీ, సీబీఐ ఎందుకు. మోసానికి పాల్పడితే ఆదాయపన్ను శాఖ చూసుకుంటుంది’ అని ఆయన తెలిపారు. ఈడీ, సీబీఐ వంటి సంస్థలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని మండిపడ్డారు.
ఐపీఎల్ చరిత్రలో ఆర్సీబీ వరుసగా 5 లేదా అంతకంటే ఎక్కువ మ్యాచులు గెలిచిన ప్రతీసారి రన్నరప్‌గానే నిలిచింది. 2009లో 5, 2016లో 5, 2011లో 7 వరుస విజయాలు సాధించిన ఆ టీమ్ ఈసారి వరుసగా ఆరు మ్యాచుల్లో గెలుపొందింది. దీంతో ఈసారైనా రన్నరప్‌గా నిలిచే సెంటిమెంట్‌ను బ్రేక్ చేసి ఛాంపియన్‌గా నిలుస్తుందా? అని క్రీడాభిమానులు చర్చించుకుంటున్నారు.
AP: కేంద్రంలో బీజేపీ ఓడిపోవడం, రాష్ట్రంలో ప్రభుత్వం మారడం ఖాయమని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ జోస్యం చెప్పారు. 400 సీట్లు వస్తాయంటూ బీజేపీ మైండ్ గేమ్ ఆడుతోందన్నారు. రాష్ట్ర ప్రజలకు మొదటి శత్రువు మోదీ అని విమర్శించారు. న్యాయవ్యవస్థను మాజీ సీజేఐ వెంకటరమణ, తెలుగు ప్రజలను వెంకయ్యనాయుడు నాశనం చేశారని దుయ్యబట్టారు. ఏపీలో ఎన్నికల హింసకు పోలీసుల వైఫల్యమే కారణమని ఆరోపించారు.
TG: హైదరాబాద్‌లో మల్టీ లెవెల్ కార్ పార్కింగ్(MLCP) పనులు పూర్తి కావడంపై మాజీ మంత్రి కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. ‘2016/17లో నాంపల్లి మెట్రో స్టేషన్ వద్ద PPP మోడ్‌లో ఈ పైలెట్ ప్రాజెక్టును ప్రారంభించాం. కొన్ని సమస్యలతో ఆలస్యమైనప్పటికీ ఇప్పుడు పూర్తయ్యింది. కీలకమైన జంక్షన్లు, మెట్రో స్టేషన్లు, వాణిజ్య కేంద్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటివి ఏర్పాటు చేస్తుందని ఆశిస్తున్నాం’ అని పేర్కొన్నారు.
తనపై దాడి చేసిన బిభవ్(కేజ్రీవాల్ మాజీ PA)ను రక్షించడానికి ఆప్ నేతలు ఆందోళనలు చేయడంపై ఆ పార్టీ MP స్వాతి మలివాల్ Xలో విమర్శలు గుప్పించారు. ‘2012లో ఢిల్లీ గ్యాంగ్ రేప్ బాధితురాలు నిర్భయకు న్యాయం కోసం వీధుల్లో పోరాడినవాళ్లు.. ఇప్పుడు నిందితులను రక్షించడానికి ఆరాటపడుతున్నారు. CCTV ఫుటేజీ డిలీట్ చేసిన వారి కోసం మార్చ్ చేస్తున్నారు. సిసోడియా ఇక్కడ ఉండి ఉంటే నాకు అన్యాయం జరిగేది కాదు’ అని పేర్కొన్నారు.
ఈసారి ప్లేఆఫ్స్‌కు చేరుకోలేకపోయినందుకు చాలా బాధగా ఉందని CSK కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ చెప్పారు. గత ఏడాది ఫైనల్‌లో తాము చివరి 2 బంతులకు 10 రన్స్ చేసి ఛాంపియన్‌గా నిలిచామని, ఈసారీ అదే రిపీట్ అవుతుందనుకున్నామని పేర్కొన్నారు. అయితే యశ్ దయాళ్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారని కొనియాడారు. చాలా మ్యాచ్‌లకు కాన్వే, ముస్తాఫిజుర్ సేవలు లేకపోయినా ఈ సీజన్‌లో తాము పోరాడామని తెలిపారు.
TG: మేడ్చల్ సుచిత్ర పరిధిలోని సర్వే నం.82లో వివాదాస్పద భూమిలో సర్వే కొనసాగుతోంది. ఈ భూమి తమదేనంటూ నిన్న 15 మంది వ్యక్తులు ఘటనాస్థలికి రాగా.. మాజీ మంత్రి మల్లారెడ్డి, రాజశేఖర్ రెడ్డి కూడా వాగ్వాదానికి దిగారు. దీంతో ఎలాంటి ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తగా భారీ బందోబస్తు మధ్య అధికారులు సర్వే నిర్వహిస్తున్నారు.
AP: కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ <<13207718>>తీర్పు<<>> ప్రకారం తనకు పోస్టింగ్ ఇప్పించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి సీనియర్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు లేఖ రాశారు. తనకు పోస్టింగ్ ఇవ్వడంలో జాప్యం జరుగుతోందని.. ఈ నెల 31న పదవీ విరమణ చేయనున్న తనకు న్యాయం చేయాలని కోరారు. తన సస్పెన్షన్ చెల్లదంటూ CAT ఇటీవల ఇచ్చిన తీర్పు కాపీని అందించారు. ఈ లేఖను CECకి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి పంపారు.
హైదరాబాద్-పంజాబ్ మ్యాచ్‌కు వర్షం ముప్పు లేదని వాతావరణ శాఖ తెలిపింది. నగరంలో తేలిక పాటి వర్షం పడే ఛాన్స్ ఉన్నా మ్యాచ్ మధ్యాహ్నమే జరగనుండటంతో ఆటంకం కలిగించే అవకాశం లేదని పేర్కొంది. ఉప్పల్ వేదికగా కాసేపట్లో జరగనున్న ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ గెలిస్తే 17 పాయింట్లతో రెండో స్థానంలోకి వెళ్తుంది. అదే సమయంలో రాత్రి మ్యాచ్‌లో కోల్‌కతా చేతిలో రాజస్థాన్ ఓడితే ఇదే ప్లేస్ ఖరారవుతుంది.
AP: తిరుపతి ఎస్వీయూ క్యాంపస్‌లో ఎన్నికల తర్వాత జరిగిన ఘర్షణలపై సిట్ దర్యాప్తు చేస్తోంది. ఎస్వీయూ పీఎస్‌లో నమోదైన కేసులు, FIRల వివరాలను పరిశీలించింది. అనంతరం పద్మావతి మహిళా వర్సిటీలో పులివర్తి నానిపై జరిగిన దాడి ఘటనపై విచారణ చేసింది. క్షేత్రస్థాయి పర్యటన అనంతరం ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది.
Sorry, no posts matched your criteria.