India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

AP: రాష్ట్రంలోని కొన్ని నియోజకవర్గాల్లో YCP తమ అభ్యర్థులను మారుస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మైలవరం-జోగి రమేశ్, విజయవాడ వెస్ట్-పోతిన మహేశ్, గుంటూరు2- కిలారు రోశయ్య, గుంటూరు ఎంపీ-విడదల రజినీ, కర్నూలు ఎంపీ-KE ప్రభాకర్, పి.గన్నవరం-పాముల రాజేశ్వరి, అవనిగడ్డ-సింహాద్రి చంద్రశేఖర్, చిలకలూరిపేట-మర్రి రాజశేఖర్, రాయచోటి-రెడ్డప్పగారి రమేశ్ రెడ్డికి సీట్లు కేటాయిస్తున్నట్లు సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.

గుజరాత్‌లో ప్రతి సంవత్సరం దసరాతో పాటు ఇతర పండగల సందర్భంగా మత మార్పిడులు జరుగుతుంటాయి. ఎక్కువగా దళితులు బౌద్ధత్వంలోకి మారుతుంటారు. అయితే ఈ విషయానికి సంబంధించి గుజరాత్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బుద్ధిజం కూడా ఒక మతమేనని, అందులో చేరాలంటే గుజరాత్ మత స్వేచ్ఛా చట్టం 2003 ప్రకారం జిల్లా మేజిస్ట్రేట్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలని సర్క్యులర్ విడుదల చేసింది.

కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, ఆయన తమ్ముడు ఎంపీ డీకే సురేశ్‌తో ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల భేటీ అయ్యారు. బెంగళూరులో వీరిద్దరితో ఆమె ఎన్నికల ప్రచారంపై చర్చించినట్లు తెలుస్తోంది. ఏపీలో ప్రచారం చేయాలని వారిని కోరినట్లు సమాచారం. కాగా ఏపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనే 10 మంది కర్ణాటక నేతలతో కూడిన జాబితా తయారైనట్లు టాక్. ఆ జాబితాలో వీరిద్దరూ కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

బొలీవియాలోని ఓ న్యూస్ ఛానల్ సిబ్బందికి ఓ కుక్కపిల్ల షాకిచ్చింది. జంతువుల దత్తతను ప్రోత్సహించడానికి ఒక వీధి కుక్కపిల్లను లైవ్ న్యూస్ ప్రోగ్రామ్‌లోకి తీసుకొచ్చారు. న్యూస్ యాంకర్ ఆ కుక్కపిల్లను తడుముతూ మాట్లాడుతుండగా.. అది డెస్క్‌పైనే మల విసర్జన చేసింది. దీంతో ప్రోగ్రామ్‌లో ఉన్నవారంతా అవాక్కయ్యారు. దీనికి సంబంధించిన వీడియోను న్యూయార్క్ పోస్ట్ వెబ్‌సైట్లో పంచుకుంది.

యూజర్లకు ఐఫోన్ తయారీ సంస్థ యాపిల్ హెచ్చరికలు జారీ చేసింది. ‘మెర్సెనరీ స్పైవేర్’ ద్వారా సైబర్ దాడులు జరిగే అవకాశం ఉందని వార్నింగ్ ఇచ్చింది. భారత్‌తో సహా 91 దేశాల యూజర్లకు ఈ ప్రమాదం పొంచి ఉందని పేర్కొంది. గత ఏడాది రాజకీయ ప్రతినిధులకు సైబర్ దాడులు పొంచి ఉన్నాయని యాపిల్ పంపిన వార్నింగ్ నోటిఫికేషన్ చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే.

AP: టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ నేత విజయసాయిరెడ్డి సెటైర్లు వేశారు. ‘బాధ్యత కలిగిన నాయకులు బియ్యం, పప్పు, ఉప్పు, వంటనూనెల ధరలు తగ్గిస్తామని హామీలివ్వడం చూశాం. కానీ చంద్రబాబు స్టైలే వేరు కదా! మద్యం ధరలు తగ్గిస్తానని ముసిముసిగా నవ్వుతున్నాడు. ఆయన దృష్టిలో సంపద సృష్టి అంటే ఇదేనేమో!’ అని అన్నారు. అధికారంలోకి వస్తే మద్యం ధరలు తగ్గిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.

TG: బీఆర్ఎస్‌కు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సవాల్ విసిరారు. ఎంపీ ఎన్నికల్లో BRS ఒక్క సీటు గెలిచినా తాను దేనికైనా సిద్ధమన్నారు. బీజేపీ మతాలు, కులాల మధ్య చిచ్చు పెడుతోందని విమర్శించారు. రేవంత్ రెడ్డి పదేళ్ల పాటు CMగా ఉంటారని జోస్యం చెప్పారు. కాంగ్రెస్‌లో ఏక్‌నాథ్ షిండేలాంటి వారెవరూ లేరన్నారు. షిండేని సృష్టించింది BJP అన్నారు. హరీశ్, మహేశ్వర్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు.

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఇప్పుడు దరఖాస్తు చేసుకొని ఓటు హక్కు పొందిన వారు కూడా ఈ ఎన్నికల్లో ఓటు వేయవచ్చు. అయితే.. కొత్తగా ఓటు హక్కుకు దరఖాస్తు చేసుకునే గడువు ఈనెల 15తో ముగియనుంది. 2006 మార్చి 31లోపు పుట్టిన వారు ఓటు హక్కు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. ఇప్పటికే 18ఏళ్లు నిండినా ఓటు హక్కు లేని వారు కూడా అప్లై చేసుకోవచ్చు. మీ ఫోన్లోనూ https://voters.eci.gov.in/లో దరఖాస్తు చేసుకోవచ్చు.

AP: ఒంగోలులో టీడీపీ, వైసీపీ ఘర్షణపై YCP ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి స్పందించారు. ‘ప్రచారంలో భాగంగా మా కోడలు కరపత్రాలు ఇస్తుంటే తీసుకోకుండా బూతులు తిట్టారు. TDP వాళ్లు ఇష్టం లేకపోతే తీసుకోవద్దు. అంతేకానీ తిడతారా? నన్ను ఏం చేసినా ఊరుకున్నా.. నా ఫ్యామిలీ జోలికొస్తే ఊరుకుంటానా? చేతగాని వాళ్లమా? మీకు ప్రజలే బుద్ధి చెబుతారు. నేను ప్రజల మనిషిని. రాజకీయాలు లేకపోతే బతకలేమా?’ అని మండిపడ్డారు.

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ వ్యవహారంలో ఓ పార్టీ సుప్రీమ్, ఓ MP, ఓ MLC, ఇద్దరు మాజీ మంత్రులు కీలకంగా వ్యవహరించినట్లు పోలీసులు ఆధారాలు సేకరించారు. వీరంతా అక్రమాలకు పాల్పడ్డారని నిరూపించేందుకు పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. రాధాకిషన్ రావు వాంగ్మూలంలో ఈ విషయాలు బయటపడ్డట్లు టాక్. SIB మాజీ చీఫ్ ప్రభాకర్‌ను విచారిస్తే పూర్తి విషయాలు బయటపడతాయని పోలీసులు చెబుతున్నారు.
Sorry, no posts matched your criteria.