India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

AP: ప్రపంచ ప్రసిద్ధి చెందిన తిరుమల క్షేత్రం కలిగి ఉన్న ప్రాంతం తిరుపతి పార్లమెంట్. గతంలో ఇక్కడ ఏకంగా 12 సార్లు కాంగ్రెస్ నెగ్గింది. 2014 నుంచి YCP పాగా వేసింది. సిట్టింగ్ MP మద్దిల గురుమూర్తిని బరిలోకి దింపింది. పొత్తులో భాగంగా ఇక్కడ BJP బరిలో నిలిచింది. YCP గూడురు MLA వరప్రసాద్ BJPలో చేరి టికెట్ దక్కించుకున్నారు. రాయలసీమలో కీలకమైన ఈ ప్రాంతంలో బీజేపీ సత్తా చాటుతుందో? లేదో చూడాలి.
<<-se>>#ELECTIONS2024<<>>

APలో మే 13న జరిగే ఎన్నికల పోలింగ్‌కు వచ్చే వారి కోసం అదనపు బస్సులు ఏర్పాటు చేయాలని APSRTCకి చంద్రబాబు లేఖ రాశారు. ఆర్టీసీ బస్సులు పెంచడం వల్ల ఓటింగ్ శాతం పెరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. అటు స్వస్థలాలకు వెళ్లే ఓటర్లతో రోడ్లన్నీ రద్దీగా మారగా.. బస్సులన్నీ కిటకిటలాడుతున్నాయి.

TG: తాము అమలు చేసిన పథకాలను INC ప్రభుత్వం ఆపేస్తోందని BRS చీఫ్ KCR మండిపడ్డారు. ‘దివంగత YSR మీద కోపంతో మా ప్రభుత్వం ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్ ఆపలేదు కదా? ఈ పథకాలకు అదనపు నిధులు కేటాయించి ముందుకు తీసుకెళ్లడంతో ప్రజలకు లబ్ధి చేకూరింది’ అని తెలిపారు. రాష్ట్రం దివాలా తీసిందని రేవంత్ చెబుతున్నారని, కానీ ఏ సీఎం కూడా అలా చెప్పకూడదని పేర్కొన్నారు. అది స్టేట్ ఇమేజ్‌ను నాశనం చేస్తుందన్నారు.

TG: సీఎం రేవంత్ ఆగస్టు 15న రుణమాఫీ చేస్తానని చెబుతున్నాడు గానీ ఈ ఏడాదేనా అనేది క్లారిటీ లేదని బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ అన్నారు. రైతు సంఘాలు కూడా ఇదే విషయాన్ని తనతో ప్రస్తావించాయని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం రావడమే శాపంగా ఉందని రైతులు భావించారని పేర్కొన్నారు. ఏ ఊరుకు వెళ్తే ఆ ఊరిలో సీఎం ఒట్లు పెట్టడం హాస్యాస్పదంగా మారిందన్నారు. నీటి విషయంలో నిర్వహణ లోపించిందని.. దీంతో పంటలు ఎండిపోయాయని చెప్పారు.

ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్‌పై ఒక మ్యాచ్‌కి సస్పెన్షన్ వేటు పడింది. RRతో మ్యాచ్ సందర్భంగా స్లో ఓవర్ రేటు(గతంలో 2 సార్లు ఫైన్ వేశారు) కారణంగా అతనిపై ఈ నిషేధంతో పాటు బీసీసీఐ రూ.30 లక్షల ఫైన్ వేసింది. దీంతో రేపు RCBతో జరగాల్సిన మ్యాచ్‌కు అతను దూరం కానున్నారు. కీలకమైన ప్లే ఆఫ్స్‌కు ముందు DCకి ఇది బిగ్ షాక్‌గా చెప్పుకోవచ్చు. పాయింట్ల టేబుల్‌లో DC ప్రస్తుతం 5వ స్థానంలో ఉంది.

AP: 59 నెలలుగా లంచాలు, వివక్ష లేకుండా పాలన చేశామని సీఎం జగన్ చెప్పారు. కైకలూరు సభలో మాట్లాడుతూ.. ‘సంక్షేమ పథకాలు నేరుగా లబ్ధిదారులకు అందడం గతంలో చూశారా? ఈ ఐదేళ్లూ ఇంటి వద్దకే పౌర సేవలను అందించాం. మేనిఫెస్టోలోని 99 శాతం హామీలను నెరవేర్చాం. జగన్‌కు ఓటు వేస్తేనే పథకాలన్నీ కొనసాగుతాయి. చంద్రబాబు సాధ్యం కాని హామీలతో మేనిఫెస్టో ఇచ్చారు. ఆయనను నమ్మితే కొండ చిలువ నోట్లో తలపెట్టడమే’ అని వ్యాఖ్యానించారు.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు భారత క్రికెటర్ హనుమా విహారి మద్దతు ప్రకటించారు. ‘ధర్మం గెలవాలి.. చరిత్రలో ఎప్పుడూ లేని మెజారిటీతో గెలిపించండి’ అని పిఠాపురం ప్రజలను ఉద్దేశిస్తూ ట్వీట్ చేశారు. విహారి నిన్న కూడా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పవన్‌కు మద్దతుగా ఓ వీడియోను పోస్ట్ చేశారు. మరోవైపు తన బాబాయ్ పవన్ కళ్యాణ్ కోసం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈరోజు పిఠాపురం వెళ్లారు.

తనకు CM పదవి ముఖ్యం కాదని, దేశం కోసం వంద సీఎం సీట్లు వదులుకుంటానని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఢిల్లీలో తమ పార్టీ అత్యధిక ఓట్లతో గెలిచిందని, ఆ మెజారిటీ చూశాక తాము ఇక్కడ గెలవలేమని BJPకి అర్థమైందని అభిప్రాయపడ్డారు. అందుకే ఆప్ ప్రభుత్వం పడిపోయేలా తనను జైలులో పెట్టాలని నిర్ణయించుకుందని ఆరోపించారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కేజ్రీవాల్‌కు నిన్న సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చిన విషయం తెలిసిందే.

TG: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్రంలో విద్యుత్ కోతలు మొదలయ్యాయని బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ దుయ్యబట్టారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘అసెంబ్లీ ఎన్నికల్లో ఉన్నంత జోష్ కాంగ్రెస్ నేతల్లో ప్రస్తుతం కనిపించలేదు. శ్వేతపత్రాల పేరుతో కాంగ్రెస్ చిల్లర రాజకీయాలు చేసింది. ఆ పార్టీ చేసిన తప్పులే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను కాటేస్తాయి’ అని విమర్శించారు.

AP: ఇంటి వద్ద పెన్షన్‌లు ఇవ్వకుండా జగన్ శవ రాజకీయాలు చేశాడని చంద్రబాబు దుయ్యబట్టారు. ‘అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛను రూ.4వేలకు పెంచి ఏప్రిల్ నెల నుంచే అందిస్తాం. మీ భూమి మీరు అమ్ముకోవడానికి లేకుండా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రూపొందించారు. దీని ద్వారా ప్రజల భూములు కొట్టేసే కుట్ర చేస్తున్నారు. అధికారంలోకి వచ్చాక మెగా DSCపై తొలి సంతకం, LT చట్టం రద్దుపై రెండో సంతకం చేస్తా’ అని తెలిపారు.
Sorry, no posts matched your criteria.