India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

దేశంలో ఆరో విడత పోలింగ్ నేపథ్యంలో బిహార్‌లో రైలు థీమ్‌తో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలు ఆకట్టుకుంటున్నాయి. సివాన్ జిల్లాలో పోలింగ్ కేంద్రాలను రైలు భోగీల వలె అందంగా తీర్చిదిద్దడంతో ఓట్లు వేసేందుకు జనం బారులు తీరారు. మరోవైపు మధ్యాహ్నం 3 గంటల వరకు దేశంలో 49.2శాతం ఓటింగ్ నమోదైంది. అత్యధికంగా పశ్చిమ బెంగాల్‌లో 70.19శాతం, అత్యల్పంగా యూపీలో 43.95 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.

రేపు వర్షంతో SRH, కేకేఆర్ మధ్య ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ నిర్వహణ సాధ్యపడకపోతే రిజర్వ్ డే అయిన మే 27న జరగనుంది. ఆ రోజు కూడా వర్షం పడి మ్యాచ్ రద్దయితే లీగ్ దశలో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న జట్టును విజేతగా ప్రకటిస్తారు. దీంతో టేబుల్ టాపర్‌గా నిలిచిన KKR టైటిల్ అందుకోనుంది. కాగా రేపు చెన్నైలో వర్షాలు కురిసే అవకాశం 3 శాతమేనని వాతావరణ శాఖ తెలిపింది.

‘హనుమాన్’ సినిమా భారీ విజయం అందుకోవడంతో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ బాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమయ్యారు. హీరో రణ్‌వీర్ సింగ్‌తో పాన్ ఇండియా సినిమా తీయనున్నారు. దీనిని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుండగా ఇప్పటికే ఫొటోషూట్, ప్రోమో షూట్ పూర్తయినట్లు తెలుస్తోంది. త్వరలోనే గ్రాండ్‌గా అనౌన్స్ చేయనున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. అయితే ఈ ప్రాజెక్టు నుంచి రణ్‌వీర్ తప్పుకున్నట్లు పుకార్లొస్తున్న విషయం తెలిసిందే.

TG: ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల MLC ఎన్నికల ప్రచారం ముగిసింది. ఈ నెల 27న ఈ మూడు జిల్లాల్లోని పట్టభద్రులు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. జూన్ 5న ఫలితం వెలువడుతుంది. ఇక్కడ ఎమ్మెల్సీగా ఉన్న పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలవడంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే.

తెలుగు తేజం పీవీ సింధు మలేషియా మాస్టర్స్ టైటిల్‌కు అడుగు దూరంలో ఉన్నారు. ఇవాళ సెమీఫైనల్లో థాయ్‌లాండ్ ప్లేయర్ బుసానన్‌పై 13-21, 21-16, 21-12 పాయింట్ల తేడాతో ఆమె గెలుపొందారు. చైనా ప్లేయర్ వాంగ్ ఝీ యీతో రేపు ఫైనల్‌లో తలపడనున్నారు. గత ఏడాది మాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్ ఫైనల్ చేరిన తర్వాత సింధుకు ఇదే అత్యుత్తమ ప్రదర్శన. చివరిసారిగా 2022లో సింగపూర్ ఓపెన్ గెలుచుకున్నారు.

AP: ఓట్ల కౌంటింగ్ నేపథ్యంలో అన్ని జిల్లాలకు ప్రత్యేక పోలీస్ అధికారులను నియమిస్తూ DGP హరీశ్ కుమార్ గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం 56 మందిని స్పెషల్ ఆఫీసర్లుగా నియమించగా పల్నాడు జిల్లాకు అత్యధికంగా 8 మందిని కేటాయించారు. ఎన్నికల రోజు, తర్వాత తలెత్తిన ఘర్షణలను దృష్టిలో పెట్టుకుని శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా వీరు చర్యలు చేపట్టనున్నారు. జూన్ 4న అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలకు కౌంటింగ్ జరగనుంది.

ఎవరైనా టికెట్ క్యాన్సిల్ చేసుకుంటే ఆ సీట్లను ఇతర ప్రయాణికులు బుక్ చేసుకునే సదుపాయాన్ని రైల్వే శాఖ తీసుకొచ్చింది. రైలు బయల్దేరడానికి 5ని.షాల ముందు కూడా వాటిని రిజర్వ్ చేసుకోవచ్చు. IRCTC యాప్‌లో ట్రైన్ సింబల్ క్లిక్ చేస్తే ఛార్ట్ వేకెన్సీలో ఖాళీల వివరాలుంటాయి. irctc వెబ్‌సైట్లోనూ online-chartsలో ట్రైన్, జర్నీ వివరాలు ఎంటర్ చేసి GET TRAIN CHART క్లిక్ చేయాలి. ఖాళీలుంటే బుక్ చేసుకోవచ్చు.

ఈ ఏడాది తమ ప్లేయర్లు అద్భుతంగా ఆడారని RR డైరెక్టర్ సంగక్కర కొనియాడారు. ఈ సీజన్ గొప్పగా గడిచిందన్నారు. ‘కొన్నిసార్లు ఎదురుదెబ్బలు సహజం. లీగ్ తొలి దశలో దాదాపు అన్ని మ్యాచ్‌లు ఓడిన RCB తర్వాత పుంజుకుంది. మళ్లీ ప్లేఆఫ్స్‌లో మా చేతిలో ఓడింది. T20 క్రికెట్ అంటే ఇలాగే ఉంటుంది. ఇవాళ ఎవరు బాగా ఆడితే వారిదే విజయం. లీగ్ చివరి దశలో వరుస ఓటములు మా ఆటగాళ్ల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ తీయలేదు’ అని పేర్కొన్నారు.

ముకేశ్ అంబానీ కుమారుడు అనంత్, రాధికా మర్చంట్ వివాహం సందర్భంగా తమ చిన్న కోడలికి అంబానీ ఫ్యామిలీ ఓ ఖరీదైన గిఫ్ట్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. దుబాయ్‌లో రూ.640 కోట్ల ఖరీదైన విల్లాను కానుకగా ఇవ్వనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంబానీ దీన్ని 2022లోనే కొనుగోలు చేశారట. ఇందులోని 70 మీటర్ల ప్రైవేట్ బీచ్, 10 బెడ్‌రూమ్‌లు, ఖరీదైన ఇంటీరియర్, ఇటాలియన్ పాలరాతి స్పెషల్ అట్రాక్షన్ అని సమాచారం.

సన్‌రైజర్స్‌పై KKR మెంటార్ గౌతం గంభీర్ ప్రశంసలు కురిపించారు. ఆ జట్టు సమతూకంగా ఉందని అభిప్రాయపడ్డారు. ‘SRH బ్యాటర్లు ఈ సీజన్‌లో భారీ స్కోర్లు చేశారు. అలాగని వారికి బ్యాటింగ్ మాత్రమే ఉందనుకుంటే పొరపాటు. భువీ, నటరాజన్, కమిన్స్ వంటి అనుభవజ్ఞులైన పేస్ దళంతో బౌలింగ్ కూడా బాగుంది’ అని పేర్కొన్నారు. రేపు SRH, KKR జట్ల మధ్య ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే.
Sorry, no posts matched your criteria.